తిరుపతిలో (Tirupati) శ్రీ కోదండరామ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగా మూడవ రోజున స్వామి వారు సింహ వాహనంపై భక్తులకు దర్శనం ఇచ్చారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తుల్లో ఉత్సాహం ఎలా ఉందో మీరు దిగువన ఉన్న ఫోటోలలో చూడవచ్చు.

స్వామివారు సింహ వాహనంపై (simhavahanam) దర్శనం ఇవ్వడాన్ని అజ్ఞానంతో తప్పుగా ప్రవర్తించే దుష్టలను హరించడడానికి ప్రతీకగా చెబుతారు. శ్రీ కోదండరామ స్వామి (Sri Kodandarama Swamy ) వారి ఆలయంలో ఉదయం 10.30 నుంచి 11.30 వరకు స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది.

భారీ సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు | Tirupati
శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోడండరాములవారి ఉత్సవ మూర్తులకు పసుపు, చందనం, కొబ్బరినీళ్లు, తేనె, పెరుగు, పాలతో అభిషేకం చేశారు. స్నపన తిరుమంజనం వేడుక చూసేందుకు భారీ సంఖ్యలో భక్తులు తరలి వచ్చారు.

ఇక ఈ రోజు సాయంత్రం ( మార్చి 29న) రాత్రి 7 గంటల నుంచి రాత్రి 8.30 వరకు శ్రీ కోదండరాముడు ముత్యపు పందిరి వాహనంపై విహరించి భక్తులకు దర్శనవ ఇవ్వనున్నారు.

స్వామివారి వాహన సేవలో పెద్ద జీయర్ స్వామి, చిన్న జీయర్ స్వామితో పాటు, ఆలయ సిబ్బంది కూడా పాల్గోనున్నారు.

ప్రతీ ఏడాది నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలకు భక్తులు దూర దూరం నుంచి తరలి వస్తుంటారు.స్వామివారి దర్శనం చేసుకుని ఆధ్యాత్మిక అనుభూతిని పొందుతారు భక్తులు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.