Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎప్పుడు వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి ?

  • దేవకన్యలు ఆటలాడే స్థలం
  • పాండవులు వనవాసంలో నడిచిన మార్గం
  • ఆంజనేయుడు సంజీవని కోసం వెతికిన లోయ
  • 1931 వరకు ప్రపంచానికి తెలియని పూవులు వనం
  • వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు స్వాగతం

భారత దేశం సాంస్కృతికంగానే కాదు భౌగోళికంగా కూడా వైవిధ్యమైనది. అందులోనూ హిమాలయాల అందం గురించి వర్ణించడానికి సాహిత్యం మాత్రమే సరిపోదు సాహసం కూడా కావాలి. ఇలాంటి ఒక సాహాస యాత్రకు ఈ రోజు మిమ్మల్ని తీసుకెళ్లనున్నాను.

ఈ స్టోరీలో 1931 వరకు ప్రపంచానికి తెలియని ఒక అందమైన అద్భుతమైన లోయ. వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ (Valley Of Flowers ) గురించి పూర్తి సమాచారాన్ని మీతో షేర్ చేసుకోనున్నాను.

Pra

4 నెలలు మాత్రమే తెరచి ఉంటుంది

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఉత్తరాఖండ్‌‌లోని ఛమోలీ జిల్లాలో ఉంది. ఈ అందమైన లోయ విస్తీర్ణం 87.5 చదరపు కిమీ. ఇక్కడ సుమారు 650 రకాలు పువ్వులను గుర్తించారు. మీ లక్ బాగుంటే ఇక్కడ పవిత్రమైన బ్రహ్మకమలాన్ని కూడా చూడవచ్చు.

అయితే ఈ వ్యాలీ కేవలం 4 నెలలు మాత్రమే తెరచి ఉంటుంది. మిగితా సమయం మొత్తం మంచుతో కప్పి ఉంటుంది .

ఇక్కడ తొలకరి నుంచి పువ్వులు వికసించడం మొదలవుతుంది. ఆగస్ట్ నెలలో వ్యాలీ మొత్తం స్వర్గంలా కనిపిస్తుంది. 

పువ్వులు ఉన్న సమయంలో ఇది స్వర్గంలా ఉంటుంది
పువ్వులు ఉన్న సమయంలో ఈ లోయ స్వర్గంలా ఉంటుంది

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎలా చేరుకోవాలి ?  | How To Reach Valley Of Flowers ?

How To Reach Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు వచ్చే ముందు ఇక్కడ చుట్టుపక్కన ఉన్న ఇతర పర్యాటక స్థలాలపై మీరు ఒక రీసెర్చ్ చేయండి. అప్పుడు మీరు పర్ఫెక్ట్‌గా ప్లాన్ చేయవచ్చు. మీరు డైరక్టుగా ఈ వ్యాలికి వస్తున్నారని భావించి ఈ విషయాలు షేర్ చేస్తున్నాను.

విమానంలో | Valley Of Flowers By Air

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు సమీపంలో ఉన్న ఎయిర్ పోర్ట్ పేరు జాలీ గ్రాంట్ ( Jolly Grant Airport) ఇది డెహ్రాడూన్‌లో ఉంది. మీరు డెహ్రాడూన్ చేరుకుని అక్కడి నుంచి కారో లేదా బస్సులోనో రిషికేష్ చేరుకోవచ్చు.

అక్కడి నుంచి మీరు మీ ట్రెక్ టీమ్‌ మెంబర్స్‌ని మీట్ అవ్వవచ్చు. సోలోగా అయితే మీరు బద్రినాథ్ వెళ్లే బస్సులు ఎక్కి అక్కడి నుంచి గోవింద్ ఘాట్ చేరుకోవాలి. అక్కడి నుంచి ఘాంగరియా- తరువాత వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అన్నమాట.

ట్రైన్ మార్గంలో | Valley Of Flowers By Train

వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌కు ట్రైన్‌లో చేరుకోవాలి అనుకుంటే మీరు రిషికేష్ లేదా హరిద్వార్ స్టేషన్‌‌కు టికెట్ బుక్ చేసుకోవచ్చు. హరిద్వార్ నుంచి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ 290 కిమీ దూరంలో ఉంటుంది. 

