Travel Tip 01 : ప్రయాణాల్లో తక్కువ బరువు – ఎక్కువ ఆనందం కోసం 5 చిట్కాలు
Travel Tip 01 : ప్రయాణాలు అనగానే మనలో ఒక ఉత్సాహం మొదలవుతుంది. అయితే ప్యాకింగ్ పూర్తయ్యాక వామ్మో ఇంత లగేజేంటి అసలు నేను కరెక్టుగానే ప్యాక్ చేశానా అనే డౌట్ కూడా వస్తుంది. అప్పుడు ప్యాక్ చేసిన వాటిలో ఇంపార్టెంట్ ఏంటి అంత ఇంపార్టెంట్ కానిది ఏంటో తేల్చుకోవడంలో పడి ఉత్సాహం కాస్త ఆవిరవుతుంది.
ఈ విషయంలో మీ ఉత్సాహం తగ్గకుండా, మీ ప్రయాణాన్ని సరైన విధంగా ప్లాన్ చేసేందుకు మీ ప్రయాణికుడు కొన్ని చిట్కాలు తీసుకొచ్చాడు.
- ఇది కూడా చదవండి : 2025 లో స్మార్ట్ ట్రావెలర్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్ ఇవే !
ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రయాణాలు అనేవి మనల్ని మనం కొత్తగా ఇన్వెంట్ చేసుకునేందుకు లభించే అవకాశాలు. పాత విషయాలు, మనం వాడే సామాన్లు కొంత కాలం వెనక్కి నెట్టి ముందుకెళ్ల డానికే మనం యాత్రలు చేస్తాం. అంటే ఇప్పడు మీరు ఫోకస్ పెట్టాల్సింది మీపైన. సామాన్లపైన కాదు. అందుకే ఆ బ్యాగులోంచి కొన్ని సామాన్లు తీసేయండి.
మీ బ్యాంగులోంచి అన్నీ తీసేయమని చెెప్పడం లేదు నేను. చక్కగా ప్యాక్ చేసుకోవడానికి తక్కువగా ప్యాక్ చేసుకోవడానికి చాలా తేడా ఉంది. మీ ప్రయాణం సాఫీగా, తేలిగా, ఎలాంటి ఎక్స్ ట్రా ఫీజులు చెల్లించకుండా ప్యాక్ చేసుకోవడం గురించి నేను మాట్లాడుతున్నాను.
నేను హేంకుండ్ సాహిబ్ యాత్రకు (Hem Kund Sahib Yatra) వెళ్లినప్పుడ నాకన్న నా బ్యాగునే జాగ్రత్తగా కాపాడుకోవాల్సి వచ్చింది. దానికి తోడు ఎంత బరువు ఉండేనంటే గుర్రాలు వాడీ వాడి నా పర్సు బరువు తగ్గింది. అప్పుడు అర్థం అయింది నేను కాదు, నా బ్యాగే ప్రయాణాలు చేస్తోంది. నేను దాన్ని మోయడానికి కూలిని అయ్యాను. అని…
Watch : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వారా వద్ద బ్రహ్మకమలం చూశాను
ఇలా ఎంత చెప్పినా సోది అనే అనుకుంటారు…అందుకే డైరక్టుగా 5 చక్కని చిట్కాలు మీకోసం అందిస్తున్నాను.
తక్కువగా సాసమాన్లు…ఎక్కువ ఆనందం కోసం ఈ చిట్కాలు పాటించండి.
1. సింపుల్ డ్రెస్సులు | How To Pack Cloths For Travelling
మీకు బాగా సెట్ అయ్యే బట్టలు తీసుకెళ్లాలి అని మీకు ఉంటుంది. కానీ మీరు మాత్రం దేనికైనా మ్యాచ్ అయ్యే బట్టలను పెట్టుకోండి.
- ఉదాహరణకు: మీ దగ్గర ఉండే ఒక టీ షర్టు, ఒక జీన్స్ లేదా ఒక జాకెట్ అది దేనికైనా సెట్ అవుతుంది అనిపిస్తే…అలాంటివే ప్యాక్ చేసుకోండి.
- ఒక జాకెట్ మొత్తం ట్రిప్‌కు సరిపోతుంది అంటే బెస్టు కదా. అలాగే మూడు టీ షర్టులతో, రెండు జీన్సులతో పని అయిపోతుంది అంటే బ్యాగు తేలికగా ఉంటుంది కదా.
- నలుపు, తెలుపు, గ్రే, నేవీ బ్లూ లాంటి రంగులు దేనితో అయినా మ్యాచ్ అయ్యేలా ఉంటాయి. అలాంటివి ఏమైనా ఉన్నాయేమో ఆలోచించండి.
- ఇది కూడా చదవండి : Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
- వీలైనంత వరకు జీన్స్‌కు బదులు త్వరగా ఆరే పాలిస్టర్ బ్లెండ్, మెరీనో వూల్ లేదా ఇతర పెర్ఫార్మెన్స్ కాటన్ దుస్తువులు ట్రై చేయండి. వీటిని క్విక్ డ్రై ఫ్యాబ్రిక్ అంటారు (Quick Dry Fabric)
2. ఫుట్ వేర్ : Footwear | Travel Tip 01
షూ ర్యాక్‌లో మీకు ఎన్ని జతలు ఉన్నా మీరు మాత్రం రెండు జతలే మీ బ్యాగులో పెట్టుకోండి.
