తెలంగాణలో 7 ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi 2025 in Telangana
Vaikunta Ekadasi 2025 in Telangana గైడ్. తెలంగాణలోని 7 ప్రముఖ వైష్ణవ ధామాలైన ధర్మపురి, భద్రాచలం, యాదాద్రి వంటి ఆయాలు గైడ్, టిప్స్ మీ కోసం
Vaikunta Ekadasi 2025 in Telangana వైైకుంఠ ఏకాదశి దోజు తెలంగాణలో భక్తులు వెళ్లగలిగిన 7 ప్రముఖ ఆలయాలు, దూరం, ప్రత్యేకతలు , ట్రావెల్ టిప్స్ మీ కోసం.
Vaikunta Ekadasi 2025 in Telangana : వైకుంఠ ఏకాదశి అంటే వైష్ణవ భక్తులకు ఒక ఆధ్యాత్మిక వేడుకలాంటిది. ఈ రోజు వైకుంఠ ద్వారం తెరుచుకుని విష్ణు భగవానుడి కరుణ డైరెక్ట్‌గా లభిస్తుంది అని భక్తుల నమ్మకం. తెలంగాణలో శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన ఆలయాలు చాలా ఉన్నాయి. అందులో 7 ప్రముఖ ఆలయాల టైమింగ్, దూరం, దర్శనం టిప్స్ ఇవన్నీ మీ కోసం ఈ పోస్టులో…
- వైకుంఠ ఏకాదశి (Vaikunta Ekadasi 2025): డిసెంబర్ 30, 2025
ఈ రోజున తెలంగాణలోని శ్రీ మహా విష్ణువు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, వైకుంఠ ద్వార దర్శనాలు నిర్వహించబడతాయి. - వైకుంఠ ద్వాదశి (Vaikunta Dwadasi): డిసెంబర్ 31, 2025
- ఇది కూడా చదవండి : వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోదగ్గ హైదరాబాద్‌లోని 9 ఆలయాలు | Vaikunta Ekadasi 2025 Hyderabad
డిసెంబర్ చివరి రోజుల నుంచి జనవరి తొలి వారం వరకు తెలంగాణలోని ప్రముఖ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి.
ముఖ్యాంశాలు
1. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం – యాదగిరిగుట్ట

Sri Lakshmi Narasimha Swamy Temple – Yadagirigutta
📍 Hyderabad → Yadagirigutta Distance: ~65 km
తెలంగాణలో వైకుంఠ ఏకాదశి అంటే ముందుగా గుర్తుకు వచ్చేది యాదాద్రి. నరసింహ అవతారంలో స్వయంభు రూపంలో స్వామి దర్శనం ఇక్కడ లభిస్తుంది. ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం కోసం భక్తులు ఉదయం నుంచే క్యూలైన్లో వేచి ఉంటారు. రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రాత్రి కూడా అక్కడే స్టే చేసేలా ప్లాన్ చేసుకోవడం మంచిది.
Travel Tip:
👉 ఏకాదశి రోజు ఉదయం 3–4 గంటల లోపల ఆలయానికి చేరుకుంటే దర్శనం స్మూత్‌గా అవుతుంది. స్టేను ముందుగానే ఆన్లైన్లో బుక్ చేసుకోండి.
- ఇది కూడా చదవండి : పండరిపురం ఆలయ దర్శనం కంప్లీట్ గైడ్
2. శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం – ధర్మపురి
Sri Lakshmi Narasimha Swamy Temple – Dharmapuri, Jagtial
📍 Hyderabad → Dharmapuri Distance: ~210–230 km
గోదావరి తీరంలో ఉన్న ఈ క్షేత్రం తెలంగాణలో చాలా పవర్ఫుల్ క్షేత్రాలలో ఒకటి. వైకుంఠ ఏకాదశి రోజు గోదావరి స్నానం + నరసింహ స్వామి దర్శనం అత్యంత పవిత్రమైన కాంబినేషన్. ధర్మపురిని కొంతమంది భక్తులు “దక్షిణ అయోధ్య” అని కూడా పిలుస్తారు.
Travel Tip:
👉 గోదావరి స్నానం ప్లాన్ చేస్తే ఎక్స్ట్రా బట్టలు, టవల్ తీసుకెళ్లండి. ఉదయం రష్ ఎక్కువగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : తెలంగాణలోని ఈ ఆలయానికి వెళ్తే అరుణాచలం వెళ్లినట్టే…| Chinna Arunachalam
3. శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం – వేములవాడ

Sri Raja Rajeshwara Swamy Temple – Vemulawada (Vishnu Aspect)
📍 Hyderabad → Vemulawada Distance: ~140–160 km
వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర ఆలయం శైవ క్షేత్రం అని తెలిసిందే. అయితే ఇక్కడ శివ–విష్ణు తత్త్వాల హరిహర ఐక్యత భావన బలంగా కనిపిస్తుంది. విష్ణువును నేరుగా దర్శించలేని చోట, శివుని ద్వారా హరిని దర్శించవచ్చని భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశి రోజు ఈ భావన మరింత ప్రత్యేకంగా అనిపిస్తుంది. భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ప్రాపర్‌గా ప్లాన్ చేసుకోండి.
Travel Tip:
👉 టోకెన్లు ఉన్నవారికి దర్శనం త్వరగా అవుతుంది.
👉 పార్కింగ్ తక్కువగా ఉంటుంది, అందుకే ఎర్లీగా చేరుకోండి.
👉 ప్రస్తుతం ఆలయంలో కొన్ని చోట్ల రినోవేషన్ పనులు జరుగుతున్నాయి.
- ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
4. శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి – చిలుకూరు
Sri Lakshmi Venkateswara Swamy Temple – Chilkur (Visa Balaji)
📍 Hyderabad → Chilkur Distance: ~23–30 km

