Brahma Kamal : హిమాలయ పర్వతాల్లో బ్రహ్మకమలం చూశా..మీరు కూడా చూడండి , 15 Facts 

షేర్ చేయండి

హిందూ మతంలో అత్యంత పవిత్రంగా భావించే పుష్పాలలో బ్రహ్మకమలం ( Brahma Kamal ) కూడా ఒకటి. ఇలాంటి ఆధ్మాత్మిక ప్రాధాన్యత ఉన్న పుష్పాన్ని చూడాలి అంటే పైవాడి అనుమతి, ఆయన ఆశిర్వాదం, మంచి సంకల్పం కూడా కావాలి. నాకు దేవుడు ఈ పవిత్ర పుష్పాన్ని చూసే అవకాశం ఇచ్చాడు. ఈ పుష్పాన్ని ఎక్కడ చూశాను ? అక్కడికి ఎలా చేరుకున్నానో ఈ పోస్టులో వివరిస్తాను. దీంతో పాటు బ్రహ్మకమలం కూడా చూపిస్తాను. 

కమలానికి బ్రహ్మకమలానికి మధ్య ఉన్న తేడా

Difference Between Lotus and Brahma Kamal : బ్రహ్మ కమలం అనేది సన్ ఫ్లవర్ ( Sunflower ) జాతికి చెందినది.

కమలం ( Lotus )బ్రహ్మకమలం
ఇది నీటిలో, బురదలో పెరుగుతుందిఇది మట్టిలో పెరుగుతుంది.
కమలం పగటి పూట వికసిస్తుంది. బ్రహ్మకమలం రాత్రి పూట వికసిస్తుంది.
భారత దేశం మొత్తం లభిస్తుంది.గ్రేటర్ హిమాలయల్లోనే లభిస్తుంది.

ఎందుకు వెళ్లాను ?

హిమాలయాల్లో ఉన్న హేంకుండ్ సాహిబ్ గురుద్వారకు ( Hemkund Sahib Gurudwara ) ఆధ్మాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. నా ట్రావెల్ ఛానెల్‌లో వ్లాగ్ కోసం నేను ఇక్కడికి వచ్చాను. హేంకుండ్ సాహిబ్ గురించి ఒక బ్లాగ్ కూడా త్వరలో పబ్లిష్ చేయనున్నాను. హేంకుండ్ సాహిబ్ అనేది…

  • ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వారా .
  • సంవత్సరంలో ఎక్కువ భాగం మంచుతో కప్పబడి ఉంటుంది.
  • ఈ ప్రాంతం జూన్ నెల నుంచి అక్టోబర్ మొదటి వారం వరకు భక్తుల కోసం తెరిచి ఉంటుంది.
  • Read Also: Thanjavur : ఈ ఆలయం నీడ నేలపై పడదు

హేంకుండ్ సాహిబ్ గురుద్వారకు చేరుకోవడానికి హిమాలయ పర్వతాల్లో ( Himalayas ) ట్రెక్కింగ్ చేయాల్సి ఉంటుంది. నేను ఈ ట్రెక్కింగ్ పూర్తి చేసి గురుద్వారలో దర్శనం పూర్తి చేసుకున్న తరువాత చుట్టు పక్కల ప్రాంతాలు తిరగడం మొదలు పెట్టాను.

అప్పుడే మా గైడ్ వచ్చి మనం బ్రహ్మకమలం చూడటానికి వెళ్దామా అన్నాడు. బ్రహ్మకమలం గురించి నేను బద్రినాథ్ ( Badrinath ) అనే సినిమాలో చూశాను. అప్పుడప్పుడు వార్తల్లో చదివేవాడిని. జర్నలిస్టును కాబట్టి కొన్ని సార్లు నేను వార్తలు కూడా రాశాను. కానీ చూసే అవకాశం ఉంది అంటే క్షణం కూడా ఆలోచించకుండా వెళ్దాం అన్నాను. 

కష్టమైన ట్రెక్కింగ్ | Trek For Brahma Kamal

బ్రహ్మకమలం అంటే ఏదో పార్కులో మనకు సులభంగా కనిపిస్తుందేమో అనుకున్నాను. అప్పటికే ట్రెక్కింగ్ ( Hemkund Sahib Trekking ) చేసిన నాకు…మళ్లీ కొద్దిగా ట్రెక్కింగ్ చేయాల్సి ఉంది అని తెలిసింది. 