రోడ్డు మార్గంలో | Valley Of Flower By Road

మీరు రోడ్డు మార్గంలో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కి చేరుకోవాలి అనుకుంటే మీకు డిల్లీ నుంచి హరిద్వార్, రిషికేష్ నుంచి బస్సులు, ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి.

మనం ఎలా వస్తామో వ్యాలీ ఆఫ్‌ ఫ్లవర్స్‌ అంత పట్టించుకోదు… కానీ వస్తే మాత్రం మిమ్మల్ని అందమైన పూవులతో స్వాగతం పలుకుతుంది. 

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎప్పుడు వెళ్లాలి ?

Best Time To Visit Valley Of Flowers : వ్యాలీ ఆఫ్ ప్లవర్స్ ఎత్తైన హిమాలయా మంచు పర్వతాల మధ్య ఉంటుంది. జూన్ నుంచి అక్టోబర్ మధ్యలో పువ్వుల లోయను చూడటానికి వెళ్లవచ్చు.

అయితే జూలై నుంచి ఆగస్ట్ 15 లోపు వెళ్తే మీరు పూవులతో నిండిన పర్ఫెక్ట్ వ్యాలీని చూడవచ్చు. నేను సెప్టెంబర్ లాస్ట్ వీక్‌లో వెళ్లాను. అందుకే వ్యాలీ కనిపించింది కానీ పువ్వులు కనిపించలేదు.

Also Read | Manali : ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి? 

పొరపాటున కనుక్కున్నారు…

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ గురించి బయటి ప్రపంచానికి చాలా కాలం తెలియదు. ఇలాంటి ఒక ప్లేస్ ఉంటుంది అని 1931 వరకు ఎవరూ ఊహించలేదు.

కానీ ఇదే సంవత్సరం బ్రిటిష్ పర్వతారోహకులు అయిన ఫ్రాంక్ ఎస్ స్మైత్, ఎరిక్ షిప్టోన్, ఆర్ ఎల్ హోల్డ్‌వర్త్ ఈ వ్యాలీని పొరపాటున ఈ లోయను కనుక్కున్నారు. మౌంట్ కామెట్‌ను అధిరోహంచిన తరువాత వెనక్కి తిరిగి వస్తున్నసమయంలో ఈ వ్యాలిని చూశారట.

ఫస్ట్ లుక్‌లోనే ప్రేమలో పడిపోయి ఆ పువ్వుల మధ్య ప్రపంచాన్ని మరిచి తిరిగారట. తరువాత ఫ్రాంక్ ఎస్ స్మైత్ ( Valley Of Flowers Book by Frank S Smythe ) ఒక బుక్ రాశారు. 

ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో “The Valley of Flowers: An Adventure in the Upper Himalaya"  అనే పేరుతో అందుబాటులో ఉంది.
ఈ పుస్తకం ఆన్‌లైన్‌లో “The Valley of Flowers: An Adventure in the Upper Himalaya”  అనే పేరుతో అందుబాటులో ఉంది.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ టైమ్‌లైన్ | Valley Of Flowers Timeline

1931 : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ కనుక్కున్న బ్రిటిష్ పర్వతారోహకులు

1980  : వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ను నేషనల్ పార్క్‌గా గుర్తించారు

2005  : ఈ వ్యాలీని యూనెస్కో ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించారు

పుష్ఫవతి నది కథ | గంగా నది వరకు…

Story of Pushpavati River In Valley Of Flowers : రతన్‌బాన్ అనే ప్రాంతంలోని తిప్రా గ్లేషియర్ నుంచి పుష్పవతి నది మొదలవుతుంది. తరువాత ఇది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌ను కవర్ చేస్తూ బ్యూండర్ వాలీలో బ్యూండర్ గంగాలో కలుస్తుంది.

ఈ రెండు నదులు  సంగమాన్ని లక్ష్మన్ గంగా అని పిలుస్తారు. లక్ష్మన్ గంగా నది గోవింద్ ఘాట్ వద్ద అలక్ నందా నదిలోకి చేరుతుంది.

తరువాత అలకానంద నది దేవ్ ప్రయాగ్ వద్ద భగీరథ నదితో కలిసి గంగా నదిని ఏర్పాటు చేస్తుంది.

