ఎండలు దంచేస్తున్నాయ్…హిల్ స్టేషన్స్ పిలుస్తున్నాయ్ | Summer Hill Stations

షేర్ చేయండి

ఎండాకాలం అధికారికంగా మొదలైంది. వేసవి తాపానికి తట్టుకోలేక కొంత కాలం ఎండల నుంచి దూరంగా వెళ్తే బాగుంటుంది అనుకుంటారు చాలా మంది. అలాంటి వారికోసమే సమ్మర్‌లో మన దేశంలో వెళ్లాల్సిన 6 హిల్ స్టేషన్స్ (Summer Hill Stations)…

ఎండాకాలం మొదలైందో లేదో అప్పుడే ఏం ఎండలురా బాబూ, కొంత కాలం ఏదైనా చల్లని ప్రదేశానికి వెళ్తే బాగుండు అనుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. ఇలాంటి ఎండల్లో కూడా మనసు, తనువు సేదతీరేందుకు మన దేశంలో అద్భుతమైన హిల్ స్టేషన్స్ (Summer Hill Stations) ఎన్నో ఉన్నాయి. ఈ ఎండల నుంచి దూరంగా కాస్త చల్లని వాతావరణంలో గడపాలి అని మీరు అనుకుంటే మీ కోసం 6 హిల్ స్టేషన్స్ సజెస్ట్ చేస్తున్నాం. చదవండి.

1. సిమ్లా, హిమాచల్ ప్రదేశ్ | Shimla, Himachal Pradesh

Shiimla
సిమ్లా

సిమ్లాను క్వీన్ ఆఫ్ హిల్స్ (Queen Of Hills) అంటారు. బ్రిటిష్ కాలం నుంచి కూడా బాాగా ఫేమస్ హిల్ స్టేషన్లలో ఇది కూడా ఒకటి. ఇక్కడి మంచుతో నిండిన పర్వతాలు, దూర దూరం వరకు ప్రశాంతంగా కనిపించే లోయలు, అందమైన మాల్ రోడ్స్ ఇవన్నీ కూడా సిమ్లాకు మళ్లీ మళ్లీ వెళ్లేలా చేస్తాయి.

  • దీంతో పాటు మీరు లోకల్ మార్కెట్స్ విజిట్ చేయవచ్చు.
  • ప్రశాంతంగా అక్కడి కేఫ్స్‌లో కూర్చుని వ్యూ చూసుకుంటూ వేడి వేడి కాఫీని సిప్ చేయవచ్చు.
  • కళ్లు చెదిరే అందాలను చూడాలి అనుకుంటే మీరు జాఖూ అలయం (Jakhoo Temple) ప్రాంతానికి వెళ్లవచ్చు. 

లేదంటే మీరు యూనెస్కో వారసత్వ (UNESCO World Heritage Site) సంపదగా గుర్తింపు తెచ్చుకున్న శివాలిక్ పర్వత శ్రేణుల మధ్య, వ్యూ చేస్తూ టాయ్ ట్రెయిన్ రైడ్ (Toy Train Ride) ఎంజాయ్ చేయవచ్చు.

2. మనాలి , హిమాచల్ ప్రదేశ్

Manali
మనాలి

Manali, Himachal Pradesh : మనాలి అనేది ప్రకృతి ప్రేమికులకు స్వర్గం లాంటిది. సాహసయాత్రలు ఇష్టపడే వారికి ఇది ఒక అద్భుతమైన డెస్టినేషన్. ఒకవైపు మంచు మరో వైపు అందమైన లోయలు (Manali Valley) , యాపిల్ తోటలు, అనేక వ్యాలీస్‌లో ఉండే యాక్టివిటిస్ ఇవన్నీ మనాలిని భారతీయుల ఫేవరిట్ హిల్ స్టేషన్‌గా మార్చాయి. 

  • ఈ క్రేజ్ ఎంతగా పెరిగింది అంటే చలికాలం మనాలి (Manali in Winter) ఒక చాపల మార్కెట్‌లా మారిపోతుంది. రోజుల కొద్ది ట్రాఫిక్‌‌జామ్స్ కామన్ అయ్యాయి.
  • దీంతో తెలివైన ప్రయాణికులు (Intelligent Traveler) మనాలి లాంటి రద్దీ ఉండే అందమైన హిల్ స్టేషన్స్‌కు చలికాలం వెళ్లకుండా మరో సీజన్‌లో వెళ్తున్నారు.

ఇలా మనాలి వెళ్లాలని ఉన్నా రోజుల కొద్ది ట్రాఫిక్, భారీ రద్దీ నుంచి తప్పించుకోవాలి అనుకునే వారి కోసం సమ్మర్ చాలా మంచి టైమ్. 

