ఒక వేళ మీరు థాయ్‌లాండ్ (Thailand Hand Luggage Rules) టూర్ ప్లాన్ చేస్తోంటే ఈ పోస్టు తప్పకుండా మీకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే హ్యాండ్ లగేజ్ విషయంలో థాయ్ రూల్స్ కొంచెం టైట్ చేసింది. ఎయిర్ పోర్ట్ సెక్యూరిటీలో భాగంగా లిక్విడ్, జెల్స్, ఎరోసోల్స్ (LGAs)లో పలు మార్పులు తీసుకువచ్చింది.
ముఖ్యాంశాలు
థాయ్‌లాండ్ సివిల్ ఏవియేషన్ ఆథారిటీ (CAAT) జారీ చేసిన ఈ కొత్త నియమాలు 2025 ఏప్రిల్ 22 వ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ కొత్త రూల్స్ వల్ల ప్రయాణికుల భద్రత మెరుగవుతుంది అని అలాగే విమానాశ్రయాల్లో సెక్యూరిటీ విధానం మరింత చక్కగా పని చేస్తుంది అని ఆశిస్తోంది థాయ్. ఈ కొత్త మార్పులు ఏంటో ఒకసారి తెలుసుకుందామా ?
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
కొత్త రూల్స్ ప్రకారం | Thailand Hand Luggage Rules
కొత్తగా వచ్చిన ఈ రూల్స్ అనేవి అందరికీ వర్తిస్తాయి. ఇందులో ప్రయాణికులు (travelers), వైమానిక సిబ్బంది, ఎయిర్‌పోర్ట్ స్టాఫ్ అందరూ ఎయిర్‌పోర్టులో ఉన్నప్పుడు వీటిని పాటించాలని తెలిపింది.
కంటైనర్ పరిమాణం
- ద్రవపదార్థం, జెల్, ఎరోసోల్స్ (Liquid, Gel, Aerosols) ఉన్న కంటెనర్ పరిమాణం 100 మిల్లీలీటర్లను మించరాదు. కంటెనర్‌లో సగం నిండి ఉన్నా సరే ఈ బరువును మించరాదు.
అనుమతించే పరిమితి
- ప్రయాణికులు కొన్ని కంటేనర్లు తీసుకువెళ్లవచ్చు. మొత్తం కలిపి ప్రతీ వ్యక్తి ఒక లీటరు బరువును మంచి తీసుకెళ్లే అవకాశం లేదు.
ప్యాకేజింగ్
- అన్ని కంటైనర్లను కలిపి ఒకే ఒక రియూజబుల్, పాదర్శక బ్యాగులో పెట్టాల్సి ఉంటుంది. ఈ బ్యాగు పరిమాణం ఒక లీటరును మించరాదు. ఒక వ్యక్తి ఒకే బ్యాగును తీసుకెళ్లగలడు. సెక్యూరిటీ స్క్రీనింగ్ సమయంలో ఈ బ్యాగును బయట తీసి చూపించాల్సి ఉంటుంది.
- Travel Smarter : 2025 లో ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్
ఎలాంటి ఐటమ్స్ తీసుకెళ్లవచ్చు | What Items Are Included?

- ఈ కొత్త నియమాల ప్రకారం ప్రయాణికులు : డ్రింక్స్, సూప్స్, సాజెస్, కాస్మోటిక్స్, టాయిలెటరీస్, స్ప్రేలు, ఫోమ్స్, మస్కరా, లిప్ బామ్ వంటి ఘన, ద్రవ పరదార్థాలను తీసుకెళ్లవచ్చు.
మినహాయింపులు | Exemptions and Special Cases
ఈ కొత్త నియమాల నుంచి కొన్ని వస్తువులను మినహాయించారు. అయితే వీటిని స్క్రినింగ్ సమయంలో చూపించి డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
- మందులు : సరైన డాక్యుమెంట్స్ ఉంటే మందులను (Medicine To Thailand) తీసుకెళ్లేందుకు అనుమతి ఇస్తారు. దీని కోసం డాక్టర్ రాసిన చీటి ఉండాలి. అందులో ప్రిస్క్రిప్షన్ లేబుల్ (వివరాలు) ఉండాలి.
- పిల్లల ఆహారం (Baby Food) : ప్రత్యేక డైట్‌కు సంబంధించిన ఆహారం పదార్థాలు, బేబీ ఫుడ్ తీసుకెళ్లవచ్చు. కానీ అవి విమాన ప్రయాణ సమయంలో మాత్రమే వినియోగించే పరిమాణంలో మాత్రమే ఉండాలి. అంటే విమానంలో మాత్రమే వినియోగించేంత మాత్రమే ఉండాలి.
- డ్యూటి ఫ్రీ కొనుగోలు (Duty Free Shopping): ఎయిర్‌పోర్టులో ఉన్న షాపుల్లో మీరు లిక్విడ్స్ ఏమైనా కొన్నట్టయితే వాటిని లేబుల్స్ అలాగే ఉండి, సీల్ తెరవకుండా ఉంటే వాటిని అలాగే తీసుకెళ్లే అవకాశం ఇస్తారు.
మొత్తానికి | Thailand Hand Luggage Rules
- మీరు థాయ్‌లాండ్ వెళ్లే ముందు లిక్విడ్, గెల్స్, ఎరోసోల్స్‌ను వాటి పరిమాణాన్ని బట్టి ప్యాక్ చేసుకోండి. దీని కోసం పైన వివరించిన విషయాలను మరోసారి చదవండి.
- మినహాయిపు ఉన్న వస్తువులను తీసుకెళ్లే తరుణంలో సరైన పత్రాలను మీతో పాటు తీసుకెళ్లండి.
- మీరు వెళ్లనున్న ఎయిర్‌పోర్టులో (Airport) ఉండే నియమాలను తప్పకుండా తెలుసుకుని డబుల్ చెక్ చేసుకోండి.
ప్రయాణికుల రక్షణ కోసం థాయ్‌లాండ్ హ్యాండ్ బ్యాగేజ్ నియమాలను అప్డేట్ చేసింది. మీరు కూడా థాయ్ కింగ్డమ్‌కు (Thailand Kingdom) వెళ్లాలి అనుకుంటే తప్పనిసరిగా ఈ నియమాల గురించి తెలుసుకోండి. ఈ రూల్స్ పాటించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రపంచంలోనే అత్యంత హ్యాప్సియెస్ట్ కంట్రీలలో (Happiest Country) ఒకదానికి వెళ్లవచ్చు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు.
- Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
- WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.