ఇక్కడ హుండీ లేదు. వీఐపీ దర్శనం లేదు. అందరూ సమానమే అనే భావనతో ఆధ్యాత్మికతను నేర్పే ఆలయం ఇది. వైకుంఠ ఏకాదశి రోజు ప్రదక్షిణలు చేసే భక్తుల సంఖ్య భారీగా ఉంటుంది. అందుకే ఉదయాన్నే వెళ్లడం ఉత్తమం.
Travel Tip:
👉 ప్రదక్షిణలు చేసే సమయంలో ఆలయ పురోహితుల సూచనలు పాటించండి.
👉 లోపల అవకాశం లేకపోతే ఆలయ పరిసరాల్లో కూడా ప్రదక్షిణలు చేయవచ్చు.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
5. శ్రీ సీతారామ చంద్ర స్వామి ఆలయం – భద్రాచలం
Sri Sitaramachandra Swamy Temple – Bhadrachalam
📍 Hyderabad → Bhadrachalam Distance: ~292–310 km

శ్రీరాముడు కూడా శ్రీ మహావిష్ణువు అవతారమే కాబట్టి భద్రాచలంలో వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు, పారాయణాలు జరుగుతాయి. గోదావరి తీరంలో రామాలయం దర్శనం ఉదయం, సాయంత్రం చాలా ప్రత్యేక అనుభూతిని ఇస్తుంది.
Travel Tip:
👉 ఓవర్‌నైట్ ట్రైన్ లేదా బస్సు బెస్ట్ ఆప్షన్. ఏకాదశి రోజున ఫుల్ డే డెడికేట్ చేయండి.
6. శ్రీ దశావతార వేంకటేశ్వర స్వామి ఆలయం – వికారాబాద్
Sri Dashavatara Venkateswara Swamy Temple – Vikarabad
📍 Hyderabad → Vikarabad Distance: ~75–78 km
అనంతగిరి హిల్స్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయంలో శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన 10 అవతారాలు దర్శనమిస్తాయి. తిరుపతి లేదా చిలుకూరు లాంటి భారీ రద్దీ ఉండదు. ఒక్కరోజులో సులభంగా వెళ్లి రావచ్చు.
Safe Travel Tip:
👉 ఉదయం పూట దర్శనం ప్రశాంతంగా అవుతుంది. అడవి ప్రాంతం కాబట్టి సాయంత్రం కాకముందే తిరుగు ప్రయాణం మంచిది.
7. శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం – ఆలంపూర్
Sri Lakshmi Narayana Swamy Temple – Alampur
📍 Hyderabad → Alampur Distance: ~220 km
నవబ్రహ్మ ఆలయాల ఏరియాలో ఉన్న ఈ విష్ణు ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు క్రౌడ్ తక్కువ, ఆధ్యాత్మిక భావన ఎక్కువగా ఉంటుంది. ప్రశాంతమైన దర్శనం కోరుకునేవారికి మంచి ఛాయిస్.
Travel Tip:
👉 ఉదయమే దర్శనం ప్లాన్ చేయండి. దాదాపు క్రౌడ్ ఉండదు. కావాలంటే Jogulamba Darshanam కూడా ప్లాన్ చేసుకోవచ్చు.
ముఖ్యమైన సూచన | Vaikunta Ekadasi 2025 in Telangana
పైన ప్రస్తావించిన ఆలయాలను ఒక్కరోజులోనే తప్పనిసరిగా విజిట్ చేయాల్సిన అవసరం లేదు. మీకు దగ్గరలో ఉన్న లేదా మీరు వెళ్లాలనుకున్న ఏ ఒక్క ఆలయానికైనా వెళ్లడం చాలు. ప్రతి ఆలయం చుట్టుపక్కల సాధారణంగా మరికొన్ని చిన్న ఆలయాలు ఉంటాయి. వీలైతే వాటిని కూడా దర్శించుకోవచ్చు.
ఒక్కరోజు ప్రయాణమే అనుకుంటే సాయంత్రం కాకముందే హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం మొదలుపెట్టడం మంచిది. మధ్యాహ్నం లోపలే బయల్దేరితే ప్రయాణం సౌకర్యంగా ఉంటుంది.
ఎలాగైతేనేంటి…
కొందరు మ్యాప్‌లో దూరాలు చూస్తారు,
కొందరు మనసులో భక్తిని చూస్తారు.
తక్కువ సమయంలో ఎక్కువ ఆలయాలు కవర్ చేయడం తీర్థయాత్ర లక్ష్యం కాదు.
తీర్థయాత్ర లక్ష్యం ఏమిటంటే —
ఆగి ఆలోచించడం,
ఆధ్యాత్మిక వైబ్‌ను మనసులో ఫీల్ అవ్వడం.
మీకు దూరంగా ఉన్న ఆలయాలకు వెళ్లే అవకాశం లేకపోతే, మీకు దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్లి గంటసేపు ప్రశాంతంగా గడపడం కూడా చాలిపోతుంది.ఎందుకంటే —
“ఇందుగలడు అందులేడని సందేహము వలదు
ఎందెందు వెతికినా అందందు గలడు… శ్రీ హరుడు.”
మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
