Indian Railways: భారతీయ రైల్వేలో కీలక మార్పులు.. 8 గంటల ముందే చార్ట్ తయారీ.. తత్కాల్ టికెట్లకు ఆధార్ తప్పనిసరి!
Indian Railways: రైలు టికెట్ బుకింగ్‌లో టెన్షన్ అక్కర్లేదు.. భారతీయ రైల్వే ప్రయాణికుల కోసం అదిరిపోయే మార్పులు తీసుకువస్తోంది. ఇకపై మీ వెయిట్‌లిస్ట్ టికెట్ కన్ఫర్మ్ అయ్యిందా లేదా అని చివరి నిమిషం వరకు టెన్షన్ పడాల్సిన పనిలేదు. తత్కాల్ టికెట్లకు ఆధార్ లింక్, సూపర్ ఫాస్ట్ బుకింగ్ సిస్టమ్.. ఇలా చాలా అప్డేట్స్ రాబోతున్నాయి. అవేంటో చూసేద్దాం!
టికెట్ కన్ఫర్మ్ అయిందా?
ప్రయాణికులు ఎదుర్కొనే పెద్ద సమస్యల్లో ఒకటి రైలు బయలుదేరే వరకు తమ టికెట్ కన్ఫర్మ్ అవుతుందా లేదా అని తెలియకపోవడం. ఈ టెన్షన్ తగ్గించడానికి భారతీయ రైల్వే ఒక మాస్టర్ ప్లాన్ వేసింది. రైలు బయలుదేరడానికి 8 గంటల ముందే ప్యాసింజర్ చార్ట్‌ను సిద్ధం చేయాలని రైల్వే బోర్డు నిర్ణయించింది. అంటే, మీరు మధ్యాహ్నం 2 గంటల లోపు వెళ్లాల్సిన రైలుకు, అంతకు ముందు రోజు రాత్రి 9 గంటలకే మీ టికెట్ స్టేటస్ తెలిసిపోతుంది. వెయిట్‌లిస్ట్ టికెట్లు ఉన్నవాళ్లకు ఇది నిజంగా పెద్ద రిలీఫ్. పల్లెటూళ్ల నుంచి వచ్చేవారికి, చివరి నిమిషంలో ప్రయాణం చేసేవారికి ఇది ఎంతో మేలు చేస్తుంది. ఒకవేళ టికెట్ కన్ఫర్మ్ కాకపోతే, వేరే ప్లాన్ చేసుకోవడానికి టైం దొరుకుతుంది.

అడ్వాన్స్డ్ పీఆర్ఎస్
ముందుగా చార్ట్‌లు తయారు చేయడంతో పాటు, రైల్వే బోర్డు మరింత పెద్ద ప్లాన్ వేసింది. అదే అడ్వాన్స్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ (PRS). దీన్ని డిసెంబర్ 2025 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్రాజెక్టును రైల్వే సమాచార వ్యవస్థల కేంద్రం అమలు చేస్తుంది. రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కూడా ఈ ప్లాన్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దశలవారీగా దీన్ని అమలు చేయాలని ఆదేశించారు.
ఈ కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ వస్తే, నిమిషానికి ఏకంగా 1.5 లక్షల టికెట్లకు పైగా బుక్ చేసుకోవచ్చు. ప్రస్తుతం నిమిషానికి 32,000 టికెట్లు మాత్రమే బుక్ చేయగలం. అంటే, బుకింగ్ స్పీడ్ దాదాపు ఐదు రెట్లు పెరుగుతుందన్నమాట! టికెట్ ఎంక్వైరీ చేసే సిస్టమ్ కూడా చాలా మెరుగుపడుతుంది. నిమిషానికి 4 లక్షల ఎంక్వైరీల నుండి ఏకంగా 40 లక్షలకు పైగా ఎంక్వైరీలు ప్రాసెస్ చేయగలుగుతారు. దీంతో లక్షలాది మంది ప్రయాణికులు తమ టికెట్ల సమాచారాన్ని నిజ సమయంలో తెలుసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Vatican City : 800 మంది మాత్రమే ఉండే దేశం |15 నిమిషాల్లో చుట్టేయొచ్చు
తత్కాల్ టికెట్లకు ఆధార్ పవర్
ఇక నుంచి తత్కాల్ టికెట్లు బుక్ చేసుకోవడం అంత ఈజీ కాదు. జులై 1 నుండి, ఆధార్ ధృవీకరణ పూర్తి చేసుకున్న వారికి మాత్రమే తత్కాల్ టికెట్ బుకింగ్ అవకాశం ఉంటుంది. టికెట్ బుకింగ్‌లో జరిగే మోసాలను, అక్రమాలను అరికట్టడమే దీని ముఖ్య ఉద్దేశం. అంతేకాదు, జులై చివరి నుండి, టికెట్ బుక్ చేసేటప్పుడు మీ ఆధార్ OTPని కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, ఇకపై తత్కాల్ టికెట్ కావాలంటే ఆధార్ రెడీగా పెట్టుకోండి!
ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
భారతీయ రైల్వే తీసుకొస్తున్న ఈ మార్పులు నిజంగా ప్రయాణికులకు పెద్ద బూస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా, ముందుగానే చార్ట్ రెడీ అవ్వడం వల్ల వెయిట్‌లిస్ట్ ప్రయాణికుల తలనొప్పి తగ్గుతుంది. తత్కాల్ టికెట్లకు ఆధార్ లింక్ చేయడం, OTP ధృవీకరణ వల్ల అక్రమాలు చాలా వరకు తగ్గి, నిజమైన ప్రయాణికులకు న్యాయం జరుగుతుంది. కొత్త పీఆర్ఎస్ (PRS) సిస్టమ్ వల్ల బుకింగ్ ప్రాసెస్ మరింత వేగంగా, పారదర్శకంగా మారుతుంది.
ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.