Travel Tips 40: పీక్ సీజన్లో హోటల్స్ చవకగా ఎలా బుక్ చేసుకోవాలి- 12 Proven Hacks
Travel Tips 40 : పీక్ సీజన్లో కొత్త ప్రదేశంలో హోటల్ బుక్ చేయడం అనేది పెద్ద తలనొప్పిగా మారుతుంది. కానీ ఈ 12 హ్యాక్స్‌తో మీరు 18-47 శాతం సేవింగ్స్ కూడా చేసుకోవచ్చు.
- పీక్ సీజన్లో ప్రయాణాాలు (Travelling) చేస్తున్నప్పుడు హోటల్ బుకింగ్ చేసుకోవడం అనేది పెద్ద తలనొప్పిగా మారిపోతుంది.
- మరీ ముఖ్యంగా హైదరాబాద్ (Hyderabad), ఊటీ (Ooty) , గోవా (Goa), కేరళ (Kerala), కశ్మీర్ (Kashmir) వంటి పాపులర్ డెస్టినేషన్‌లో ధరలు రాకెట్లా దూసుకెళ్తాయి.
- అందుకే ఈ తలనొప్పిని ఒక ఆర్ట్‌గా మార్చేలా మీతో 12 చిట్కాలు షేర్ చేస్తాను.
మీకోసం నేను Travel Tips 40 లో అందించిన ఈ సింపుల్ హ్యాక్స్ వల్ల మీరు హోటల్ బుక్ చేసుకోవడమే కాదు 18-47 శాతం డబ్బులు కూడా సేవ్ చేసుకోవచ్చు.
ముఖ్యాంశాలు
ఈ టిప్స్ ఎవరి కోసం అంటే.. : Quick Info Box
ఈ ట్రావెల్ టిప్స్ (Travel Tips) అనేవి హోటల్స్, రిసార్టులు ( Resorts), హోమ్ స్టేలు, హాస్టల్స్‌లో బుకింగ్ చేయడానికి ప్రయత్నిస్తున్న వారికి ఉపయోగపడతాయి.
- అది కూడా సమ్మర్, న్యూ ఇయర్ (New Year), లాంగ్ వీకెండ్స్ (Weekends), పండగల సమయంలో బాగా ఉపయోగపడతాయి.
- దీని వల్ల మీకు 18 నుంచి 47 శాతం వరకు డబ్బు ఆదా అవుతుంది.
- ఇది కూడా చదవండి : First time Flyers : ఫస్ట్ టైమ్ విమానం ఎక్కుతున్నారా ? ఈ 10 టిప్స్ మీ కోసమే
1.గోల్డెన్ టైమ్‌లో బుక్ చేసుకోండి | Book In Golden Time
డబ్బుల ఆదా (Money Saving) చేయాలి అంటే ముందు హోటల్ బుకింగ్స్‌కు సంబంధించిన గోల్డెన్ టైమ్ గురించి తెలుసుకోవాలి. బుధవారం రోజు మధ్యామ్నం 12 గంటల నుంచి 4 గంటల మధ్య హోటల్ ధరలు అంత స్టేబుల్‌గా ఉండవు.
- యాప్స్ కూడా డిస్కౌంట్ పుష్ చేస్తాయి.
- ఈ స్మాల్ విండోలో బుక్ చేస్తే కనీసం 8 నుంచి 12 శాతం సేవ్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Solo Female Travelers : మహిళలు ఒంటిరి ప్రయాణాలు ఎలా ప్లాన్ చేసుకోవాాలి ? ఎలాంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి?
2.ఇంకాగ్నిటో మోడ్ లేదా వేరే డివైజ్ | Incognito Mode or Different Device
ఇది చాలా సింపుల్ కానీ పవర్ఫుల్ టిప్. ఎందుకంటే బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ అనేవి మీ సెర్చ్ హిస్టరీ ఆధారంగా ధరను పెంచుతుంటాయి. అందుకే మీరు ఇంతకు ముందు లాగిన్ అయిన డివైజ్ కాకుండా మరో డివైజ్‌లో ట్రై చేయండి.
- అలాగే ఇంకాగ్నిటో మోడ్‌లో సెర్చ్ చేసి బుక్ చేసుకోండి.
