యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లాలి అనుకుంటున్న భారతీయులకు శుభవార్త. వీసా ఆన్ అరైవల్ (UAE Visa On Arrival) పథకాన్ని కొనసాగింపుగా సింగాపూర్, జపాన్ వంటి ఆరు దేశాల వ్యాలిడ్ వీసా ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా అందించనుంది యూఏఈ. దీని వల్ల పర్యాటకంతో పాటు ఆర్థికంగా లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.
ముఖ్యాంశాలు
ఎమిరాతీ లక్ష్యం ఇదే
భారతీయులు ఎక్కువగా వెళ్లే పాపులర్ డెస్టినేషన్‌లో యూఏఈ (United Arab Emirates) కూడా ఒకటి. ఇకపై యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వెళ్లడం మరింత సులువు కానుంది. 2025 ఫిబ్రవరి 13వ తేదీ నుంచి కొత్తగా ప్రకటించిన దేశాల వీసా లేదా గ్రీన్ కార్డులు (Green Card) ఉన్న భారతీయులకు ఆన్ అరైవల్ వీసా లభించనుంది. ఈ కొత్త విధానం వల్ల పర్యాటకులతో పాటు నైపుణ్యం కలిగిన నిపుణుల సంఖ్య పెరుగుతుంది. ఇలా చేయడం వల్ల గ్లోబల్ హబ్ అవ్వాలని ఆశిస్తోంది యూఏఈ.
అర్హత కలిగిన దేశాలు : Eligible Countries for UAE Visa on Arrival
భారతీయులకు వారి వీసా లేదా గ్రీన్ కార్డు అర్హత ఆధారంగా వీసా ఆన్ అరైవల్ సదుపాయం కల్పించనుంది యూఏఈ. ఇందులో కొత్తగా చేర్చిన దేశాలు ఇవే. ఈ దేశాల వీసా లేదా గ్రీన్ కార్డు కలిగి ఉండాలి ..
గతంలో అమెరికా (USA), యూరోపియన్ యూనియన్ (EU ), యునైటెడ్ కింగ్డమ్ వీసా ఉన్న భారతీయులకు మాత్రమే యూఏఈలో ఆన్ అరైవల్ వీసా లభించేది. ఈ జాబితాలో మరో 6 దేశాలు చేరాయి.
దేశాల సంఖ్యను ఎందుకు పెంచింది ?

- వివిధ దేశాల నుంచి భారతీయులు యూఏఈలోని వివిధ నగరాలను పర్యాటించాలని
- వారి ఆర్థిక రంగంలో పెట్టుబడి పెట్టాలని
- వివిధ వర్గాల ప్రజలకు ఆలవాలంగా మారే తమ దేశ ఆశయాన్న సాకారం చేసుకోవాలని భావిస్తోంది యూఏఈ.
పర్యాటకం -వ్యాపారం | Economy and Entrepreneurship
ఈ కొత్త వీసా (UAE New Visa Policy) పాలసీ వల్ల వీసా ప్రాసెస్ సులభతరం అవుతుంది. మరింత ఎక్కువ మందికి ఇది ఉపయోగపడుతుంది. దీని వల్ల ఎక్కువ సంఖ్యలో పర్యాటకులు యూఏఈని సందర్శించే అవకాశం ఉంటుంది.
వీసా ఆన్ అరైవల్ విధానం వల్ల అంతర్జాతీయంగా వివిధ దేశాల నుంచి మరింత మంది పర్యాటకులు (Travelers), వ్యాపారులు తమ దేశానికి రావాలని ఆశిస్తోంది యూఏఈ. దీని వల్ల ఆదాయం పెరగడంతో పాటు పెట్టుబడులు పెరిగి ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని, దేశ ఆర్థిక వ్యవస్థకు లాభం చేకూరుతుంది అని ఆశిస్తోంది.
వ్యాలిడిటీ, పీజు | Visa On Arrival Validity and Fee
యూఏఈ వీసా ఆన్ అరైవల్ కోసం భారతీయుల పాస్‌పోర్ట్, వీసా, రెసిడెన్స్ పర్మిట్ (Residence Permit) లేదా గ్రీన్ కార్డు అనేవి కనీసం 6 నెలల వాలిడిటీ అనేది మిగిలి ఉండాలి. ఇక ఫీజు విషయానికి వస్తే :
- 14 రోజుల ఎంట్రీ వీసా : 100 దిర్హామ్స్
- 14 రోజుల ఎక్స్‌టెన్షన్ : 250 దిర్హామ్స్
- 60 రోజుల వీసా : 250 దిర్హామ్స్ః
యూఏఈ వీసా ఆన్ అరైవల్ ఎలా అప్లై చేయాలి ?
How to Apply for a UAE Visa on Arrival : భారతీయ ప్రయాణికులు అక్కడికి వెళ్లి వీసా తీసుకునే అవకాశం అందిస్తుంది యూఏఈ (పై దేశాల నుంచి వీసా లేదా గ్రీన్ కార్డు ఉంటేనే) . అయితే మీరు ఆన్‌లైన్లో కూడా వీసా కోసం అప్లై చేయవచ్చు.
దుబాయ్ వెబ్‌సైట్ ( Dubai వెళ్లేవారికి)
- ఐసీపీ వెబ్‌సైట్
- ట్రావెల్ ఏజెన్సీలు
ఎమిరేట్స్ ప్రయాణికుల (Emirates Passengers) కోసం ఎయిర్‌లైన్ వెబ్‌సైట్ కూడా ఆన్‌లైన్ అప్లికేషన్ ఆప్షన్ అందిస్తోంది. వారి వెబ్‌సైట్‌లో “మేనేజ్ యువర్ బుకింగ్” సెక్షన్‌లో చెక్ చేయగలరు.
కావాల్సిన డాక్యుమెంట్స్ | Documents Required For UAE Visa On Arrival
ఆన్‌లైన్లో అప్లై చేయాలనుకున్నా…లేదా వీసా ఆన్ అరైవల్ తీసుకోవాలనుకున్నా భారతీయులు తప్పనిసరిగా ఈ డాక్యుమెంట్స్ తమ వద్ద ఉండేలా చూసుకోవాలి .
- కనీసం ఆరునెలల వ్యాలిడిటీ కలిగిన భారతీయ పాస్‌పోర్టు ( ఇందులో బయోడాటా, అడ్రెస్ పేజీలు ఉండాలి).
- తెల్లని బ్యాగ్రౌండ్ ఉన్న లేటెస్ట్ పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోలు
- వాలిడ్ వీసా (Valid Visa), రెసిడెన్స్ పర్మిట్ లేదా గ్రీన్ కార్డు కాపీలు. అవి కూడా అమెరికా, యూకే, ఐరోపా సమాఖ్య (European Union), సింగాపూర్, జపాన్, సౌత్ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా కెనడా దేశాలవి అయి ఉండాలి.
కీలకమైన నిర్ణయం
ఈ వీసా ఆన్ అరైవల్ విధానం వల్ల భారత్-యూఏఈ (India- United Arab Emirates) మధ్య బంధం మరింత పటిష్టంగా మారుతుంది. దీని వల్ల మరింత మంది భారతీయులకు యూఏఈ వెళ్లే అవకాశం లభిస్తుంది. ఇక ట్రావెలర్స్‌కు అయితే యూఏఈలో మరిన్ని అందమైన ప్రదేశాలను సందర్శించే గోల్డెన్ ఛాన్స్ కూడా లభించింది అని చెప్పవచ్చు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.