ప్రయాగ్‌రాజ్‌ వెళ్తే ఈ 22 ప్రదేశాలు అస్సలు మిస్ అవ్వకండి | 22 Places To Visit In Prayagraj During Kumbh Mela

షేర్ చేయండి

ప్రయాగ్‌రాజ్‌ అనేది ఆధ్మాత్మికంగా అత్యంత విశిష్టమైన స్థలం. దీంతో పాటు ఎన్నో వారసత్వ కట్టడాలు, నేచర్ బ్యూటీ వంటి ఎన్నో కారణాల వల్ల ప్రయాగ్‌రాజ్‌ ( Prayagraj ) మంచి ట్రావెల్ డెస్టినేషన్‌గా మారింది.

భారత దేశంలోని కొన్ని నగరాల్లో భారతీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. అలాంటి నగరమే ప్రయాగ్‌రాజ్ . ఉత్తర ప్రదేశ్‌లోని ఈ నగరాన్ని అలహాబాద్ ( Allahabad ) అని ఒకప్పుడు పిలిచేవారు. కుంభమేళా సందర్బంగా చాలా మంది ప్రయాగ్‌రాజ్ వెళ్లనున్నారు. అలాంటి ప్రయాణికుల కోసం 22 సందర్శనీయ స్థలాలను ఎంపిక చేసి తీసుకొచ్చాం.

ప్రయాగ్‌రాజ్‌ అనేది ఆధ్మాత్మికంగా భారతీయులకు అత్యంత విశిష్టమైన క్షేత్రం . అనేక వారసత్వ కట్టడాలు, నేచరల్ బ్యూటీ, ఫుడ్, నదీ తీరాలు వంటి ఎన్నో కారణాల వల్ల ప్రయాగ్‌రాజ్‌ మంచి ట్రావెల్ డెస్టినేషన్‌గా మారింది.

1. త్రివేణి సంగమం | Triveni Sangam At Prayagraj

on the way to triveni sangam
త్రివేణి సంగమానికి వెళ్లే దారి …

ప్రయాగ్‌రాజ్‌‌లో త్రివేణి సంగమం జరుగుతుంది. గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే ఈ ప్రాంతాన్ని జీవితంలో ఒక్కసారి అయినా సందర్శించాలి అనుకుంటారు భక్తులు. మరీ ముఖ్యంగా కుంభ మేళా ( Maha Kumbh Mela 2025 )  సమయంలో ఈ ప్రాంత వైభవం గురించి మాటల్లో వర్ణించలేము. హిందూ మతంలోని పవిత్ర సంప్రదాయాలు, ఆచారాలకు ఈ ప్రాంతం పెట్టినిల్లు. ఉదయం సమయంలో గంగా నదిలో స్నానం ఆచరించడానికి చాలా మంది వెళ్తుంటారు.

2. అలహాబాద్ కోట | Allahabad Fort

16వ శతాబ్దంలో మొఘల్ చక్రవర్తి అక్బర్ ఈ కోటను కట్టించాడు. మొఘల్ శిల్పకళా శైలిని ఈ కోటలో మనం చూడవచ్చు. ఈ కోటకు ప్రాంగణంలో పాతాల్‌పురీ ఆలయం, అక్షయావత్ అనే పవిత్ర వృక్షం ఉంటాయి.

3.ఇస్కాన్ ఆలయం | Prayagra ISKCON Temple

ప్రయాగ్‌రాజ్‌లో ఉన్న ఇస్కాన్ ఆలయం శ్రీకృష్ణుడి భక్తులతో నిత్యం కిటకిటలాడుతుంది. ఇక్కడ జన్మాష్టమి వేడుకలు వైభవంగా జరుగుతాయి. ఈ ఆలయ ప్రాంగణంలో అందమైన గార్డెన్, గెస్ట్ హౌజ్‌, పలు షాప్స్ ఉన్నాయి.

