కుంభమేళాకు హైదరాబాద్ నుంచి SpiceJet డైరెక్ట్ ఫ్లైట్స్ | Prayagraj Direct Flights

షేర్ చేయండి

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభ మేళాకు మరిన్ని డైరెక్ట్ విమానాలను నడపనున్నట్టు స్పైస్‌జెట్ ( Prayagraj Direct Flights ) ప్రకటించింది. కొత్తగా హైదరాబాద్, చెన్నై, గువాహటి నుంచి ఈ విమానాలను నడపనున్నట్టు తెలిపింది ఈ విమానయాన సంస్థ.

కుంభ మేళా ప్రాధాన్యత | Significance Of Maha Kumbh Mela 2025

144 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహాకుంభ మేళాకు 150 దేశాల నుంచి భక్తులు తరలి వస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌లోని పవిత్ర త్రివేణి సంగమం ( Triveni Sangam ) వద్ద పవిత్ర స్నానాలు ఆచరించడం కోసం వచ్చే భక్తులతో రైళ్లు, ఫ్లైట్స్ అన్నీ కిటకిటలాడుతున్నాయి. 45 రోజుల పాటు జరిగే ఈ పవిత్రమైన ఆధ్యాత్మిక మేళాకు 45 కోట్ల మంది భక్తులు తరలి వచ్చే అవకాశం ఉంది అని అధికారులు అంచనా వేస్తున్నారు. 

Prayanikudu whatsapp
| ప్రయాణికుడు ఛానెల్‌ను ఫాలో అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి
ఫ్రీక్వెన్సీ పెంపు | SpiceJet Flights to Kumbh Mela 20255

ప్రయాణికుల రద్దీని, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని కొత్తగా డైరక్ట్ ఫ్లైట్స్ ప్రకటించింది ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్. హైదరాబాద్‌తో పాటు చెన్నై, గువహటి నుంచి డైరక్ట్ ఫ్లైట్స్ నడపనున్నట్టు తెలిపింది. దీంతో పాటు ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్ జైపూర్, బెంగుళూరు వంటి ప్రధాన నగరాల నుంచి వెళ్లే విమానాల ఫ్రీక్వెన్సీని పెంచనున్నట్టు సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది.

హైదరాబాద్ నుంచి ఎప్పుడంటే | Hyderabad To Prayagraj Direct Flights
prayagraj Direct Flights
| ప్రతీకాత్మక చిత్రం

హైదరాబాద్, చెన్నై నుంచి స్పైస్‌జెట్ నడపనున్న ఈ డైరక్ట్ విమానాలు 2025 ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఫిబ్రవరి 27 వరకు ప్రయాణికులకు సేవలు అందించన్నాయి. అయితే గువహటి నుంచి మాత్రం డైరక్ట్ విమానాలు ఫిబ్రవరి 11 నుంచి ఫిబ్రవరి 28 మధ్యలో నడవనున్నాయి.

జీవితంలో ఒక్కసారి వచ్చే ఈ అరుదైన ఆధ్యాత్మిక సంగమంలో ( Maha Kumbh Mela 2025 ) తమ వంతు భాగస్వామ్యంగా ప్రయాణికుల కోసం ఈ సర్వీసులను అందిస్తున్నట్టు స్పైస్‌జెట్ చీఫ్ బిజినెస్ ఆఫిసర్ డిబోజో మహర్షి తెలిపారు. ఈ విమానాల్లో ప్రయాణించి తీర్థయాత్రను ఆస్వాదించాలని సంస్థ ప్రతినిధులు కోరారు.

టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book Spicejet Flight Tickets

ప్రయాగ్‌రాజ్ ( Prayagraj ) వెళ్లాలనుకునే ప్రయాణికుల కోసం హైదరాబాద్ నుంచి డైరక్ట్ విమానాలను నడపనుంది స్పైస్‌జెట్. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 27 వరకు సర్వీస్ అందించనున్నాయి. ఈ విమాన టికెట్లు బుక్ చేసుకోవడానికి మీరు సంస్థ వెబ‌్‌సైట్‌ను విజిట్ చేయవచ్చు.

  • స్పైస్‌జెట్ వెబ్‌సైట్ లింక్ : www.spicejet.com
స్పైస్‌జెట్ గురించి | About SpiceJet

భారత దేశంలో ఉన్న ప్రముఖ విమానయాన సంస్థల్లో స్పైస్‌జెట్ కూడా ఒకటి. అందుబాటులో ఉండే టికెట్ ధరలతో ప్రయాణికులు అభిమానాన్ని చూరగొంది ఈ సంస్థ. IATA-IOSA  సెర్టిఫైడ్ విమానయాన సంస్థ అయిన స్పైస్‌జెట్  వద్ద అనేక రకాల విమానాలు ఉన్నాయి. వీరి ఫ్టీట్‌లో బోయింగ్ 737 ఎస్ ( Boeing 737s), క్యూ-400 ( Q-400s ) వంటి విమానాలు ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయి.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!