Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు
Travel Tips 05 : తెలంగాణ రాష్ద్రంలో తక్కువ బడ్జెట్లో ప్రయాణించాలి అనుకుంటున్నారా ?మీ జేబుకు చిల్లు పడకుండా ఇలా ట్రావెల్ చేయండి. మీకోసం 7 టిప్స్.
Want to explore Telangana on a budget : తెలంగాణ రాష్ట్రాంలో (Telangana) పనిమీదో, లేదా విహరయాత్రకో ఇలా కారణం ఏదైనా సరే వెళ్లాలి అనుకుంటే ఎలా వెళ్తే ఎంత ఖర్చు అవుతుంది, తక్కువ ఖర్చులో ప్రయాణాలు ఎలా అని ఆలోచిస్తే ఈ పోస్టు మీ కోసమే. మీ జేబుకు చిల్లు పడకుండా ప్రశాంతంగా మీ గమ్యస్థానానికి చేరుకునేందుకు ఇవి ఉపయోగపడతాయి.
1. తెలంగాణ ఆర్టీసి బస్ | TSRTC Buses
తెలంగాణలో లోకల్ ట్రావెలింగ్కు వెన్నెముక తెలంగాణ ఆర్టిసి బస్సు. చాలా తక్కువ ధరలో రాష్ట్రంలోని మారుమూల గ్రామాలకు కూడా వెళ్లవచ్చు. పైగా ఆర్టీసి బస్సులో శిక్షణ పొందిన, అనుభవం ఉన్న డ్రైవర్ల చేతిలో స్టీరింగ్ ఉంటుంది. కాబట్టి నిర్భయంగా, ప్రశాంతంగా మీరు వెళ్తున్న పనిపై ఫోకస్ పెట్టవచ్చు.
2.ఎంఎంటీఎస్ | MMTS Trains (Hyderabad)
ఎంఎంటీఎస్ అంటే మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సర్వీస్. ఈ సర్వీసును ప్రారంభించిందే జంట నగరాలు శివారు ప్రాంతాల్లో ట్రావెల్ చేసే ప్రయాణికులకు సురక్షితంగా, చవక ధరకు, మన్నికైన ప్రయాణ అనుభవాన్ని కలిగిస్తూ వారి గమ్యస్థానానికి చేర్చడం కోసం.
- హైదరాబాద్ (Hyderabad) ఏరియాల్లో లేదా శివారు ప్రాంతాల్లో ప్రయాణించడానికి ఎంఎంటీఎస్ బెస్ట్ ఆప్షన్.
- టికెట్ ధర రూ.5 నుంచి ప్రారంభం అవుతుంద. రూ. 15 రూపాయలను మించదు.
- కావాలంటే ఒకసారి ట్రై చేసి చూడండి.
3.సెట్విన్ మినీ బస్సులు | Setwin Mini Buses
హైదరాబాద్, సికింద్రాబాద్‌లో (Secunderabad) ఉండే చాలా మంది ఆటోలకు బదులు తక్కువ ధరలో సెట్విన్‌లో ప్రయాణిస్తారు. నగరంలోని అనేక ప్రాంతాలకు వెళ్లేందుకు విద్యార్థులు, ఉద్యోగులు సెట్విన్ సేవలను వినియోగిస్తారు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తరువాత కామెంట్ చేయండి.
- ఇది కూడా చదవండి : Weird Food : ప్రపంచంలోనే అత్యంత వికారమైన 5 ఆహార పదార్థాలు
4. షేరింగ్ ఆటోె లేదా బైక్ | Travel Tip 05
Sharing Auto & Bike : తక్కువ దూరంలో ప్రయాణించాలి అనుకుంటే షేరింగ్ ఆటోలు, ర్యాపిడో, ఊబర్, ఓలా బైకులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణలోని ప్రధాన పట్టణాలు, అనేక గ్రామాలను, ఆలయాలు ఇలా అనేక ప్రాంతాల్లో షేరింగ్ ఆటోలు అందుబాటులో ఉంటాయి. ఒక వ్యక్తి పూర్తి ఆటోకు ఇచ్చే చార్జీని కొంత మంది మధ్య షేర్ చేస్తారు.
- ఉదాహారణకు : సంగారెడ్డిలో ఉన్న జహీరాబాద్ (Zahira bad )బస్టాండ్ నుంచి దగ్గర్లోని చీలపల్లి, ఎల్గోయి, బర్దిపూర్ వంటి గ్రామాలకు చేరకునేందుకు ఒక వ్యక్తి నుంచి రూ.200-300 చార్జ్ చేస్తారు. అదే మీరు షేరింగ్‌లో వెళ్తే మీకు రూ.50 నుంచి 100 వరకు పడొచ్చు.