4. ఆలోపి దేవి ఆలయం | Alopi Devi Temple

ఆలోపి దేవి ఆలయంలో విగ్రహం ఉందదు. ఇక్కడ ఒక రథానికి పూజలు చేస్తారు. నవరాత్రి సమయంలో ఇక్కడికి దూర దూరం నుంచి భక్తులు వస్తుంటారు. 

5. కొత్త యమునా బ్రిడ్జి | New Yamuna Cable Bridge 

yamunabridge prayagraj
ప్రయాగ్‌రాజ్‌లో కొత్త యమునా బ్రిడ్జి

యుమునా నదిపై ఉన్న కేబుల్ బ్రిడ్జి చాలా అందంగా ఉంటుంది. ఇక్కడి నుంచి యమునా నది చాలా అందంగా కనిపిస్తుంది. సూర్యోదయం, సూర్యాస్తమం సమయంలో బ్రిడ్జిపై నడిస్తే థ్రిల్లింగ్‌గా అనిపిస్తుంది. మంచి ఫోటోగ్రఫీ చేసే స్పాట్ ఇది.

6.లలితా దేవీ ఆలయం | Lalita Devi Temple

యమునా నదీ తీరంలో కొలువై ఉన్న అందమైన దేవాలయాల్లో లలితా దేవీ ఆలయం కూడా ఒకటి. పండగల సమయంలో ఇక్కడికి చాలా మంది భక్తులు వస్తుంటారు.

7.అక్షయ్ వట్ | Akshaya Vat, Prayagraj

Pm Narendra Modi At Akshay vat
కొంత కాలం క్రితమే భారత ప్రధాని ఈ అక్షవ్ వట్ ఆలయాన్ని సందర్శించారు | Photo : Youtube@narendramodi

ఇది ఒక అంజీర్ చెట్టు. వట వృక్షం. అలహాబాద్ కోట ప్రాంగణంలో ఉండే ఈ వృక్షాన్ని చూసే అవకాశం కేవలం కుంభ మేళా సమయంలో అది కూడా ఒక్క రోజు మాత్రమే లభిస్తుంది. ఒకసారి స్థానికంగా వివరాలు కనుక్కోగలరు.

8.బడే హనుమాన్ ఆలయం | Bade Hanuman Temple

ఇక్కడ ఆంజనేయుడు భూమి లోపలి భాగంలో శయనించిన భంగిమలో ఉంటారు. ఈ ఆలయం హనుమాన్ జయంతి, రామనవమి సందర్భంగా భక్తులతో కిటకిటలాడుతుంది.

9.అశోఖ పిల్లర్ | Ashoka Pillar, Prayagraj

Ashoka pillar
అశోక పిల్లర్ ( ప్రతీకాత్మక చిత్రం)

అశోకుడి కాలంలో వెలసిన అసలైన అశోక పిల్లర్ అనేది ఒక ఏకశిలా రాయితో నిర్మించిన ఒక నిలువు రాయి ( Monolith ). ఇది అలహాబాద్ కోటకు చేరువలో ఉంటుంది. ఇలాంటి రాళ్లు మన దేశంలోని వివిధ ప్రాంతాల్లో ఉన్నాయి. కొన్ని ఇప్పటికీ నిలబడి ఉండగా కొన్ని నేలకు ఒరిగాయి.

10.నందన్ కానన్ వాటర్ రిట్రీట్ | Nandan Kanan Water Retreat

ప్రయాగ్‌రాజ్ ( Prayagraj ) నుంచి కాస్త దూరంలో ఉంటుంది. ఈ వాటర్‌పార్కులో రైడ్స్‌తో పాటు ఇతర యాక్టివిటీస్ చేయవచ్చు. కుటుంబంతో కలిసి వెళ్లి ఎంజాయ్ చేయగలిగే స్పాట్ ఇది.

11. కుంభ్ మేళా టెంట్ సిటీ | Kumbh Mela Tent City 

కుంభ మేళాకు విచ్చేసే భక్తుల కోసం వేలాది సంఖ్యలో టెంటులతో ఒక మినీ నగరాన్ని నిర్మించారు. ఈ టెంట్స్‌లో సకల సౌకర్యాలు ఉంటాయి. దగ్గర్లో భోజనం చేసేందుకు స్టాల్స్ కూడా అందుబాటులో ఉంటాయి.

