Winter Hill Stations: చలికాలం దక్షిణాదిలో తప్పకుండా వెళ్లాల్సిన 10 హిల్ స్టేషన్స్‌

ఏడాది ముగుస్గోంది అంటే కొందరికి సంతోషంగా అనిపిస్తుంది. కొందరికి బాధగా అనిపిస్తుంది. కానీ వింటర్ వచ్చేసింది అంటే మాత్రం అందరూ సంతోషపడతారు. వింటర్లో హ్యాప్పీగా ఉండేందుకు చాలా కారణాలు ఉన్నాయి. అందులో ఒకటి వింటర్లో హిల్ స్టేషన్స్ అన్నీ కొత్త పెళ్లికూతురిలా అందంగా ఉంటాయి. సౌత్ ఇండియాలో ఉన్న అందమైన హిల్ స్టేషన్స్‌లో ( Winter Hill Stations ) కొన్నింటిని ఈ గ్యాలరీలో చూడండి. నేను ఏమైనా మిస్ అయితే కామెంట్ చేయండి.

చాలా మంది ఈ టైమ్‌లో నార్త్ ఇండియాలో ఉన్న హిల్ స్టేషన్స్‌కు ( Hill Stations In North India ) వెళ్తుంటారు.అయితే మన దగ్గరిలోనే దక్షిణ భారత దేశంలో కూడా చాలా సూపర్ హిల్ స్టేషన్స్ ఎన్నో ఉన్నాయి. మంచుతో కప్పబడి ఉన్న పర్వతాలు, అందమైన బ్యాక్ వాటర్స్, ఉత్సాహాన్ని పెంచే ఉత్సవాలు ఇలా ఎన్నో కారణాలు మీకు చెప్పగలను ఈ హిల్ స్టేషన్స్ గురించి. అయితే చెప్పడం కన్నా చూడడం బెస్ట్ కదా. చూసినాక వీలైతే ఒక ట్రావెల్ ( Travel ) ప్లాన్ కూడా చేయండి

Kodaikanal, Tamilnadu : కొడైకనాల్‌ను ప్రిన్సెస్ ఆఫ్ హిల్ స్టేషన్ అని అంటారు. ఇక్కడ మీకు కనిపించే అందమైన సీన్స్ మీ మనసు దోచుకుంటాయి.
Coorg, Karnataka : కూర్గ్‌లో పొగమంచులో మీరు బయటి ప్రపంచాన్నే మర్చిపోవచ్చు. ఇక్కడి ప్లాంటేషన్స్ అండ్ చుట్టు పక్కల అందాలు మిమ్మత్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తాయి.
Munnar, Kerala : మున్నార్ అంటే ముందు కాఫీ తోటలే గుర్తొస్తాయి. ఈ కాఫీ తోటలకు తోడు అక్కడి నేచర్ , పొగ మంచు ఇవన్నీ మీలోని ప్రయాణికుడిని శాటిస్ఫై చేస్తాయి
Ooty, Tamilnadu : సౌత్ ఇండియాలో మీకు తెలిసి ఒక హిల్ స్టేషన్ పేరు చెప్పండి అని ఎవరినైనా అడిగితే ముందుగా వచ్చే పేరే ఊటి.ఇక్కడి అందాలను చాలా సినిమాల్లో చూసుంటారు. చాలా మంది ఇక్కడ బూటింగ్ కూడా చేస్తుంటారు.
Chikmagluru, Karnataka : నిత్యం పచ్చదనంతో నిండి ఉండే చిగ్‌మగ్‌లూరులో కాఫీ లవర్స్ పండగ చేసుకోవచ్చు. ఇక్కడి వెర్డాంట్ కొండలు, జలపాతాలు చాలా పాపులర్.
« of 2 »

మొత్తానికి | Why To Visit South Indian Winter Hill Stations ?


ప్రకృతి రమణీయత, ఇక్కడి కల్చర్, ఫుడ్ ఇవన్నీ కలిపి సౌత్ ఇండియాను ఒక వింటర్ కార్నివాల్‌గా మార్చేస్తాయి. ప్రశాంతతను ఇష్టపడే ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలో ఈ హిల్ స్టేషన్స్‌కు వస్తూ ఉంటారు. మీకు నేచర్ అంటే ఇష్టం అయినా లేక స్థానిక ఉత్సవాలు, వేడుకలు అంటే ఇష్టమైనా, లేదా ఫుడ్, కాఫీ , డ్రింక్స్ ఇలా మీకు నచ్చింది ఏదైనా సరే ఇక్కడ మీరు డిసపాయింట్ అవ్వరు. ఈ లిస్టులో వంజంగి, లంబసింగి లేవు. వాటి గురించి నేను పూర్తి వివరాలు గతంలో పబ్లిష్ చేశాను. వీలైతే చదవండి

ఇది కూడా చదవండి : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగిలో నిజంగా స్నో పడుతుందా ?

మంచి టైమ్ చూసుకుని ప్లాన్ చేయండి మరి. ఈసారి వెళ్లే యాత్ర మీకు జీవితాంతం గుర్తుండేలా ప్లాన్ చేసుకోండి. ట్రావెల్ అండ్ టూరిజానికి సంబంధించిన కంటెంట్ కోసం ఈ వెబ్‌సైట్‌ను రోజూ చూస్తూ ఉండండి. ప్రతీ రోజు ప్రయాణాలు సాధ్యం కాకపోవచ్చు. కానీ ప్రతీ రోజు ప్రయాణికుడిని చూడొచ్చు, ఈ వెబ్‌సైట్‌ విజిట్ చేయొచ్చు కదా. ఏమంటారు ?

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

ఈ గ్యాలరీస్ కూడా చూడండి

ఇది కూడా చదవండి: Visa Free Countries: భారత్‌కు దగ్గరగా ఉన్న ఈ 8 దేశాలకు వీసా లేకుండానే వెళ్లొచ్చు

ఇది కూడా చదవండి : Hill Stations: చలికాలం తప్పకుండా వెళ్లాల్సిన 8 హిల్ స్టేషన్స్ ఇవే

ఇది కూడా చదవండి : Places Near Badrinath : బద్రినాథ్‌కు సమీపంలో ఉన్న 6 సందర్శనీయ ప్రదేశాలు

ఈ గ్యాలరీ చూడండి :  మేఘాలయ ఎంత అందంగా ఉంటుందో 10 ఫోటోల్లో మీరు చూసేయవచ్చు

Leave a Comment

error: Content is protected !!