Hyderabad Monsoon Walk : వర్షం మజా ఏంటో తెలుసుకోవాలంటే హైదరాబాద్‌లోని ఈ 6 ప్రదేశాలకు వెళ్లి చూడండి
Hyderabad Monsoon Walk : వర్షాన్ని ఎంజాయ్ చేయాలి అంటే మున్నార్ లేదా కూర్గ్ (Coorg) మాత్రమే వెళ్లాలని ఎవరు చెప్పారు ?మన హైదరాబాద్‌లోనే ఈ వర్షాకాలంలో సరదాగా అలా అలా నడుచుకుంటూ వెళ్లే ప్రదేశాలు చాలా ఉన్నాయి. భాగ్యనరనంలో ఉన్న పలు పురాతన కట్టడాలు వర్షాకాలంలో కొత్త అందాన్ని సంతరించుకుంటాయి.
ప్రతీ వర్షపు చుక్క నగరంలోని కొన్ని ప్రాంతాను కొత్త పెయింటింగ్‌లా మార్చేస్తుంది. నీలి మేఘాలు వాటి నుంచి కారే ముత్యాల్లాంటి చుక్కలు ఈ ముత్యాల నగరాన్ని మాన్సూనస్ ఆణిముత్యం మార్చేస్తుంది. ఈ సీజన్లో సరదాగా వాక్ (Monsoon Walk) చేయడానికి లేదా చిల్ అవ్వడానికి మీకోసం కొన్ని ఐడియాస్ షేర్ చేస్తున్నాము.
మీకు టైమ్ దొరికితే తప్పకుండా వెళ్లండి. ఎందుకంటే మాన్సూన్ వాక్ అనేది మాన్సూన్లోనే చేయగలం. భారీ వర్షాలు పడే సమయంలో కాకుండా… ఇలా దోబూచులాడుతున్న మేఘాలు ఉన్నప్పుడు మాత్రమే ఎంజాయ్ చేయగము. వర్షం ఎక్కువ అవ్వక ముందే ఇక్కడికి వెళ్లిరండి మరి.
- ఇది కూడా చదవండి : Hyderabad Street Food : నోరూరించే స్ట్రీట్ ఫుడ్ కోసం చూస్తున్నారా? హైదరాబాద్‌లో ఈ 9 చోట్ల ట్రై చేయండి ?
కుతుబ్ షాహీ టూంబ్స్ | Qutb Shahi Tombs
రాత్రి నుంచి ముసురు, ఉదయమే చిరుజల్లు అనేలే ఉన్నప్పుడు బండి కిక్ కొట్టి కుతుబ్ షాహీ టూంబ్స్కు వెళ్లండి. 16 శతాబ్దానికి చెందిన ఈ నిర్మాణం పరిసరాల్లో లాన్ చాలా అందంగా ఉంటుంది. ఆకాశం కూడా నేలపై ఉన్న పచ్చదనాన్ని మరింత అందంగా చూపించేందుకే వర్షిస్తున్నట్టు ఉంటుంది సీన్.

మీతో పాటు గొడుగును తీసుకెళ్లడం మర్చిపోకండి. గొడుగు బయట చేయి పెట్టి వర్షపు నీటిని ఒడిసిపట్టుకోవడం మాత్రం అస్సలు మరవకండి.
మీలో ఉన్న ఫోటో గ్రాఫర్‌ను ఏ బాబు లే అని చెప్పి మీతో పాటు నిద్రలేపండి. వెళ్లి అందమైన ఫోటోలు తీసుకోండి.
గొల్కొండ కోట | Golconda Fort In Monsoon
అప్పట్లో రాజుగారు వర్షంలో గొల్కొండపై నడిచేవారో లేదా నాకు తెలియదు. కానీ మీరు మాత్రం గొల్కొండ కోటపై వర్షాన్ని చూస్తూ నడవచ్చు. ఈ కోట పై నుంచి చూస్తే మొత్తం హైదరాబాద్‌లో వర్షం ఎక్కడ పడుతుందో…ఏ ప్రాాంతం ఎంత అందంగా ఉంటుందో తెలుస్తుంది.
మంచి షూస్ వేసుకోవడం ఎలాగూ మీరు మర్చిపోరూ అలాగే మంచి ఫ్రెండ్‌ను నిద్రలోంచి లేపి మరీ తీసుకెళ్లడం కూడా మర్చిపోకండి. ఎందుకంటే మీ ఫోటోలు తీయడానికి ఎవరైనా కావాలి కదా…(జస్ట్ కిడ్డింగ్)
వర్షం పడుతున్నప్పుడు సహజంగానే జనం తక్కువగా ఉంటారు. సో మీరు రద్దీ లేని ఈ సమయంలో రిలాక్స్ అవ్వొచ్చు. కోట పరిసరాల్లో సర్రున జారే నీటి ధారలు, చల్లగా వీచే గాలులు, బిజీబిజీగా అటూ ఇటూ తిరిగే మేఘాలు కాదేది ఫోటోగ్రఫీకి అనర్హం అన్నట్టుగా ఉంటాయి.