Prayanikudu WhatsApp2
| ప్రతిరోజు వాట్స్ అప్ ద్వారా ట్రావెల్ కంటెంట్ తెలుగులో పొందాలి అనుకుంటే ఇక్కడ క్లిక్ చేయండి

12. మంగళ్ ధామ్ | Mangal Dham 

ఇది శ్రీకృష్ణుడికి అంకితం చేసిన అందమైన ఆలయం. మంగళ్ ధామ్‌‌ ఆలయం శిల్పకళా వైభవానికి కేంద్రం. కృష్ణాష్టమి సందర్భంగా ఈ ఆలయం ప్రత్యేకంగా ముస్తాబై భక్తులకు కనువిందు చేస్తుంది. 

13. నైనీ దేవి ఆలయం | Naini Devi Temple

యుమునా తీరంలో ఉన్న ఈ ఆలయం నైనా దేవి అమ్మవారికి అంకితమైన ఆలయం. కుంభ మేళా సమయంలో ఇక్కడికి భక్తులు ఎక్కువగా వస్తుంటారు. ఆలయంలోపలికి వెళ్లగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది.

14. శంకర విమాన మండపం | Shankar Viman Mandapam 

మహాశివుడికి అంకితమైన అత్యంత పవిత్రమైన ఆలయం ఇది. ఈ ఆలయ నిర్మాణం చాలా అద్భుతంగా ఉంటుంది. ఆలయ పరిసరాలు అందంగా ఉంటాయి. చాలా మంది ఇక్కడికి వచ్చి ధ్యానం , ఆధ్మాత్మిక సాధనలు చేస్తుంటారు.

15. సరస్వతి ఘాట్ | Saraswati Ghat 

20 Places To Visit In Prayagraj
ప్రయాగ్‌రాజ్‌లో నదీ తీరం ( ప్రతీకాత్మక చిత్రం )

సరస్వతి ఘాట్ చాలా అందంగా ఉంటుంది. అందమైన ఈ నదీ తీరంలో ప్రశాంతంగా కూర్చోవచ్చు.దీనికి తోడు ఇక్కడ చాలా తక్కువ మంది భక్తులు ఉంటారు. అయితే కుంభ మేళా సమయంలో భక్తుల సంఖ్య తక్కువగా ఉంటుంది అని మాత్రం చెప్పలేం. 

16. చంద్రశేఖర్ ఆజాద్ పార్క్ | Chandrashekar Azad Park

దీనిని ఆల్ ఫ్రెడ్ పార్క్ అని కూాడా పిలుస్తుంటారు. కుంభమేళాలో ఉన్న హడావిడి నుంచి తప్పించుకోవడానికి కాసేపు మీరు ఇక్కడికి రావచ్చు. ఇక్కడ స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని అమరులైన, భగత్ సింగ్‌కు గురువైన చంద్రశేఖర్ ఆజాద్ విగ్రహాన్ని మీరు ఇక్కడ చూడవచ్చు.

17. పాతాల్ పురి టెంపుల్ | Patalpuri Temple

అలహాబాద్ కోట లోపల ఉన్న ఈ పురాతన ఆలయం శ్రీరామడికి అంకితమైనది. యోగి, రుషి అయిన పతంజలి ధ్యానం చేసిన ప్రాంతంలో ఈ ఆలయం ఉంది. చరిత్ర, ఆధ్మాత్మికత కలిసిన ఒక పవిత్ర ఆలయం ఇది.

18. మన్‌ కామేశ్వర్ ఆలయం | Mankameshwar Temple

  మన్‌ కామేశ్వర్ ఆలయం | Photo:     mankameshwar temple Official
b mankameshwar temple

మహాశివుడికి అంకితమైన మరో ఆలయం మన్‌ కామేశ్వర్ ఆలయం. మనసులో ఉన్న కోరికలు నెరవేర్చమని మహాశివుడిని వేడుకోవడానికి భక్తులు ఇక్కడికి వస్తుంటారు. ఈ ఆలయం రాత్రి సమయంలో వైభవంగా కనిపిస్తుంది.