- ఇలా చేయడం వల్ల 5 నుంచి 10 శాతం వరకు డబ్బులు ఆదా చేసే అవకాశం ఉంది.
- ఇది కూడా చదవండి : Flight Ticket Bookings: ఫ్లైట్ టికెట్స్ చవకగా బుక్ చేసుకోవడానికి 11 టిప్స్
3.ఏరియా మార్చండి
మీరు ఏ సిటికి వెళ్లినా అక్కడి మెయిన్ టూరిస్ట్ హబ్ (Tourist Hub) లేదా కమర్షియల్ ఏరియాలో బుక్ చేస్తుంటారు కదా. ఇది సాధారణంగా అందరూ చేసేదే. కానీ ఆ ప్రాంతాలకు దగ్గర్లో ఉన్న మరో ఏరియాలో కాస్త దూరంలో ట్రై చేస్తే ఇంకా బెటర్ డీల్స్ వస్తాయి.
- సో మీరు చార్మినార్ (Charminar) వెళ్లాలి అనుకుంటే బంజారాహిల్స్, మాసాబ్‌టాంక్ లేదా ఇతర ప్రాంతాల్లో వెతికి చూడండి. మంచి రేటింగ్‌లో తక్కువ ధరలో ఉన్న స్టేను బుక్ చేసుకోవచ్చు.
- కావాలంటే మీరు మ్యాప్స్ (Google Maps) వాడి దగ్గర్లో ఉన్న ప్రాంతాలు సెర్చ్ చేసి అందులో సేఫ్ అయిన వాటిలో ప్రయత్నించవచ్చు.
- దీని వల్ల మీరు 25 నుంచి 45 శాతం వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
ఇది కూడా చదవండి : Travel Tips 06 : ఏపీ మొత్తం చవకగా తిరగాలి అనుకుంటున్నారా ? 7 హ్యాక్స్ ట్రై చేయండి
4.శని, ఆదివారాల్లో వద్దు
శని, ఆదివారాల్లో హోటల్ బుకింగ్స్ పీక్స్‌లో ఉంటాయి. ఎందుకంటే చాాలా మందికి లాస్ట్ మూమెంట్లోనే ప్లాన్ చేస్తారు.అందుకే సోమవారం నుంచి గురువారం మధ్యలో బుక్ చేసేలా ప్లాన్ చేసుకోండి.
- దీని వల్ల మీరు కనీసం 10 నుంచి 35 శాతం వరకు సేవ్ చేసుకునే అవకాశం ఉంటుంది.
- ఇది కూడా చదవండి : Travel Tips 05 : తెలంగాణలో చవకగా ట్రావెల్ చేసే 7 మార్గాలు
5.హోటల్‌కు కాల్ చేయండి
ఇది చాలా ట్రెడిషనల్ అండ్ చాలా మంచ విధానం. హోటల్‌కు డైరెక్టుగా ఫోన్ చేస నాకు ఆన్లైన్లో వెతికితే ఇక్కడ తక్కువ ధరకు రూమ్ దొరుకుతుంది అని తెలిసింది అని చెప్పండి. దీని వల్ల మీకు Hotels OTA కమిషన్ చెల్లించే అవసరం పడదు.
- మీకు తక్కువ ధరకే హోటల్ రూమ్ లభించే అవకాశం ఉంది. బుకింగ్‌కు ముందు కంపేర్ చేసుకోండి.
- ఫ్రీ ఎర్లీ చెకౌట్స్ చేేసుకోవచ్చు.
- ఫ్రీ లేట్ చెకౌట్ ఆప్షన్ లభిస్తుంది.
- 10-20 శాతం వరకు డబ్బులు ఆదా చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Travel Tips 04 : ప్రయాణాల్లో తప్పకుండా తీసుకెళ్లాల్సిన టాయిలెటరీస్ ఏంటో తెలుసా?
6.కాంబో డీల్స్ ట్రై చేయండి
పీక్ సీజన్లో భోజనం కూడా కాస్ట్లీగానే దొరుకుతుంది. అందుకే కాంబో సెలెక్ట్ చేసుకుని కంప్లీట్ ప్యాకేజీ బుక్ చేసుకోవచ్చు.