బ్రహ్మకమలం కోసం గురుద్వార నుంచి రైట్ సైడ్‌లో పర్వతంపైకి వెళ్లాల్సి ఉంటుంది. నేను ఇప్పటి వరకు చేసిన ట్రెక్కింగ్‌లో ఇది కొంచెం డిఫరెంట్ ట్రెక్కింగ్. ఎందుకంటే నేను వెళ్లిన ప్రాంతాల్లో కొద్దో గొప్ప రోడ్డు ఉంటుంది. మెట్లదారి ఉంటుంది. కనీసం ఒక దారి అంటూ ఉంటుంది.

కానీ బ్రహ్మకమలం చూసేందుకు వెళ్లే సమయంలో నాకు ఏ మాత్రం రోడ్డు కనిపించలేదు. పూర్తిగా చిన్నా పెద్ద రాళ్ల మధ్యలోంచి వెళ్లాల్సి వచ్చింది. ప్రతీ రాయిపై చిన్న చిన్న నాచులాంటి మొక్కలు కనిపించాయి. 

ఇక్కడ అక్టోబర్ నుంచి మే వరకు మంచు పడుతుంది. తరువాత కొద్దిగా ఎండ పడటంతో మంచు కరిగి ఈ రాళ్లలో నాచు పెరుగుతుంది. అందుకే ఈ ట్రెక్ చేసే సమయంలో కాస్త జాగ్రత్తగా అడుగులు వేయాల్సి ఉంటుంది. లేదంటే జారిపడే అవకాశం ఉంది.

హేంకుండ్ సాహిబ్ గురుద్వారా సముద్ర మట్టానికి 4,632 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఇక్కడే పవిత్ర బ్రహ్మకమలాన్ని ( Brahma Kamal At Hemkund Sahib )  నేను మొదటిసారి చూశాను. ఈ పుష్పానికి ఆధ్మాత్మికంగా చాలా ప్రాధాన్యత ఉంది. 

బ్రహ్మకమలం ఆధ్మాత్మిక ప్రాధాన్యత

Significance of Brahma Kamal:  బ్రహ్మ కమాలన్ని లోటస్ ఆఫ్ బ్రహ్మా ( Lotus Of Brahma ) అని ఇంగ్లిష్‌లో పిలుస్తుంటారు. ఈ పుష్పానికి హిందూ మతంలో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఈ కమలం సృష్టికర్త బ్రహ్మకు సంబంధించినది అని చెబుతుంటారు.  పవిత్రతకు, స్వచ్ఛతకు, జ్ఞానోదయానికి, ఆధ్మాత్మిక పరిపూర్ణతకు చిహ్నంగా భావిస్తారు. 

Interesting Facts About Brahma Kamal Prayanikudu
రాత్రి మాత్రమే పూర్తిగా వికసిస్తుంది

బ్రహ్మకమలం హిమాలయాల్లోని ఎత్తైన ప్రాంతాల్లో వికసిస్తుంది. మరీ ముఖ్యంగా హేంకుండ్ సాహిబ్ వద్ద ఇవి ఎక్కువ సంఖ్యలో లభిస్తాయి. ఇక్కడ ఈ కమలాన్ని చూడటం అనేది కోరికలను నెరవేర్చి ఆధ్మాత్మిక పరిపూర్ణతకు దోహదం చేస్తుందని భక్తులు భావిస్తారు. బ్రహ్మకమలానికి వాస్తు శాస్త్రంలో కూడా అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు.

బ్రహ్మకమలం మొక్క గురించి

Facts About Brahma Kamal Plant : బ్రహ్మ కమలాన్ని శాస్త్రీయంగా సాసురియా ఓబ్వాలటా ( Saussaurea Obvallata ) అని పిలుస్తుంటారు. ఇది సన్ ఫ్లవర్ కుటుంబానికి చెందిన మొక్క. దీని సుగంధం, అందం ఈ దీనిని అరుదైన పుష్పంగా మార్చాయి. 

మీకో ఇంట్రెస్టింగ్ విషయం కూడా చెబుతాను. అదేంటంటే ఈ పుష్ఫం సంవత్సరానికి ఒకసారి మాత్రమే పుష్పిస్తుంది. అది కూడా జులై నుంచి ఆగస్టు మధ్య కాలంలో మాత్రమే.