పాండవులు వనవాసం చేస్తున్న సమయంలో ఇక్కడ నదిలో పూవులను చూశారట. వ్యాలీ ఆఫ్ ఫవర్ నుంచి వస్తుంది కాబట్టి నదిలో నీళ్లు కనిపించింది ఉండవచ్చ. దీంతో పాండవులు ఈ నదికి పుష్పవతి అనే పేరు పెట్టారట.

దేవకన్యల ఆట స్థలం

Pra
దేవ కన్యలు ఇక్కడికి వచ్చి సరదాగా ఎంజాయ్ చేస్తుంటారని లోకల్స్ చెబుతారు

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎంత అందంగా ఉంటుంది అంటే ఇక్కడికి దేవ కన్యలు వచ్చి ఆటలు ఆడుతుంటారు అని చెబుతుంటారు.

ప్రపంచంలోనే ఎక్కడా లేని కనిపించని రకాల పూవులు మనకు వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో కనిపిస్తాయి. ఇక్కడ సుమారు 650 రకాల పూవులు ఉన్నాయట.

కానీ ఇక్కడ దొరికే పూవుల్లో కొన్ని రకాలు అయితే ప్రపంచంలో మరెక్కడా  కనిపించవట. అందుకే భారత ప్రభుత్వం ఈ వ్యాలీని జాతీయ సంపదగా పరిరక్షిస్తోంది. దీంతో వ్యాలీ ఆఫ్వ ఫ్లవర్స్‌కి యునెస్కో గుర్తింపు కూడా లభించింది.

Also Read : Thailand 2024 : థాయ్‌లాండ్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ?

650 రకాల పుష్పాలు

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో ఇప్పటి వరకు 650 రకాల పూవుల జాతులను శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇందులో బ్రహ్మకమలాలు, బ్లూపాపీలు, నాగుమల్లెలు, డైసీ, అనిమోస్, అనాపలీస్, స్నేక్ లిల్లీ, వైల్డ్ రోజ్,  మోక్ష్‌హుడ్ లాంటి ఎన్నో వందల రకాల పుష్పాలు ఇక్కడ కనిపిస్తాయి.

అంతేనే ఇక్కడ సుమారు 50 రకాల వనమూలికలను కూడా గుర్తించారు.

వన్య మృగాలు

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌‌కు సమీపంలో ఉన్న ఆటవిక ప్రాంతంలో ఎన్నో రకాల వన్య మృగాలు సంచరిస్తుంటాయి.

అందులో ఎలుగు బంట్లు ( Himalayan Black Bear ) , స్నో లెపర్డ్, నక్కలు ( Red Fox ) , మస్క్ డీర్,  ప్రాణాలకు లెక్కచేయకుండా రిస్కు చేసే హిమాలయన్ తార్ ( Himalayan Tahr ) అనే ఒక రకమైన మేకలు ఇలా ఎన్నో రకాల వన్యప్రాణులకు ఈ లోయ అవాసం ఇస్తుంది.

అయితే ట్రెక్కింగ్ సమయంలో మనుషులకు భయపడి ఇవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ వైపు అస్సలు రావు అని సెక్యూరిటీ అధికారులు తెలిపారు. మీ లక్కు బాగుంటే మీరు స్నో లెపర్డ్ కూడా చూడొచ్చు. వాటి లక్కు బాగుంటే అది కూడా మిమ్మల్ని చూడొచ్చు. 

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌లో స్టే చేయొచ్చా ? | Can We Stay At Valley Flowers?

సింపుల్‌గా చెప్పేస్తాను. నో ! వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఒక టూరిస్ట్ స్పాట్ అయినా..ఇక్కడి జీవ వైవిధ్యాన్ని కాపాడేందుకు, క్షణాల్లో మారే వాతావరణం ఉన్న ఈ ప్రాంతంలో పర్యటకులకు ఊహించని ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటం..ఇలా చాలా కారణాల వల్ల ఇక్కడ స్టే చేసే అవకాశాన్ని అధికారులు కల్పించలేదు. 

Pra
చూసి వెళ్లిపో అనే కాన్సెప్ట్‌తో రండి..ఎందుకంటే ఇక్కడ మధ్యాహ్నం తరువాత ఎవరూ ఉండరు.

ఇక్కడ మీకు స్నాక్స్ కూడా దొరకవు. అందుకే మీరు మార్నింగ్ ఎంత తొందరగా అయితే అంత తొందరగా ఘాంగరియా నుంచి ట్రెక్ ప్రారంభించి మధ్యాహ్నం 1 కల్లా వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నుంచి స్టార్ట్ అయ్యేలా ప్లాన్ చేసుకోండి.