- ఈ కాంబోలో మీకు రూమ్, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్ లభిస్తుంది.
- దీని వల్ల 15 నుంచి 25 శాతం వరకు సేవ్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
- ఇది కూడా చదవండి: Travel Tips 01 : ప్రయాణాల్లో తక్కువ బరువు – ఎక్కువ ఆనందం కోసం 5 చిట్కాలు
7.స్మార్ట్ ఫిల్టర్స్ వాడండి
ఒక హోటల్‌ను ఎంచుకునే సమయంలో మీరు ఫిల్టరింగ్ చేయడం కూడా ఒక కళలాంటిది. ఇలా చేయండి.
- రేటింగ్ విషయంలో 7.8 కన్నా ఎక్కువ ఉండేలా చూసుకోండి
- హాట్ స్పాట్ లేదా కమర్షియల్ ఏరియాకు 2 నుంచి 6 కిమీ దూరంలో ఉండేలా చూడండి.
- ఫిల్టర్‌లో Only 2 Rooms Left ఆన్ చేసుకోండి.
- ప్రైస్‌ను : Low to Hight+Rating లా సార్ట్ చేసుకోండి.
ఇలా చేస్తే వచ్చిన బెస్ట్ వాల్యూ హోటల్లో ఏదో ఒకటి మీకు సరైనది అనిపిస్తే బుక్ చేసుకోండి.
- ఇది కూడా చదవండి : ఏంటి జపాన్ మరీ ఇంత శుభ్రంగా ఉంటుందా ? | తెల్ల సాక్సులతో నడిచిన వ్లాగర్
Follow me Prayanikudu On Instagram
8 |. 2 నెలల ముందు బుక్ చేసుకోండి
మీరు చేస్తున్నది ప్లాన్డ్ ట్రిప్ అయితే కనీసం 2 నెలల ముందే బుక్ చేసుకోండి. తరువాత రెగ్యులర్‌గా చెక్ చేసుకోండి. ఎందుకంటే యాప్స్ అనేవి 7 నుంచి 10 రోజు ప్రైస్ సైకిల్‌ను ఫాలో చేస్తాయి.

మీరు వెళ్లాల్సిన తేదీ దగ్గర పడుతున్న సమయంలో ఒక వేళ మీరు బుక్ చేసుకున్న ధరకన్నా తక్కువ ధరకు రూమ్స్ అందుబాటులోకి వస్తే, అప్పుడు ఫ్రీ కేన్సిలేషన్ ఉంటే వెంటనే కేన్సిల్ చేసి తక్కువ ధరకు బుక్ చేసుకోండి.
- ఇలా చేయడం వల్ల మీకు రూమ్ ఎలాగో కన్ఫర్మ్ అవుతుంది.
- దాంతో పాాటు 10 నుంచి 22 శాతం వరకు సేవ్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండిTravel Smarter : 2025 లో ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్
9. వెళ్లినప్పుడే పే చేయండి
ముందుగా బుక్ చేసినప్పుడు, కొంత కాలం తరువాత ఒకవేళ ధరలు పెరిగినా మీరు బుక్ చేసుకున్న ధరకే మీ రూమ్ మీకు లభిస్తుంది. కావాంటే మీరు చెకిన్ చేసినప్పుడే డైరక్టుగా హోటల్లో పే చేయండి. ఇందులో ఒక్క పైసా రిస్కు ఉండదు.
- అయితే మీరు బుక్ చేసే హోటల్ జీరో బుకింగ్ చార్జీలో అందుబాటులో ఉందో లేదో ముందే చెక్ చేయండి.
- కొన్ని హోటల్స్‌లో ముందుగానే డబ్బులు చెల్సించాల్సి ఉంటుంది.
- ఈ విషయంలో క్లారిటీ తెచ్చుకుని బుక్ చేయండి.
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
10. యూపీఐ ఆఫర్స్, యాప్ డీల్స్ | UPI Offers, App Deals
మేక్ మై ట్రిప్ (Make My Trip) , Agoda, Goibibo లపై యూపీఐ యాప్‌లో రకరకాల ఆఫర్లు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి. మీకు సెట్ అయ్యే ఏదైనా ఆఫర్ ఉంటే దాని వల్ల కూడా మీరు రూ.600 నుంచి 1500 వరకు సేవ్ చేసుకోవచ్చు.