కొండపైన అత్యంత ఎత్తులో ఉన్న భవనంపైకి ఎక్కితే ఒక రాజు తన నగర వైభవాన్ని చూసి మురిసిపోయినట్టు మీరు కూడా మురిసిపోవచ్చు.
- ఇది కూడా చదవండి : Sarva Pindi : నోట్లో వేసుకోగానే కరకరలాడే అద్భుతం.. తపాలా చెక్కకు ఫిదా అవుతున్న జనం..హైదరాబాద్ లో దొరికే ప్లేసెస్ ఇవే
చాయ్ బ్రేక్ | Shah Ghouse Cafe
ఎంత రాజనై 24 గంటలూ తన రాజ్యం అందాన్ని చూస్తూ కూర్చోలేడు కదా. అతను కూడా కిందికి దిగి ఛాయ్ (Irani Chai) తాగాలి కదా. అందుకే మీరు కూడా గోల్కొండ నుంచి బయటికి వచ్చాక దగ్గర్లోనే టోలిచౌకి దగ్గర షా ఘౌస్ కేఫ్ ఉంటుంది అక్కడికి వెళ్లి ఇరానీ ఛాయ్‌తో పాటు సమోసాలు (Samosa) ట్రై చేయండి. ఈ వర్షాల్లో ఇరానీ ఛాయ్ తాగేందుకు ఆ మాత్రం కష్టపడకతప్పదు.
Hyderabad Monsoon Walk : ఛాయ్‌తో సమోసా నచ్చకపోతే మిమ్మల్ని మీరు ఫోర్స్ చేసుకోకండి. ఎందుకంటే ఉస్మానియా బిస్కెట్ (Osmania Bisuit) మీ కోసం రెడీగా ఉంటుంది. ఇక ఛాయ్ తాగే టైమ్‌లో అది కూడా ఇరానీ ఛాయ్ తాగే టైమ్‌లో ఫోన్ చూడకుండా లోకల్స్ ఏం మాట్లాడుతున్నారో వినండి. ఇంట్రెస్టింగ్గా ఉంటాయి వాళ్ల మాటలు. వీలైతే మాటలు కలిపి ఛాయ్ ఆఫర్ చేయండి. Bhai, Lets Have Irani Chai అని అనగొచ్చు.
చార్మినార్ | Charminar in Rain | Hyderabad Monsoon Walk
హైదరాబాద్ అన్నప్పుడు ముందు చార్మినారే గుర్తొస్తుంది. ఇక వర్షం పడుతున్నప్పుడు చార్మినార్ ఎలా కనిపిస్తుందో ఊహించుకోండి. ముత్యాల బజార్ మధ్యలో కడిగిన ముత్యంలా కనిపిస్తుంది. చిరు జల్లు కురస్తుండగా చార్మినార్ పరిసరాల్లో తిరిగితే ఆ మజానే వేరు. కమాన్లు, మినార్లు మనల్ని ఫ్లాష్‌బ్యాక్ టైమ్‌లోకి తీసుకెళ్తాయి.
- ఇది కూడా చదవండి : Hyderabad Street Food : హైదరాబాదీలకు మాత్రమే తెలిసిన సీక్రెట్.. బేగంబజార్‌లో పబ్లిసిటీ లేకుండానే క్యూ కట్టించే కచోరీలు!
దారి పొడవునా పరుచుకుని ఉన్న గ్రానైట్ రాళ్లు వర్షానికి తడిసి కొత్త రంగులో కనిపిస్తాయి. వర్షం నీటికి రంగు ఉండదు కానీ, అది దేనిపై పడుతుందో దాని అసలు రంగును బయటికి తీస్తుంది. లాస్ట్ టైమ్ నా ఫ్రెండ్‌తో వెళ్లాను. వర్షం పడటంతో మేకప్ పోయి అసలు రంగు బయట పడింది. అందుకే అనుభవంతో చెప్పగలిగాను (ఇప్పుడు నేను ఆ విషయం మాట్లాడను. ఎందుకంటే తను కూడా ఈ పోస్టు చదువుతుంది)

సరే మరి చార్మినార్ వెళ్లాక బిర్యానీయో (Hyderabad Biryani), షవర్మానో, హలీమో తింటానని మీ మనసంటే క్షణం ఆలోచించకుండా కానిచ్చేయండి.
పొట్ట నిండాకా, గొడుగు తెరిచి లాడ్ బజార్ వెళ్లి వర్షంలో గాజుల మెరుపు చూడండి. (ఏదో అన్నాను కానీ అవి మెరుస్తాయి అని నేను అనుకోను. కానీ చూడటానికి బాగుంటుంది ఆ సీన్). ఆదే సమయంలో వర్షం తగ్గితే కాస్త రెస్ట్ తీసుకోవడానికి పక్కడే మక్కా మసీదులోకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకోండి.