ఒకరాత్రి మాత్రమే ఈ పుష్పం తన పూర్తి ఆకారంలో పుష్పిస్తుంది. ఇది చాలా అరుదుగా జరిగే పరిణామంగా చెప్పవచ్చు. ఈ పుష్పానికి ఆధ్మాత్మికంగానే కాదు వైద్య పరంగా కూడా ప్రాధాన్యత ఉంది.

Read Also: షిరిడీ సమాధి మందిరానికి ముందు అక్కడ ఏముండేది ?

బ్రహ్మకమలం పౌరాణిక ప్రాధాన్యత

Brahma Kamalam Mythological Background: పురాణాల ప్రకారం ఈ విశ్వాన్ని సృష్టించిన బ్రహ్మ ఈ బ్రహ్మకమలంపైనే కూర్చుంటారట. ఈ పుష్పం అనేది బ్రహ్మ కన్నీటి నుంచి ఏర్పడింది అని కూడా అంటారు. స్వచ్ఛతకు, పవిత్రతకు, ఆధ్మాత్మికతకు చిహ్నం అని రిగ్వేదంలో కూడా ఉంది.

బ్రహ్మకమలం కథ

Story of Brahma Kamal : బ్రహ్మకమలానికి సంబంధించి ఎన్నో పౌరానిక కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో ఒక కథ ప్రకారం ఒకసారి సృష్టికర్త బ్రహ్మ కమలం పువ్వుపై ధ్యానం చేస్తూ నిద్రలోకి జారుకున్నారట. నిద్ర లేచిన తరువాత బ్రహ్మకమలంలో తను ఐక్యం అయిపోవడాన్ని గమనించారు. అనంతరం ఆ కమలానికి బ్రహ్మకమలం అనే పేరు వచ్చింది. 

  • ఈ పుష్పం గురించి బుద్ధిజంలో ( Brahma Kamal and Buddhism )  కూడా ప్రస్తావన ఉంది.
  • ఈ పుష్పాన్ని శాంతికి, బుద్ధిజం కల్చర్‌కు ప్రతీకంగా చెబుతారు.
  • పాటు టిబెట్, నేపాల్, భుటాన్ ప్రజల సంప్రదాయంలో బ్రహ్మకమలానికి విశిష్టమైన స్థానం ఉంది.
  • గ్రీకులు కూడా ఈ పుష్పాన్ని ఆధ్యాత్మిక కార్యాలకు ఉపయోగించేవారట.

బ్రహ్మకమలం ప్రత్యేకతలు

Characteristics of the Brahma Kamal: బ్రహ్మకమలం ఆధ్మాత్మికంగానే కాదు దాని గుణాల వల్ల కూడా ఎంతో ప్రాధాన్యతను సంపాదించుకుంది. క్వీన్ ఆఫ్ నైట్ ఫ్లవర్స్ ( Queen Of Night Flowers ) అని కూడా పిలిచే ఈ పుష్పానికి ఎన్నో విశిష్టమైన గుణాలు ఉన్నాయి. అవి..

Brahma Kamal At Hemkund Sahib Prayanikudu
బ్రహ్మ కమలాల మధ్య నేను
  • రాత్రి మాత్రమే వికసిస్తుంది | Nocturnal Blooming : బ్రహ్మకమలం కేవలం రాత్రి మాత్రమే వికస్తిస్తుంది. ఈ పుష్ఫం వికసించిన రెండు గంట్లోనే పూర్తిగా అంటే 8 ఇంచుల వరకు విచ్చుకుంటుంది. పుష్పం రెక్కలు పగటి సమయంలో ముడుచుకుపోతాయి. మీరు బ్రహ్మకమలాన్ని చూడాలంటే హేంకుండ్ సాహిబ్ గురుద్వారకే కాదు హిమాలయాల ఒడిలో ఉన్న బద్రినాథ్‌కు ( Badrinath ) కూడా వెళ్లొచ్చు. అయితే దాని కోసం మీరు మంచి ప్లానింగ్ అండ్ పర్మిషన్స్ అండ్ గైడెన్స్ తీసుకోవాల్సి ఉంటుంది.
  • ఏడాదికి ఒకసారే | Brahma Kamal Blooming Season : బ్రహ్మ కమలం పువ్వు మిగితా పుష్పాల్లా కాదు. ఇది సంవ్సరానికి ఒకసారి మాత్రమే వికసిస్తుంది. అది కూడా జులై నుంచి ఆగస్టు మాసాల్లోనే. 
  • ఎత్తైన ప్రాంతాల్లోనే : Brahma Kamal High Altitude Growth : బ్రహ్మకమలం మొక్క 3000 నుంచి  4500 మీటర్ల ఎత్తులో ఉన్న హిమాలయ పర్వతాల్లోనే (  Greater Himalayas )  కనిపిస్తుంది. ఈ పుష్పాన్ని ఉత్తారాఖండ్ రాష్ట్ర పుష్పంగా గుర్తించారు. దీనిని అక్కడ ఆయుర్వేద వినియోగం కోసం పండిస్తుంటారు. 
  • ఇది కూడా చదవండి : Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి ?