- దీంతో పాటు ఇలాంటి బుకింగ్ ప్లాట్‌ఫామ్స్ అందించే సూపర్ కాయిన్స్ (super coins) కూడా మీరు ఉపయోగించుకోవచ్చు.
- ఇలా చేస్తే మొత్తానికి మీరు 10 నుంచి 18 శాతం వరకు సేవ్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : Eateries In Goa : గోవాలో తప్పకుండా ట్రై చేయాల్సిన 10 రెస్టారెంట్స్ ఇవే
11.సాయత్రం 6 నుంచి రాత్రి 10 వరకు…
సాయంత్రం 6 నుంచి రాత్రి 10 గంటల మధ్యలో హోటల్ బుకింగ్ చేసేందుకు చాలా మంది ట్రై చేస్తారు. ఎందుకంటే ఈ సమయంలో చాలా మంది తమ ఆఫిస్, బిజినెస్ పనులు పూర్తి చేసుకుని ఇతర పనులు పూర్తి చేస్తుంటారు.
- ఈ సమయంలో బుకింగ్స్ కోసం చాలా మంది ట్రై చేయడంతో ధరలు అమాంతం పెరిగిపోతాయి.
- అందుకే మీరు మధ్యాహ్నం లేదా సాయంత్రం 5.30ని లకు ముందే బుకింగ్ కోసం ట్రై చేయండి.
- ఈ సమయంలో మీకు మంచి డీల్స్ కూడా లభించే అవకాశం ఉంది.
- Read Also : Thailand : భారతీయులను అయస్కాంతంలా లాగేస్తున్న థాయ్‌లాండ్ | 11 కారణాలు ఇవే !
12. నియర్ మీ సెర్చ్ | Nearby Me Search
మీరు ఎక్కడ ఉన్నా కానీ google maps యాప్‌లోకి వెళ్లి Hotels Near Me అని సెర్చ్ చేయండి. ఎందుకంటే పీక్ సీజన్లో మెయిన్ ఏరియాలో అన్ని హటల్స్ ఫుల్ అవుతాయి. అందుకే Nearby Towns, Suburbs అని కూడా సెర్చ్ చేయండి.
- దీని వల్ల మీకు ఎక్కువ ఆప్షన్స్ లభిస్తాయి.
- అది కూడా తక్కువ ధరకే
- మంచి సర్వీస్ కూడా లభిస్తుంది.
- ఇది కూడా చదవండి : 12 నెలల్లో 12 ఆసియా దేశాలు చుట్టేయండి…
ప్రయాణికుడు ట్రావెల్ టిప్స్ | Prayanikudu Travel Tips
ఇక్కడ ప్రస్తావించిన 3,5,8 నెంబర్ టిప్స్ పాటించి దగ్గర్లోని హోటల్స్‌కు రెండు నెలల ముందే ఫోన్ చేసి బుకింగ్ ప్రయత్నించండి. వచ్చాక డబ్బులు ఇస్తాం అని చెప్పి చూడండి. సరే అంటే వెళ్లినాకే ఇవ్వండి.
- తరువాత మళ్లీ టైమ్ దొరికనప్పుడల్లా రేట్లు చెక్ చేయండి.
- ఎక్కడైనా తక్కువకు దొరికితే ఇది బుక్ చేసుకుని అది (ఫస్ట్ బుక్ చేసుకున్నది) కేన్సిల్ చేసుకోండి.
- ఇలా చేస్తే మీరు 10 నుంచి 35 శాతం వరకు డబ్బులు సేవ్ చేసుకోవచ్చు.
పీక్ సీజన్లో హోటల్ బుక్ చేసుకుని ప్రశాంతంగా మీ ట్రిప్‌ను పూర్తి చేసేందుకు ఈ చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయి అని ఆశిస్తున్నాను. చిన్న ప్లానింగ్+స్మార్ట్ టైమింగ్= పెద్ద సేవింగ్.
ఇలాంటి మరిన్ని చిట్కాల కోసం prayanikudu.com ను రెగ్యులర్‌గా విజిట్ చేయండి.
థ్యాంక్యూ
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