అవకాశం ఉంటే రోడ్డుపై ఉన్న నీటిలో చార్మినార్ ప్రతిబింబాన్ని ఫోటో తీయండి. బాగొస్తే మీ స్టేటస్‌లో షేర్ చేయండి.
ఇంకో విషయం, ఫోటోలను తీసే ముందు పర్మిషన్ తీసుకోండి…ఎవరిది ? చార్మినార్ ది. చార్మినార్, నీ ఫోటో తీసుకొవచ్చా అని అడగండి. మౌనం అర్థాంగికారం కాబట్టి తీసేయండి. ఐడియా నచ్చితే రీల్ కూడా చేసేయండి. ఎందుకంటే నా ఐడియాలు అన్ని ఇంప్లిమెంట్ చేసేంత టైమ్ నాకు లేదు. మీరు చేేసి లింక్ షేర్ చేయండి.
పురానీ హవేలి, పాత పాత బజార్లు | Purani Haveli
ఇంకాస్త ముందుకెళ్లి పురానీ హవేలి దారిలోకి ఎంటర్ అవ్వండి. శిథిలమవుతున్న హవేలిని మరింత అందంగా చూపించడానికి ఆకాశమే పెయింటర్లా మారి కలర్ వేసినట్టు అనిపిస్తుంది సీన్. పాత దర్వాజాలు, చెక్కతో చెక్కిన బాల్కనీలు, పరిసర ప్రాంతాలను చూస్తే ముత్తాతల కాలంలోకి వెళ్లినట్టు అనిపిస్తుంది.
ఇది కూడా చదవండి : Japanese Restaurant : హైదరాబాద్‌లోనే జపాన్ టేస్టీ ఫుడ్.. బేగంపేటలో ఆహారప్రియులను ఆకట్టుకుంటున్న కొత్త రెస్టారెంట్
నెక్లెస్ రోడ్డు | Necklace Road
Hyderabad Monsoon Walk : వర్షం కురస్తుంటే ట్యాంక్ బండ్ అండ్ నెక్లెస్ రోడ్డు ఏరియా మొత్తం కొత్తగా కనిపిస్తుంది. సాయంత్రం సమయంలో అద్భుతమైన ఫీల్ కోసం ఇక్కడికి వెళ్లొచ్చు. వర్షం పడనప్పుడు అందుబాటులో ఉన్న నాలుగు బెంచుల్లో ఏదైనా ఖాళిగా కనిపిస్తే అందులో కూర్చోండి.ఎందుకంటే ఈ బెంచులు మామాలూ టైమ్‌లో ఖాళీగా అస్సలు ఉండవు. నెక్లెస్ రోడ్డు వెళ్తే గొడుగు తప్పనిసరి. ఎందుకంటే రెయిన్ షెడ్స్ ఉండవు.
ఇక నెక్లెస్ రోడ్డు వెళ్తే తప్పుకుండా రెండు పనులు చేయండి.
- హుస్సేయిన్ సాగర్‌లో (Hussain Sagar) వర్షం ఎలా పడుతుందో చూడండి. నీరు నీరు కలిస్తే ఎలా ఉంటుందో లైవ్‌లో చూడొచ్చు.
- నీరు + నీరు = నీరు అనే ఫార్ములాను నేనే కనుక్కున్నాను. లైవ్‌లో అది చూడొచ్చు.
- నల్లని బొగ్గులపై మనకోసమో ఫ్రై అవుతున్న మక్కబుట్టలు (మొక్కజొన్న) కొనేసి ఎంజాయ్ చేయండి. చిన్న చిన్న సరదాలే లైఫ్‌లో ఒక కాంప్లిమెంట్ అని మర్చిపోకండి..
ఈ వియయాలు మర్చిపోకండి
వర్షాకాలంలో బయటికి వెళ్తున్నప్పుడు కొన్ని విషయాలను గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా ఇలాంటి థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్ కోసం వెళ్తున్నప్పుడు…
- మంచి స్లిపర్స్ వేసుకోండి. లేదంటే జారిపడతారు.
- రెయిన్ జాకెట్ లేదా పోంచో (poncho) ను తీసుకెళ్లడం మర్చిపోకండి.
- మొబైల్, కెమెరాను వాటర్‌ఫ్రూఫ్ కవర్లో దాచేయండి.
- మేఘాల్లో ఎంత నీరున్నా మీ శరీరానికి పైసా లాభం లేదు కదా. అందుకే మీరు కూడా అప్పడప్పుడు నీరు తాగండి.
- ఈ సమయంలో కొన్ని ప్రాంతాల్లో పాకురు లేదా పాకుడు …వాటెవర్ ఉంటుంది. అందుకే జాగ్రత్తగా నడవండి.
ఈ పోస్టు నచ్చితే షేర్ చేయండి.
ఈ వెబ్సైట్ నచ్చితే కేర్ చేయండి.
మీ ఫ్రెండ్స్‌కు రిఫర్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.