వాస్తు శాస్త్రంలో బ్రహ్మకమలం

Vastu Shastra and Brahma Kamal:  వాస్తు శాస్త్రం ప్రకారం బ్రహ్మ కమలం అనేది ఇంట్లో శాంతిని, సౌభాగ్యాన్ని, పాజిటివిటీని పెంపొందిస్తుంది. దీని వల్ల రెట్టింపు ప్రయోజనాలు పొందేందుకు ఈ పుష్పాన్ని పాజిటివ్ ఎనర్జీకి తోడ్పడే ఈశాన్య భాగంలో ( North East ) ఉంచాలట. 

అయితే దీన్ని బెడ్ దగ్గర ఉంచకూడదట. ఎందుకంటే ఇందులోని శక్తివంతమైన అంశాలు నిద్రకు భంగం కలింగించే అవకాశం ఉందట. దానికి బదులుగా ఈ పుష్ఫాన్ని ఎక్కువగా యాక్టివిటీస్ ఉండే ప్రాంతంలో ఉంచాలి. 

బ్రహ్మకమలాన్ని కోయవచ్చా ?

why it’s illegal to pluck brahma kamal in india : పై పేరగ్రాఫ్‌లో వాస్తు శాస్త్రం బ్రహ్మకమలం గురించి ఏం చెప్పిందో వివరించాను. అయితే  బ్రహ్మకమలం గురించి చట్టం ఏం చెబుతుందో కూడా చదవండి. 

బ్రహ్మకమలాన్ని కోయడం అనేది లేదా టచ్ చేయడం చట్టరీత్య నేరం. సో ఇంట్లోకి తీసుకొచ్చి ఈశాన్యంలో పెట్టాలనే ఆలోచనను పక్కన పెట్టేయండి. బ్రహ్మకమలం అనేది అత్యంత అరుదుగా వికసించే పుష్పం. 

its illegal to pluck brahm kamal in india prayanikudu
బ్రహ్మ కమలాన్ని కోయడం చట్టరీత్యా నేరం

దీంతో చాలా మంది కనిపిస్తే చాలు కోసేయాలి అన్నట్టుగా ప్రవర్తించారు. ఇలా చేస్తే ఈ పుష్ప రాజసం కనిపించకుండా పోతుంది అని చట్ట ప్రకారం ( Illegal to Pluck Brahma Kamal ) నిషేధించారు.

ఈ పుష్పానికి ఆధ్యాత్మికంగా చాలా విశిష్టత ఉంది. అందుకే బ్రహ్మకమలాన్ని కోసి లేదా తాకి అపవిత్రం చేయడం సరైనది కాదు అని ఇలా నిషేధించారు. అనుమతి లేకుండా ఈ పువ్వను కోస్తే లా బ్రేక్ చేసినట్టే. అంతే కాకుండా జీవ వైవిధ్యాన్ని ( Ecology ) కాపాడేందుకు కూడా ఇలా కఠిన నిర్ణయాలు తీసుకున్నారు.

బ్రహ్మకమలంలో వెరైటీలు

Types Of Brahma Kamal : బ్రహ్మకమలం వికసించింది అనే వార్తలు మీరు చాలా సార్లు చదివి ఉంటారు. నేను కూడా కొన్ని స్టోరీస్ రాశాను. అయితే ఏది అసలైన బ్రహ్మకమలం ?  ఇది బ్రహ్మకమలం అయితే మరి చాలా చోట్ల కనిపించే బ్రహ్మకమలాల సంగతేంటి ? అనే డౌట్ నాకు వచ్చింది. రీసెర్చ్ చేశాను. 

