హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్ ప్రారంభించిన ఇండిగో | Hyderabad To Madinah Direct Flight

షేర్ చేయండి

హైదరాబాద్ నుంచి మదీనాకు డైరక్ట్ ఫ్లైట్స్ మొదలయ్యాయి. (Hyderabad To Madinah Direct Flights ) ప్రారంభించినట్టు జీఎంఆర్ హైదరాబాద్ ఎయిర్‌పోర్టు (GMR Hyderabad International Airport Ltd) ప్రకటించింది. 

ఈ విమానాన్ని ఇండిగో ఎయిర్‌లైన్స్ (IndiGo Airlines) సంస్థ నడపనుంది. ఈ రూట్లో ప్రారంభమైన తొలి ఫ్లైట్‌‌లో ప్రయాణికులు ఉత్సాహంగా తమ ప్రయాణాన్ని మొదలు పెట్టారు. ఈ కొత్త రూట్లో విమానాన్ని నడిపి అంతర్జాతీయంగా మరో ప్రాంతానికి డైరక్ట్ విమాన సర్వీసును మెదలు పెట్టింది శంషాబాద్ విమానాశ్రయం. దీంతో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మంచి సందర్శించే ఆధ్యాత్మిక నగరానికి ఇకపై హైదరాబాద్ ప్రజలు డైరక్టుగా వెళ్లవచ్చు.

కొత్త ఫ్లైట్ వివరాలు | Hyderabad to Madinah Flight Details

హైదరాబాద్ నుంచి మదీనాకు వెళ్లే విమానాలు వారానికి మూడు సార్లు నడుస్తాయి. ప్రతీ సోమవారం, గురువారం, శనివారం రోజు ఇవి హైదరాబాద్ నుంచి మదీనాకు బయల్దేరుతాయి. ఇక జర్నీ విషయానికి వస్తే 5 గంటల 47 నిమిషాల పాటు మదీనా వెళ్లే ప్రయాణికులు ఈ ఫ్లైట్‌లో ప్రయాణించాల్సి ఉంటుంది. 

ఈ కొత్త రూట్ అనేది కేవలం మా అంతర్జాతీయ నెట్వర్కును (International Airlines) విస్తరించడంతో పాటు మా ప్రయాణికులకు సరికొత్త ప్రయాణ అనుభవాన్ని కలిగిస్తూ హైదరాబాద్‌తో ప్రపంచంలోనే ప్రముఖ ఆధ్యాత్మిక నగరాల్లో ఒకటైన మదీనాను కలుపుతుంది అని జీఎంఆర్ సీఈఓ ప్రదీప్ పేనికర్ తెలిపారు.

ప్రయాణికులకు కలిగే లాభాలు | Benefits of the Hyderabad-Madinah Flights

IndiGo Launches Direct Flights from Hyderabad to Madinah, Connecting Travelers to a Sacred Destination

హైదరాబాద్ నుంచి మదీనా విమాన సేవలు వల్ల ప్రయాణికులకు ఈ కింది ప్రయోజనాలు కలగనున్నాయి: 

  • డైరక్ట్ కనెక్టివిటీ : ఇకపై ప్రయాణికులు లేయోవర్స్ (Layovers) చేసే అవసరం ఉండదు. దీంతోవారి సమయం మిగులుతుంది. ప్రయాణం మరింత కంఫర్టబుల్ అవనుంది.
  • షెడ్యూల్ చేసుకోవచ్చు : ఈ విమానం వారానికి మూడుసార్లు నడుస్తుంది. ఇది వీకెండ్‌‌తో పాటు వీక్‌డేస్‌లో మదీనా వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు ఉపయోగపడుతుంది.
  • అంతర్జాతీయ నెట్వర్క్ : హైదరాబాద్ -మదీనా డైరక్ట్ విమానం ప్రారంభం అవడంతో అంతర్జాతీయంగా మరో కీలక నగరంతో హైదరాబాద్ కనెక్ట్ అయింది. దక్షిణాసియా (South Asian Countries), ఈశాన్య ఆసియా నుంచి ప్రయాణికుల సంఖ్య పెరగనుంది. 
  • మదీనాకు వెళ్లే ప్రయాణికులు గతంలో లేయోవర్స్ చేయాల్సి వచ్చేది. లేదా కనెక్టింగ్ విమానాల  కోసం చాలా ఇబ్బంది పడాల్సి వచ్చేది. టైమ్ అండ్ మనీ రెండూ సమస్యగా మారేవి. కానీ కొత్త డైరక్ట్ విమాన సర్వీసుతో ఈ ఇబ్బందులకు చెక్ పడనుంది. 
  • ప్రయాణికుల కేంద్రం : ఈ డైరక్ట్ విమాన సర్వీసుతో మిడిల్ ఈస్ట్ దేశాలకు (Middle East Countries) వెళ్లేందుకు హైదరాబాద్ ఒక కేంద్రంగా మారనుంది. 
  • ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!