ఏపీ ప్రజలకు భారీ ఊరట…11 సంక్రాంతి స్పెషల్ రైళ్లు | Sankranti Special Trains 2026
హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ఆంధ్రాకు వెళ్లే ప్రయాణికుల కోసం దక్షిణ మధ్య రైల్వే Sankranti Special Trains 2026 ను ప్రకటించింది. మొత్తం ఎన్ని ట్రైన్లు, వాటి రూట్లు, తేదీలు, ట్రావెల్ టిప్స్ మీ కోసం..
సంక్రాంతి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక పండుగ మాత్రమే కాదు..సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం కూడా. భాగ్యనరంలో పని చేసే ఉద్యోగులు, విద్యార్థులు, కుటుంబ సభ్యులు అందరికీ ఈ ఫెస్టివల్ ట్రావెల్ చాలా ఇంపార్టెంట్.
ఈ రద్దీని మేనేజ్ చేయడానికి దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) సంక్రాంతి కోసం Andhra-focused Special Trains ను ప్రకటించింది. రైల్వే అధికారుల ప్రకారం ఈ స్పెషల్ ట్రైన్స్ వల్ల తూర్పు గోదావరి (East Godavari), ఉత్తర కోస్తా ఆంధ్రా, తెలంగాణలో పని చేస్తున్న ఆంధ్రా ప్రయాణికులకు ట్రావెల్ ప్రెషర్ కాస్త తగ్గుతుంది.
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి ట్రైన్ టికెట్ల గురించి వర్రీ అవుతున్నారా ? అదనపు స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన South Central Railway
తూర్పు గోదావరి – కాకినాడ రూట్ | Kakinada Route
ఈస్ట్ గోదావరి జిల్లాలో కాకినాడ, రాజమండ్రి, సామర్లకోట ప్రాంతాలకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు కాకినాడ టౌన్ – వికారాబాద్ రూట్ చాలా ఇంపార్టెంట్.
- Train No. 07460 : 2026 జనవరి 8వ తేదీన కాకినాడ టౌన్ నుండి సాయంత్రం బయల్దేరి మరుసటి రోజు ఇది వికారాబాద్ చేరుకుంటుంది.
- Train No. 07186 : జనవరి 7, 9 తేదీల్లో సేమ్ రూట్లో ఇది ఆపరేట్ అవుతుంది.
ఈ ట్రైన్స్ హైదారాబాద్, తెలంగాణలో పని చేసే ఆంధ్రా ఉద్యోగులు, స్టూడెంట్స్ సొంత ఊళ్లకు వెళ్లేందుకు చాలా ఉపయోగపడతాయి.
రిటర్న్ జర్నీ కోసం : Sankranti Special Trains 2026
- Train No. 07185 (వికారాబాద్ – కాకినాడ టౌన్) జనవరి 8
- Train No. 07187 (వికారాబాద్ – కాకినాడ టౌన్) జనవరి 10వ తేదీ
ఈ ట్రైన్స్ వల్ల సంక్రాంతి అయ్యాక తిరిగి సిటీకి తిరిగి వెళ్లడం ఈజీ అవుతుంది.
- ఇది కూడా చదవండి : 48 గంటల ట్రైన్ ప్రయాణం –North East వెళ్లేముందు తెలుసుకోవాల్సిన నిజాలు
ఉత్తర కోస్తా ఆంధ్రా – విజయనగరం, శ్రీకాకుళం | North Coastal Andhra – Vizianagaram & Srikakulam
విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు వెళ్లాలి అనుకునే వాళ్లకి దక్షిణ మధ్య రైల్వే డైరెక్ట్ ట్రైన్లు ఏర్పాటు చేసింది.
- Train No. 07461 ఇది వికారాబాద్ నుంచి పార్వతీపురం వరకు జనవరి 9, 11 తేదీల్లో నడుస్తుంది.
- Train No. 07462 అనేది జనవరి 10వ తేదీన పార్వతీపురం నుంచి వికారాబాద్ బయల్దేరుతుంది.
- ఇది కూడా చదవండి :రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు
ఈ సర్వీసులు ఉత్తర కోస్తా ఆంధ్రా గ్రామాలకు వెళ్లాలి అనుకునే ప్రయాణికులకు భారీ ఊరటను కలిగిస్తాయి.
హైదరాబాద్ / సికింద్రాబాద్ – కోస్తా ప్రాంతాలకు | Hyderabad / Secunderabad to Andhra Coast
హైదరాబాద్ నుంచి ఆంధ్రా కోస్తా ప్రాంతాలకు ప్రయాణాలు చేసేవారికి
- Train No. 07464 అనే ట్రైన్ సికింద్రాబాద్ నుంచి పార్వతీపురం వైపు జనవరి 8వ తేదీ రాత్రి బయల్దేరుతుంది.
- Train No. 07465 తిరిగి జనవరి 9వ తేదీన పార్వతీపురం నుంచి సికింద్రాబాద్ బయల్దేరుతుంది.
- ఈ ట్రైన్లు సంక్రాంతి రష్ను కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి అని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది.
కోచులు, బుకింగ్ సమాచారం | Coaches & Booking Information
రైల్వే అధికారుల ప్రకారం ఈ స్పెషల్ ట్రైన్స్‌లో 1AC, 2AC, 3AC, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచులు అందుబాటులో ఉంటాయి. ఈ ట్రైన్లకు టికెట్ బుకింగ్ అనేది 2025 డిసెంబర్ 29 ఉదయం 8:00 AM నుంచి ప్రారంభం అవుతుంది.
- మీరు IRCTC వెబ్సైట్, మొబైల్ యాప్, రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్ల కోసం ప్రయత్నించవచ్చు.
- పండగ సీజన్ కాబట్టి టికెట్లు త్వరగా ఫిల్ అయ్యే అవకాశం ఉంది. సో మీరు కొంచెం అలెర్ట్‌గా ఉండాలి.
- బుకింగ్ చేసే సమయంలోనే రిటర్న్ టికెట్లు కూడా బుక్ చేసుకోండి.
- రష్ ఉండే పెద్ద స్టేషన్లకు బదులు దగ్గర్లో ఉన్న ఇతర స్టేషన్లను ఎంచుకోండి.
- కేవలం అధికారిక IRCTC సోర్సెస్ నుంచి మాత్రమే టికెట్లు బుక్ చేసుకోండి.
- టికెట్ కన్ఫర్మ్ అయితే పిల్లలు, పెద్దల కోసం మందులు, నీరు, ఫుడ్ రెడీగా పెట్టుకోండి.
- ఒకవేళ టికెట్లు దొరక్కపోతే సంక్రాంతి స్పెషల్ బస్సులను (APSRTC Sankranti Special Buses) మీ బ్యాకప్ ప్లాన్‌లా పెట్టుకోండి.
- ఇది కూడా చదవండి : టికెట్ Confirm లేదా Waiting అనేది 10 గంటల ముందే తెలుస్తుంది | Railway Ticket Chart
మొత్తానికి ఈ స్పెషల్ ట్రైన్స్ వల్ల ఏపీ ప్రజలు తమ ప్రయాణాన్ని ప్రశాంతంగా పూర్తి చేసేలా ఉపయోగపడతాయి అనేది దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. కానీ వాస్తవం ఏంటంటే ఎన్ని స్పెషల్ ట్రైన్లు వేసినా సంక్రాంతి సమయంలో సరిపోవు.
సో ముందుగానే భారీ రష్ను ఊహించి మీ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోండి. ప్రత్యామ్నాయాలు ముందుగానే ప్లాన్ చేసుకోండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