దీంతో నాకు బ్రహ్మకమలాల్లో కూడా వెరైటీస్ ఉన్నాయి అని తెలిసింది. అవి ఇవే

  • తెల్ల బ్రహ్మ కమలం | White Brahma Kamal : ఈ వెరైటీ బ్రహ్మకమలం రెక్కలు చంద్రకాంతికి అద్భుతంగా మెరుస్తాయి.
  • రంగురంగుల వెరైటీలు : బ్రహ్మకమలాల్లో పింక్, రెడ్, పర్పుల్ రంగులు కూడా ఉన్నాయి. కొన్ని నర్సరీల్లో వీటిని చూడొచ్చు.
  • Read Also: Kamakhya Temple : కామాఖ్య దేవీ కథ 

బ్రహ్మకమలం విశిష్టత, లాభాలు

Benefits and Brahma Kamal Significance : ఇప్పుడంటే అనుమతి లేదు కానీ బ్రహ్మకమలాన్ని పురాతన కాలంలో ఇంట్లో అలంకరణకు, పాజిటివిటీ కోసం వినియోగించేవారు.

Interesting-Facts-About-Brahma-Kamal-At-Himalyas-Prayanikudu.jpg
హిమాలయాల్లో బ్రహ్మ కమలం
  • అయుర్వేద గుణాలు | Ayurvedic Properties in Brahma Kamal :  బ్రహ్మకమలంలో పలు ఆయుర్వేద గుణాలు ఉన్నాయి. నేపాల్, భుటాన్, టిబెట్ ప్రాంతాల్లో బ్రహ్మకమలాన్ని తలనొప్పికి, మానసిక సమస్యల చికిత్సకు వినియోగిస్తుంటారు. 
  • చర్మ సమస్యలు : దీంతో పాటు సొరియాసిస్, తామర వంటి చర్మ సమస్యలకు కూడా వినియోగిస్తారు. చర్మ కాంతికోసం కూడా ఉపయోగపడుతుంది అంటారు. ఇందులో యాంటి కేనర్సర్ గుణాలు కూడా ఉన్నాయి అంటారు. అయితే దీనిపై మరింత రీచెర్చ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. 
  • మానసిక సమస్యలు : నిద్రలేమి, యాంగ్టైటీ, డిప్రెషన్‌ చికిత్సలో కూడా ఉపయోగపడుతుంది అంటారు.
  • రోగ నిరోధక శక్తి : బ్రహ్మకమలం సువాసన వల్ల స్ట్రెస్ తగ్గి, ఏకాగ్రత పెరుగుతుంది. అంటారు. దీంతో పాటు ఇందులో ఉన్న యాంటి ఇంప్లామేటరీ ( inflammatory ), అనాల్జెసిక్ ( analgesic ) గుణాల వల్ల రోగ నిరోధక శక్తి మెరుగు అవుతుంది అంటారు.
  • Read Also : Ramayana Trail : శ్రీలంకలో రామాయణం టూరిజం…ఏం చూపిస్తారు? ఎలా వెళ్లాలి ? Top 5 Tips

మహావిష్ణువు ఆలయంలో…

Brahma Kamal and Spiritual Importance: బ్రహ్మకమలాన్ని చాలా మంది లక్కీ ఫ్లవర్ అంటారు. ఈ పువ్వు వల్ల సంపద కలుగుతుంది అంటారు.

  • బ్రహ్మకమలాన్ని ఇంట్లో ఉంచితే పాజిటీవ్, ఆధ్మాత్మిక శక్తి ఇంట్లోకి ప్రసరిస్తుంది అని అంటారు.
  • నేటికీ చాలా శ్రీమహా విష్ణువు ఆలయాల్లో బ్రహ్మకమలాన్ని ఆఫర్ చేస్తుంటారు.

Where does brahma Kamal Found  : బ్రహ్మకమలం భారత దేశంలోని ఉత్తరాఖండ్ హిమాలయ ప్రాంతాలో దొరుకుతుంది. దీంతో పాటు భుటాన్, నేపాల్, పాకిస్తాన్, నైరుతి చైనాలో లభిస్తుంది.

మీరు ఎప్పడైనా బ్రహ్మకమలం చూశారా ? బ్రహ్మకమలం గురించి మీకు తెలిసింది ఏమైనా ఉంటే కామెంట్ చేయగలరు.

ఈ  కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!