మహాకుంభమేళ కథనాలు

19. దశశ్వమేథ ఘాట్‌లో గంగా హారతి | Dashashwamedh Ghat Aarti

నదీ తీరాల్లో గంగా హరతిని విక్షించడం అద్భుతమైన ఆధ్మాత్మిక అనుభూతి. మరీ ముఖ్యంగా దశశ్వమేథ ఘాట్‌లో హారతి అనేది భక్తులను మంత్రముగ్దులను చేస్తుంది. 

20. ప్రయాగ్‌రాజ్ ప్లానెటేరియం | Prayagraj Planetarium

భారత దేశంలో ఉన్న అతిపెద్ద ప్లానిటేరియాల్లో ఇది కూడా ఒకటి. కుంభ మేళాకు పిల్లలతో పాటు వస్తే ఇక్కడికి వెళ్లేందుకు ప్రయత్నించండి. వాళ్లకు కాస్త ఛేంజ్ ఉంటుంది.

21. చిత్ర కూట్ ధామ్ | Chitrakoot Dham 

ప్రయాగ్‌రాజ్ నుంచి కొద్ది దూరంలోనే ఉంటుంది చిత్రకూట్ ధామం. రామాయణంతో ముడిపడి ఉన్న ఈ ప్రాంతం పర్యాటకులను తన అందం, వైభవంతో కట్టిపడేస్తుంది.

22. ప్రయాగ్‌రాజ్‌లో ఫుడ్ | Food In Prayagraj

ప్రయాగ్‌రాజ్‌లో సందర్శన స్థలాలే కాదు రుచికరమైన ఫుడ్ ఐటమ్స్ కూడా లభిస్తాయి. ప్రయాన్ ( Prayan Cuisine ) వంటకాలను రుచి చూడటానికి మీరు హీరా హల్వాయి, నేత్రామ్ మూల్చంద్ అండ్ సన్స్ వంటి స్పాట్స్‌కు వెళ్లవచ్చు. నార్త్ స్టైల్ ఫుడ్ మీకు ప్రతీ చోట లభిస్తుంది. దక్షిణాది వంటకాలు ప్రతీ చోట లభిస్తాయి.

ముగింపు 

మహాకుంభ మేళా సందర్భంగా ప్రయాగ్‌రాజ్‌లో ( Prayagraj ) ఎన్నో సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించనున్నారు. వాటిలో పాల్గొన్ని ఆధ్మాత్మిక ఆనందాన్ని పొందవచ్చు.

కుంభ మేళా సమయంలో ప్రయాగ్‌రాజ్ ఆధ్మాత్మిక వైభవం గురించి మాటల్లో చెప్పలేము. పైగా ఈ సారి యూపీ ప్రభుత్వం ప్రత్యక ఏర్పాటు చేసింది. భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే దిశలో అధికారులు సన్నద్ధం అవుతున్నారు. మీరు కుంభమేళా ప్లాన్ చేస్తే మాత్రం వెళ్లే ముందు అక్కడి పరిస్థితి, వాతావరణం, బుకింగ్ వంటి విషయాల గురించి తెలుసుకోండి.

గమనిక: ఈ వెబ్‌సైట్లో ప్రకటనలు కూడా ఉంటాయి. ముఖ్యంగా గూగుల్ యాడ్స్ ద్వారా ఈ ప్రకటనలు మీకు కనిపిస్తాయి. ఈ ప్రకటనలే మాకు ఆధారం. ఇందులో కొన్ని ప్రకటనలపై మీరు క్లిక్ చేస్తే మాకు ఆదాయం వస్తుంది.

Watch More Vlogs On : Prayanikudu

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.

Most Popular Stories

ప్రపంచ యాత్ర గైడ్

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!