మీతో పాటు లంచ్ కోసం ఆహారం క్యారీ చేయడం మర్చిపోకండి. నీటి విషయానికి వస్తే ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే సరిపోతుంది. మధ్యలో మీకు చిన్న చిన్న నీటి ధారలు కనిపిస్తాయి అక్కడ మీరు నీటిని రీఫిల్ చేసుకోవచ్చు.

ఎక్కడ ఉండాలి ? | Hotels Near Valley Of Flowers

 ఒక వేళ మీరు స్టే ప్లాన్ చేస్తే మాత్రం చమోలీ జిల్లాలోని ఘాంగరియా లేదా గోవింద్ ఘాట్, జ్యోషిమఠ్‌లో ఎక్కడైనా హోటల్ బుక్ చేసుకోవచ్చు.

అయితే ఘాంగరియా అనేది వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు అతి దగ్గరిగా ఉండే గ్రామం అనేది మీరు గమనించాల్సిన విషయం.

గోవింద్ ఘాట్, ఘాంగరియాలో మీకు రూమ్స్ దొరక్కపోతే మీరు స్థానికంగా ఉన్న గురుద్వారలో ప్రయత్నించవచ్చు.

ఇక్కడ ఎవరినీ ఉండనివ్వరు 

ఒకప్పుడు ఇక్కడి సౌందర్యానికి, ప్రశాంతతకు మంత్రముగ్దులైన రుషులు మనులు తపస్సు చేసేవారు అని అయితే జన సంచారం పెరగడంతో ఇప్పుడు వారు ఇక్కడికి రావడం లేదట.

1983 నుంచి ఇక్కడ పశువులను మేతకు తీసుకురావడం, ప్రజలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడాన్ని పూర్తిగా నిషేధించారు.

1983 నుంచి ఇక్కడ పశువులను మేతకు తీసుకురావడం, ప్రజలు ఇక్కడ నివాసాలు ఏర్పాటు చేసుకోవడానికి నిషేధించారు.

వ్యాలీ ఆఫ్ ప్లవర్స్‌కు వచ్చినప్పుడు అందమైన పూవులనే కాదు ఆకాశంలో సంచరించే అందమైన పక్షులు కూడా కనిపిస్తాయి.

Also Read :  Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు

అందులో హిమాలయన్ గిబ్బాన్, అరుదైన LAMMERGEIER BIRD అనే రాబందులు, హిమాలయన్ స్నో కాక్  కూడా కనిపించే అవకాశం ఉంటుంది. 

ఆంజనేయుడు సంజీవని కోసం వెతికిన లోయ

DOES HANUMAN CAME TO VALLEY OF FLOWERS? : పువ్వుల లోయ గురించి ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అందులో స్థానికులు చెప్పే ఒక విషయం మీతో షేర్ చేస్తాను.

లక్ష్మణుడి ప్రాణాలను కాపాడేందుకు ఆంజనేయుడు సంజీవని కోసం బయల్దేరిన విషయం తెలిసిందే. అలా సంజీవనిని వెతికుతూ వెతుకుతూ అంజన్న వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు కూడా వచ్చారట. ఈ విషయంలో మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయంది. 

హేంకుండ్ సాహింబ్ | HEMKUND SAHIB 

చాలా మంది పర్యటకులు ఇక్కడికి కేవలం వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ చూడటానికి మాత్రమే రారు. ఈ వ్యాలీకి సమీపంలోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వార్ హేమ్ కుండ్ సాహిబ్ కూడా ఉంటుంది.

Pra
ఈ ట్రెక్‌లో బిగిన్నర్స్ కూడా లక్ ట్రై చేయవచ్చు.

అది కూడా దగ్గరే కాబట్టి ఈ రెండూ కవర్ చేస్తుంటారు. దీంతో పాటు బద్రినాథ్ వెళ్లే భక్తులు కూడా ఇక్కడికి వచ్చేలా ప్లాన్ చేస్తుంటారు.

