Thailand Digital Arrival Card : థాయ్‌లాండ్ వెళ్లాలంటే ఈ కార్డు తప్పనిసరి !

షేర్ చేయండి

అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా థాయ్‌లాండ్ అప్డేట్ అవుతోంది. ఈ దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డు (Thailand Digital Arrival Card) ను ప్రవేశ పెట్టింది . 2025 మే1 నుంచి ఈ కార్డు తప్పనిసరి చేసింది.

కొన్నేళ్ల నుంచి భారతీయులు ఎక్కువగా వెళ్తున్న దేశం థాయ్‌లాండ్ (Thailand). దేశ విదేశాల నుంచి ప్రయాణికులు సంఖ్య ఏడాదికేడాది పెరుగుతోండటంతో ఈ దేశం అపగ్రేడ్ అవ్వాలి అనుకుంటోంది. అంతర్జాతీయ ప్రమాణాలకు తగిన విధంగా అప్డేట్ అయ్యే దిశలో డిజిటిల్ ఎరైవల్ కార్డును ప్రవేశ పెట్టింది థాయ్‌లాండ్ .

2025 మే 1వ తేదీ నుంచి విదేశాల నుంచి వచ్చే పర్యాటకుల వద్ద ఈ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఈ కొత్త విధానం వల్ల ఎంట్రీ ప్రక్రియ సమయం, పేపర్ వర్క్ తగ్గడంతో పాటు, బార్డర్ సెక్యూరిటీ కూడా పెరుగుతుంది. 

ఈ కార్డు విశేషాలు | What Is the Thailand Digital Arrival Card?

గతంలో ఉన్న టీఎమ్‌6 అరైవల్ ఫామ్‌కు (TM6 Arrival Form) బదులు టీడీఏసి కార్డును ప్రవేశ పెట్టింది థాయ్‌లాండ్. వాయు, జల, రోడ్డు మార్గంలో విదేశాల నుంచి థాయ్‌లాండ్‌లోకి ప్రవేశించే వారికి ఈ కొత్త కార్డు అధికారిక రికార్డులా పని చేస్తుంది. 

ఈ దేశంలోకి ప్రవేశించిన 72 గంటల్లో ఈ కార్డు ప్రక్రియను ఆన్‌లైన్లో పూర్తి చేయాల్సి ఉంటుంది. ప్రయాణికుల (Traveler) వివరాలను అంటే వారి ప్రయాణ వివరాలు, పాస్‌పోర్టు (Passport), ఎక్కడ బస చేయనున్నారు, ఆరోగ్య పరమైన విషయాలు థాయ్‌లాండ్‌ సిస్టమ్‌లో అప్‌గ్రేడ్ అవుతాయి.

Thailand Digital Arrival Card
థాయ్‌లాండ్ డీఏసీ పోర్టల్

ఈ కార్డు తీసుకురావడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. మారుతున్న కాలాన్ని బట్టి ప్రపంచ స్థాయి ట్రావెల్ టెక్నాలజీని వినియోగించే దిశలో ఈ కార్డును ప్రవేశపెట్టింది థాయ్‌లాండ్. దీని వల్ల లాభాలు:

  • ఇమిగ్రేషన్ ప్రాసెస్ వేగవంతం: ముందస్తుగానే రిజిస్ట్రేషన్ పూర్తి చేయడం వల్ల చెకింగ్ పాయింట్స్ వద్ద వెయిట్ చేయాల్సిన సమయం గణనీయంగా తగ్గుతుంది. 
  • బార్డర్ సెక్యూరిటీ : ఈ కొత్త విధానం అనేది థాయ్‌లాండ్ ఇమ్మిగ్రేషన్ ప్రోటోకాల్స్‌లో భాగంగా చెప్పవచ్చు. ఇది ఈ- వీసా విధానంలా పని చేస్తుంది. స్క్రీనింగ్‌ను సులభతరం చేస్తుంది. 
  • పర్యావరణ హితం : గతంలో ఉన్న పేపర్ ఫారమ్‌లకు బదులు ఈ కార్డును ప్రవేశ పెట్టడం వల్ల ఇక పేపరు వినియోగం బాగా తగ్గుతుంది. తద్వారా పర్యావరణానికి జరిగే నష్టం కాస్త తగ్గుతుంది.
  • దీంతో పాటు పాకిస్తాన్ లాంటి దేశాల నుంచి నకిలీ వీసాలతో థాయ్‌లోకి ఎంటర్‌ అవుతున్న వారి సంఖ్య పెరగడంతో వాటిని తగ్గించే దిశలో ఈ కార్డు కాస్త ఉపయోగపడుతంది. 

టీడీఏసి కార్డు ఎలా పొందాలి ? | Thailand DAC

How to Register for the TDAC : 2025 మే 1వ తేదీ నుంచి థాయ్‌లాండ్ వెళ్లే ప్రయాణికుల వద్ద టీడీఏసి కార్డు ఉండటం చాలా అవసరం. అయితే ఈ కార్డును ఎలా పొందాలి అనేది చాలా మందికి తెలియదు. అందుకే ఎలా రిజిస్టర్ చేసుకోవాలో తెలుసుకుందామా..:

  1. లాగిన్ అవ్వండి : ముందుగా థాయ్‌లాండ్ డిజిటల్ ఎరైవల్ కార్డు పొందడానికి ముందుగా మీరు టీడీఏసి అధికారిక వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ఆ వెబ్‌సైట్ వచ్చేసి…
https://tdac.immigration.go.th లేదా https://tdac.immigration.go.th అనే వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. 
  1. వ్యక్తిగత సమాచారం : లాగిన్ అవ్వడానికి మీ పూర్తి పేరు, జాతీయత, పాస్‌పోర్టు వివరాలు, కాంటాక్ట్ నెంబర్ వంటి వివరాలను అందించాల్సి ఉంటుంది. 
  2. ట్రిప్ డీటెయిల్స్ : మీ ఫ్లైట్ నెంబర్, థాయ్‌లాండ్‌కు ఎందుకు వస్తున్నారు, ఎక్కడ ఉంటారు వంటి వివరాలను కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
  3. ఫామ్ సబ్మిట్ చేయండి: పూర్తి వివరాలతో ఫామ్ సబ్మిట్ చేసిన తరువాత మీ ఇమ్మిగ్రేషన్ చెక్ పాయింట్స్ వంటి వివరాలతో ఒక కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!