- మెహిదిపట్నం నుంచి జిర్రా వెళ్లందుకు మీకు ప్రైవేట్ ఆటోకు రూ.150 వరకు చార్జీ అవ్వొచ్చు. అదే షేరింగ్‌లో వెళ్తే మీకు రూ.20 నుంచి 30 వరకు మాత్రమే ఖర్చు అవుతుంది.
- ఇంకా చాలా పెద్ద లిస్టు ఉంది. కానీ ఇప్పుడు అది అవసరం లేదు. షేరింగ్ వల్ల మనీ సేవ్ అవుతుంది అనేది చెప్తున్నాను. Hope You Understood.
5.ట్రెక్కింగ్ లేదా పాదయాత్ర | Trekking & Walking Trails
పాదయాత్ర అంటే రాజకీయాల్లో చేసే టైప్ది కాదు. జస్ట్ మీరూ మీ బ్యాగు అంతే…అలా నడుచుకుంటూ వెళ్లిపోవడం. చిన్న చిన్న దూరాలను కవర్ చేసేందుకు ఇది పనికొస్తుంది. కానీ ఎక్కువ డిస్టెన్స్ కవర్ చేయడానికి కాదు.

చేరుకున్నాం. its not about money., some time, మన కాళ్లకు పని చెబితే కళ్లు కూడా సంతోషిస్తాయి…లొకేషన్స్‌ను చూస్తూ…
కావాలంటే Mana వీడియోను మీరు కూడా చూడండి :
how to travel in telangana : ఇక ఏదైనా టెక్కింగ్‌కు వెళ్తే మీకు థ్రిల్‌తో పాటు ప్రయాణ చార్జీలు కూడా తగ్గుతాయి. కొంచెం వివరంగా చెబుతాను.
- సింపుల్‌గా మీరు వెళ్లే ప్రాంతం సేఫ్‌గా నడుచుకుంటూ లేదా ట్రెక్కింగ్ చేసుకుంటూ వెళ్లే జాబితాలో ఉంటే వెళ్లండి.
- ఎలాంటి ఖర్చు చేయకుండా, సరదాగా ఎంజాయ్ చేస్తూ వెళ్లవచ్చు.
- బట్ సేఫ్ అయితేనే ట్రై చేయండి. లేదంటే వద్దు.
- ఇది కూడా చదవండి : Travel Tip 04 : ప్రయాణాల్లో తప్పకుండా తీసుకెళ్లాల్సిన టాయిలెటరీస్ ఏంటో తెలుసా?
6. ఆర్టీసి బస్ పాస్ | TSRTC Special Passes
ఇక రెగ్యులర్‌గా ట్రావెల్ చేసే వాళ్లు, విద్యార్థులు పాస్ తీసుకుని అన్‌లిమిటెడ్‌గా ట్రావెల్ చేయొచ్చు. స్డూటెంట్స్ కోసం స్టూడెంట్ పాస్‌లతో పాటు సాధారణ ప్రయాణికుల కోసం జనరల్ ఆర్డినరీ, మెట్రో పాసులతో పాటు కొన్ని డే పాసులు కూడా అండుబాటులో ఉంటాయి.
7. కార్పూర్ గ్రూపులు | Carpool Groups
మీరున్న ప్రాంతాల్లో కార్‌పూల్ చేసుకుని నలుగురితో కలిసి వెళ్లే అవకాశం ఉందేమో చెక్ చేయండి. ఇది కూడా ఒక రకంగా షేరింగ్ ఆటో లాంటిదే. కాపోతే ఇక్కడ ఒకరి కారులో ఖాళీగా వెళ్లే బదులు అదే దారిలో వెళ్లే వారిని ఎక్కించుకుని వెళ్తాడు కారు యజమాని లేదా ఒక ట్రావెలింగ్ ఏజెన్సీ. వారికి సీట్లు ఫిల్ అవుతాయి. పెట్రోల్ ఖర్చులు షేర్ అవుతాయి. ప్రయాణికులకు కూడా బర్డెన్ అంద్ సౌకర్యం.
ఇందులో కొన్ని యాప్స్ లేదా వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో కొంత మంది తమలాగే ఒకే మార్గంలో వెళ్లే వారితో కలిసి ప్రయాణిస్తారు.
దీని వల్ల డబ్బు ఆదా అవుతుంది. కాలుష్యం కూడా తగ్గుతుంది.
ఇలాంటి ట్రావెల్ టిప్స్ కోసం క్లిక్ చేయండి.
ఈ కంటెంట్‌పై చేసిన షార్ట్ ఇప్పుడే చూడండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.