మనాలి చేయాల్సినవి 
  • సోలాంగ్ వ్యాలీలో (Solang Valley) లో ప్యారాగ్లైడింగ్, జోర్బింగ్, కేబుల్ కార్ రైడింగ్ చేయవచ్చు.
  • రోహ్తాంగ్ పాస్ వెళ్లవచ్చు.
  • మనాలి మాల్ రోడ్, అటల్ టన్నెల్ వంటివి చూడవచ్చు.
  • ఇది కూడా చదవండి : మనాలీలో చేయాల్సిన 30 యాక్టివిటీస్

3. ఊటీ, తమిళనాడు | Summer Destinations

Summer Destinations
Ooty

Ooty, Tamil Nadu : నీలగిరి పర్వతాల్లో ఉన్న ఊటీ తన చల్లని వాతావరణానికి, అందమైన పచ్చని భౌగోళిక స్వరూపానికి చాలా పాపులర్.

  • ఇక్కడ మీరు ఊటీ సరస్సులో (Ooty Lake) బోటింగ్ చేయవచ్చు.
  • స్థానిక బొటానికల్ గార్డెన్ ఎక్స్‌ప్లోర్ చేయవచ్చు.
  • వీలైతే నీలగిరి పర్వతాల (Nilgiris Mountains) అందాల్ని చూస్తూ నీలగిరి మౌంటేన్ రైల్వేలో ప్రయాణించవచ్చు.

4. డార్జిలింగ్ , పశ్చిమ బెంగాల్

Summer Destinations
టూరిస్టుల డార్లింగ్…డార్జిలింగ్

Darjeeling, West Bengal : డార్జిలింగ్ అంటే ముందుగా అక్కడి టీ గుర్తుకు వస్తుంది. దీనిని కూడా చాలా మంది క్వీన్ ఆఫ్ హిల్స్ అని పిలుస్తారు. ఇక్కడ దూరదూరం వరకు విస్తరించి ఉన్న టీ ఎస్టేట్స్, అందమైన లోయలు, అక్కడి నుంచి కనిపించే కాంచన్‌జెంగా పర్వత శ్రేణి ( Kanchenjunga range) ఇవన్నీ పర్యాటకులను కట్టిపడేస్తాయి. 

5. లేహ్- లద్దాఖ్, జమ్మూ & కశ్మీర్ 

Leh Ladakh
ప్యాంగాంగ్ సరస్సు

Leh-Ladakh, Jammu & Kashmir : భారత దేశంలో ఉండే ప్రతీ పర్యటకుడు తన జీవితంలో ఒక్కసారి అయినా వెళ్లాలి అని కలలు కనే ప్రాంతం లేహ్, లద్ధాఖ్.  సాహసయాత్రికులు, బైకర్లు అయితే ఇక్కడికి వెళ్లాలని ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంటారు. 

  • ఇక్కడి వెళ్లేందుకు సమ్మరే మంచి సమయం. ఎందుకంటే వాతావరణం బాగుంటుంది. రోడ్లపై మంచు అంతగా కనిపించదు.
  • ఈ ట్రిప్‌లో మీరు ప్యాంగ్యాంగ్ సరస్సు ( Pangong Lake) , నుబ్రా వ్యాలీలో బాగా ఎంజాయ్ చేస్తారు. 
  • ఇక్కడ జాంస్కర్ నదిలో (Zanskar River) లో రాఫ్టింగ్ కూడా చేయవచ్చు.

6. మున్నార్, కేరళ

Munnar
మున్నార్

Munnar, Kerala : కేరళలోని పశ్చిమ కనుమల్లో ఉన్న మున్నార్‌‌కు చాలా మంది ఎండాకాలం వెళ్లడానికి ఇష్టపడుతుంటారు. ఎందుకంటే వేసవి తాపం నుంచి తప్పించుకోవడానికి ఇది మంచి డెస్టినేషన్.

  • ఇక్కడ మీరు రోలింగ్ టీ ప్లాంటేషన్‌తో పాటు పొగమంచులో ఉన్న ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఎంజాయ్ చేయవచ్చు.
  • దీంతో పాటు ఎరావికులమ్ జాతీయ పార్క్ (Eravikulam National Park) విజిట్ చేయవచ్చు.
  • స్థానిక టీ మ్యూజియంలో మీరు టీ మేకింగ్‌లో మెళకువలు తెలుసుకోవచ్చు.
  • దీంతో పాటు మట్టుపెట్టి డ్యామ్‌లో (Mattupetty Dam), కుండల సరస్సులో బోటింగ్ ఎంజాయ్ చేయవచ్చు.

చలికాలంలోనే టూర్లుకు వెళ్లాలి లేదా వర్షాకాలంలోనే వెళ్లాలి అని ఫిక్స్ అవ్వకుండా ఎండాకాలంలో కూడా మీరు ఎంజాయ్ చేసే డెస్టినేషన్స్ మీకు సూచించడం జరిగింది. ఈ పోస్టులో ప్రస్థావించిన సమ్మర్  డెస్టినేషన్స్ (Summer Destinations) అనేవి అన్ని వర్గాల పర్యాటకులకు ఆహ్లాదకరమైన అనుభూతిని కలిగిస్తాయి. ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ, స్పెషల్ పర్సన్స్‌తో వెళ్లేందుకు అనువైన ప్రదేశాలు ఇవి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!