- ఒకటి మీరు బస్సులో, విమానాల్లో వెళ్లడానికి, ఎయిర్పోర్ట్ లాంజ్, నడక అంతగా అవసరం లేదని ప్రదేశాల కోసం లైట్ వెయిట్ ఫుట్‌వేర్ ట్రై చేయండి. ఉదాహరణకు : స్నీకర్స్, క్రాక్స్, ప్లోటర్స్, శాండిల్స్, స్పోర్ట్స్
- రెండవది క్యాజువల్ లేదా ఫార్మల్ యూజ్ కోసం : మనం ఫంక్షన్లకు, ఆలయాలకు, ఏదైనా ఫోటోకు లేదా చక్కగా నీట్‌గా కనిపించేందుకు ట్రావెల్ షూస్, ఫ్లోట్ శాండిల్స్ లాంటివి అన్నమాట.
3. చిన్న సబ్బుల బ్యాగు లేదా పెట్టె | Mini Toiletries
ప్రయాణాల్లో తక్కువ వాడేవి అయినా తప్పనిసరి అయినవే టాయిలెట్రీస్ ( Toiletries). అంటే సబ్బులు, పేస్టులు, షేరింగ్ సెట్ ఇలాంటివి అన్నమాట. వీటిని మనం పెద్ద పెద్ద ప్యాకుల్లో, డబ్బాలతో పాటు యథావిధిగా తీసుకెళ్తే బ్యాగు సరిపోదు…పైగా మోతబరువు తప్పదు. అందుకే చిన్న చిన్న ప్యాకకులు, బాటిల్స్‌లో తీసుకెళ్లండి.
- ఇది కూడా చదవండి : విదేశీ ప్రయాణంలో మందులు ఎలా ప్యాక్ చేసుకోవాలి ? | Medicines For An International Trip
- చిన్న చిన్న డబ్బాల్లో, కవర్లో అందులో ప్యాక్ చేసుకునేలా ట్రై చేయండి.
- లేదంటే పది రూపాయల టూత్‌పేస్ట్, 5 లేదా 10 రూపాయలు సబ్బు బిల్ల, రూపాయి షాంపూ ప్యాకెట్ ఇలా ట్రై చేయండి. నేనైతే అన్ని మినీ వర్షన్ ప్రిఫర్ చేస్తాను. ( అనుభవం నుంచి నేర్చుకోకుంటే ప్రతీసారి ఇబ్బంది పడాల్సి ఉంటుంది)
- టవల్ కూడా త్వరగా ఆరిపోయే ( Quick Dry) సన్నది తీసుకెళ్లండి.
4. అవసరమైన సాంకేతిక పరికరాలే..| Tech Essentials for Traveling
ఒక ఫోను, ఒక ఛార్జర్, ఒక పవర్ బ్యాంకు అవసరం అనిపిస్తే ఒక వైర్డ్ హెడ్ సెట్ (చిన్నది) సరిపోదా మీ ప్రయాణానికి ?.
- మీకు అవసరం లేదు అనిపిస్తే కెమెరాను, ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్‌ను తీసుకెళ్లకండి.
- ల్యాప్‌టాప్ తీసుకెళ్తే ట్రిప్‌కు వెళ్లి కూడా పని చేస్తారు. మిమ్మల్ని ఎవరైనా ఆపగలారా ?
- నిజం చెప్పాలంటే వీటి నుంచి దూరంగా వెళ్లేందుకే కదా టూర్లు వేసేది. అయితే మీకు ఉద్యోగపరంగా వెళ్తే మీ ప్రయారిటీస్ మీరు నిర్ణయించుకోండి. కానీ సరదాగా వెళ్తోంటే…మీరే ఆలోచించుకోండి.
- ఇది కూడా చదవండి :విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip
5 ప్యాకింగ్ క్యూబ్స్ | Packing Cubes
బ్యాగులో వస్తువుల, బట్టలను ఎలా పడితే అలా కాకుండా ఒక పద్ధతిగా ఉంచడానికి క్యూబ్స్ వాడండి. అంటే చిన్న చిన్న బాగులు అన్నమాట. ఒక బ్యాగులో ఒక జత లేదా రెండు. మరో బ్యాగులో టాయిలెట్రీస్, మరో బ్యాగులో చలి దుస్తువులు లేదా రెయిన్ కోర్టు…ఇలా ఒక పద్ధతిగా ప్యాక్ చేసుకోవడంలో క్యూబ్స్ బాగా ఉపయోగపడతాయి
Prayanikudu Telugu Travel Tips : నెక్ట్స్ టైమ్ మీరు ఏదైనా ప్రయాణం పెట్టుకున్నప్పుడు మీకు ఏది అవసరమో అవి మాత్రమే తీసుకెళ్లేలా ప్లాన్ చేయండి. ఎందుకంటే లగేజ్ ఎంత తక్కువ ఉంటే ఆనందం అంత ఎక్కువగా లభిస్తుంది. లేదంటే బ్యాగకు బానిసత్వం చేసినట్టు, బ్యాగును నాలుగు ఊర్లు తిప్పినట్టు అవుతుంది.
థంబ్‌నెయిల్ ఫోటోలో మీరు గమనించే ఉంటారు. బద్రినాథ్‌లో నా రూమ్‌కి వెళ్తున్న సమయంలో తీసిన ఫోటో అది. ఆ బ్యాగులు ఎంత బరువు ఉన్నాయో మీకు చూస్తేనే అర్థం అవుతోంది అనుకుంటా. మీరు మాత్రం అలా ప్యాక్ చేకోకండి ప్లీస్. నేను ఇబ్బంది పడటానికి కారణం ఉంది. చాలా ఎక్స్పరిమెంట్స్ చేస్తుంటాను. కామీ మీరు మాత్రం లైట్‌గా ట్రావెల్ చేయండి.
Watch : బద్రినాథ్ పుణ్య క్షేత్ర దర్శనం చేసుకోండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.