Pawan Kalyan : మహా కుంభమేళాలో సతీసమేతంగా పవన్ కళ్యాణ్ పుణ్య స్నానం

షేర్ చేయండి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాలో ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ( Pawan Kalyan) పవిత్ర నదీ స్నానం ఆచరించారు. భార్య అనా కొణిదెల, కుమారుడు అకీరానందన్‌తో పాటు పుణ్య స్నానం ఆచరించారు.

1.ఈ సందర్భంగా మాట్లాడతూ దేశంలో సగం జనాభా పుణ్య స్నానాలు ఆచరించడం చాలా గొప్ప విషయం అన్నారు పవన్
2.కుంభ మేళా పవిత్ర స్నానం అనుభవం గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ‘వేల సంవత్సరాలుగా కుంభమేళా జరుగుతున్నట్లు చరిత్ర చెబుతోంది. నేను గతంలో ఒక యోగి ఆత్మకథ అనే పుస్తకం చదువుతున్నప్పుడు దానిలో కుంభమేళా గురించి వివరిస్తూ ఉన్న వాక్యాలు చదివాను. సుమారు మూడు దశాబ్దాలుగా కుంభమేళాను గమనిస్తున్నాను. ప్రతిసారీ రావాలని భావించినా కుదరలేదు. ఇప్పుడు మహా కుంభమేళాకు రావడం చాలా ఆనందం కలిగిస్తోంది’ అని తెలిపారు.
3.ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్‌తో పాటు తెలుగు సినీ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, టీటీడి సభ్యుడు ఆనంద సాయి కూడా పుణ్యస్నానాలు ఆచరించారు.
4.సనాతన ధర్మం గురించి మాట్లాడుతూ “భారతీయులంతా విభిన్నమైన జాతులు, తెగలు, సంప్రదాయాలను ఆచరిస్తున్నప్పటికీ సనాతన ధర్మం విషయంలో మాత్రం ఏకమవుతారు. దేశం విషయంలో భిన్నత్వంలో ఏకత్వం ఎలా పని చేస్తుందో ధర్మం విషయంలో కూడా భారతీయుల్లో అదే రకమైన ఏకత్వం పని చేస్తుంది. వేల ఏళ్లుగా సనాతన ధర్మం వర్థిల్లుతోంది. సనాతన ధర్మం ఇలాగే భవిష్యత్తులోనూ పరిఢవిల్లాలి. దాదాపు దేశంలో సగం జనాభా కుంభమేళాకు తరలి రావడం చాలా పెద్ద విషయం. ప్రపంచంలో ఇలాంటి మహా కార్యక్రమం ఇప్పటివరకు జరగలేదు. ఇది సనాతన ధర్మం ఆచరించే ప్రతి ఒక్కరి మహా పండుగగా భావిస్తున్నారు. దేశంలోని నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి పుణ్య స్నానాలు ఆచరించి వెళ్లడం మహా అద్భుతం అన్నారు
5.మహా కుంభ మేళా గురించి మాట్లాడుతూ 50 రోజులుగా 50 కోట్ల మందికి పైగా పుణ్యస్నానాలు ఆచరించిన మహా కుంభ మేళా లో జరిగిన కొన్ని సంఘటనలు దురదృష్టకరం. సనాతన ధర్మాన్ని పాటించే వారిపైన, సనాతన ధర్మాన్ని నమ్మే వారి పైన ఇలాంటి సమయంలో కొందరు నేతలు ఇష్టానుసారం మాట్లాడటం బాధ్యతారాహిత్యమే. మహా కుంభ మేళా నిర్వహణలో ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పక్కా ప్రణాళికతో పని చేస్తోంది.అన్నారు
6.ఒక భారీ సమూహం ఒక చోట గుమి కూడినప్పుడు కొన్ని దురదృష్టకర సంఘటనలు జరిగే అవకాశాలున్నాయి. దాన్ని మొత్తంగా సనాతన ధర్మానికి ఆపాదించి, ఆ ధర్మాన్ని నమ్మేవారిపై, సనాతన ధర్మంలో ఆచరించే సంప్రదాయాల నిర్వహణ గురించి ఇష్టానుసారం వ్యాఖ్యానించడం సబబు కాదు. ఇలాంటి దుర్ఘటనలు ఇతర మత ధర్మాలను పాటించే కార్యక్రమాల్లో జరిగితే రాజకీయ నాయకులు ఇలాగే స్పందించేవారా? ఇలాంటి దుర్ఘటనలు దేశంలో ఏ ప్రాంతంలో జరిగినా అక్కడ పరిస్థితిని అర్థం చేసుకొని స్పందిస్తే బాగుంటుంది. సనాతన ధర్మం నమ్మే వారి మనోభావాలను దెబ్బ తీసేలా మాట్లాడడం మంచిది కాదు అన్నారు పవన్ కల్యాణ్.

మహా కుంభమేళాకు ముందు పవన్ కళ్యాణ్ తమిళనాడు, కేరళలో పుణ్య క్షేత్రాలను దర్శించుకున్నారు. కొచ్చిలోని అగస్త్య ముని ఆలయంతో (Agasthya Muni Temple) పాటు, శ్రీ పరుశురాముడి ఆలయం, తమిళనాడులోని స్వామి మలై, మదురై మీనాక్షి అమ్మవారి (Madurai Meenakshi Temple) ఆలయం, కుంభకోణంలోని కుంభేశ్వరుడితో పాటు పలు ఆలయాలను దర్శించుకున్నారు.

ఈ పుణ్య క్షేత్రాల యాత్రలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుమారుడు అకీరా ( Akira Nandan) నందన్, టీటీడీ బోర్డు మెంబర్ ఆనంద సాయి కూడా ఉన్నారు.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!