కాకినాడ–తిరువణ్ణామలై మధ్య స్పెషల్ ట్రైన్స్ | Kakinada to Tiruvannamalai Train
Kakinada to Tiruvannamalai Train : కాకినాడ నుంచి అరుణాచలం వెళ్లే భక్తులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్ న్యూస్ ప్రకటించింది. ప్రయాణికుల రద్దీని నిర్వహించేందుకు కాకినాడ టౌన్ నుంచి తిరువణ్ణామలై మధ్య ప్రత్యేక రైళ్లను ప్రకటించింది.
ఈ రైళ్ల వల్ల ఆంధ్రప్రదేశ్, తమిళనాడు మధ్య ప్రయాణం చేసే భక్తులు, ప్రయాణికులకు మరింత వెసులుబాటు లభించనుంది.
ట్రైన్ నెం. 07617 | Kakinada Town – Tiruvannamalai
ఈ ట్రైన్ 2026 ఫిబ్రవరి 14వ తేదీ (శనివారం) మధ్యాహ్నం 2:00 గంటలకు కాకినాడ టౌన్ నుంచి ప్రారంభమై, తదుపరి రోజు (ఆదివారం) ఉదయం 6:30 గంటలకు తిరువణ్ణామలై చేరుకుంటుంది.
తిరుగు ప్రయాణం విషయానికి వస్తే
ట్రైన్ నెం. 07618 | Tiruvannamalai – Kakinada Town
ఈ రైలు 2026 ఫిబ్రవరి 16వ తేదీ (సోమవారం) ఉదయం 3:00 గంటలకు తిరువణ్ణామలై నుంచి బయలుదేరి, అదే రోజు రాత్రి 8:30 గంటలకు కాకినాడ టౌన్‌కు చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సామల్కోట్, రాజమండ్రి, విజయవాడ, నెల్లూరు, రేణిగుంట, తిరుపతి, కాట్పాడి, వెల్లూరు కంటోన్మెంట్ వంటి ముఖ్యమైన స్టేషన్లలో ఆగుతాయి.
ప్రయాణికుల సౌకర్యార్థం ఈ రైళ్లలో 1ఏసి, 2ఏసి, 3ఏసి, స్లీపర్, జనరల్ క్లాస్ కోచులు అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
తీర్థయాత్రికులు మరియు సుదూర ప్రయాణాలు చేసే ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఈ ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసినట్లు రైల్వే వర్గాలు వెల్లడించాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
▶️ వీడియో చూడండి : 3,000 అడుగుల ఎత్తులో పర్యాటక మంత్రితో ప్రయాణికుడు – ప్రత్యేక వీడియో
