New Pamban Bridge: ఇంజినీరింగ్ అద్భుతం కొత్త పంబన్ బ్రిడ్జి గురించి ఈ విషయాలు మీకు తెలుసా ?
తమిళనాడులో కొత్త పంబన్ రైల్వే బ్రిడ్జి (New Pamban Bridge) ప్రారంభోత్సవానికి సిద్ధం అయింది. ఈ బ్రిడ్జి అందుబాటులోకి వస్తే రైల్వే మౌలిక సదుపాయాల్లో మరో కీలక మైలురాయిని భారత్ చేరుకున్నట్టు అవుతుంది. రామేశ్వరం ద్వీపం (Rameswaram Island) నుంచి భారత్ భూభాగాన్ని , రైలు మార్గాన్ని కనెక్ట్ చేసే ఈ బ్రిడ్జి భారత దేశ అత్యాధునిక సాంకేతిక పరిఙ్ఞానానికి నిదర్శనంగా భావించవచ్చు.