రిజిష్ట్రేషన్ అవసరమా ? | Valley Flowers Registration

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ టూరిస్టుల కోసం జూన్ 1 నుంచి అక్టోబర్ 31 వరకు తెరిచే ఉంటుంది. ఇది ఒక నేషనల్ పార్క్ కాబట్టి ఇక్కడికి వెళ్లే ముందు పర్యటకులు రిజిస్టర్ చేసుకోవాలి.

దీని కోసం మీరు పార్క్ ఎంట్రాన్స్ వద్ద కూడా డబ్బులు చెల్లించవచ్చు లేదా ఆన్‌లైన్‌లో కూడా రిజిస్టర్ చేసుకోవచ్చు. 

Pra

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ ఎందుకు వెళ్లాలి ? | Why You Should Visit Valley Of Flowers

మన దేశంలో ఉన్న అందమైన లోయల్లో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఒకటి. అందం ఆధ్మాత్మికత కలబోతలతో మాటలకు అందని అనుభూతిని ఇస్తుంది పూల లోయ. ఇంత చెప్పినా ఈ లోయకు ఎందుకు వెళ్లాలి అని ఎక్కడైనా డౌట్ ఉంటే ఈ పాయింట్స్ చదివి చూడండి.

ముందుగా ఇది యూనెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ సంపద. అందుకే ప్రపంచ వ్యాప్తంగా చాలా మంది ఇక్కడికి వస్తుంటారు

దాంతో పాటు ఇక్కడ 650 జాతుల పూవులు ఉంటాయి. అయితే అక్కడికి వెళ్లి పువ్వులను లెక్కబెట్టకండి.ఎందుకంటే మీరు వెళ్లిన సమయానికి కొన్ని పువ్వులు ఇంకా పూయకపోవచ్చు లేదా మరికొన్ని వాడిపోయి ఉండవచ్చు.

 మొత్తానికి ఆగస్ట్ మొదటి వారంలో వెళ్తే 300 రకాల పూవులు చూసే అవకాశం ఉంటుందని కొంత మంది ట్రావెలర్స్ చెప్పారు.

ఈ ట్రెక్ ఉంది చూడండి ఇక్కడికి ఫస్ట్ టైమ్ ట్రెక్ చేసే వ్యక్తి కూడా ఎంజాయ్ చేస్తూ వెళ్లగలడు.

ఇక్కడి నుంచి హిమాలయాల అందం చూడటం అనేది ఒక వరం అనే చెప్పాలి.

ఈ వ్యాలికి ప్లాన్ చేస్తే బోనస్‌గా మీరు హేంకుండ్ సాహిబ్ అనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తులో ఉన్న గురుద్వారకు కూడా ప్లాన్ చేయవచ్చు.

Also Read | Manali : ఎలా ప్లాన్ చేసుకోవాలి ? ఎక్కడ ఉండాలి ? ఏం చూడాలి? 

మాజీ లవర్ ఫోటోను...వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఫోటోలను ఎంత సేపైనా చూడొచ్చు
వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఫోటోలను ఎంత సేపైనా చూడొచ్చు

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ అనేది ఎన్ని రోజుల ట్రెక్ | Itinerary Of Valley Flowers Trek

మొదటి రోజు | Day 1

Rishikesh To Joshimath or Govind Ghat : మీరు ముందుగా హరిద్వార్ లేదా రిషికేష్ నుంచి 253 కిమీ దూరంలో ఉన్న జ్యోషిమఠ్ లేదా జ్యోషిమఠ్‌కు సమీపంలో ఉన్న గోవింద్ ఘాట్ చేరుకుంటారు. మధ్యో దేవ్ ప్రయాగ్ వద్ద అలకనందా, భగీరథి నదుల సంగమంతో ఏర్పడిన గంగానదిని చూస్తారు.

రెండవ రోజు | Day 2

Joshimath or Govind Ghat To Ghangaria Via Pula : జ్యోషిమఠ్ లేదా గోవింద్ ఘాట్ నుంచి పూల్నా అనే  గ్రామానికి చేరుకోవాలి. ఇక్కడి నుంచి ఇక ట్రెక్కింగ్ చేసి వెళ్లాల్సి ఉంటుంది. సుమారు 7-8 గంటలు ట్రెక్ చేసి ఘాంగరియాకు సాయంత్రం కల్లా చేరుకుంటాము.

మూడవ రోజు | Day 3

Ghangaria To Valley Flowers : మూడవ రోజు ఉదయం ఘాంగరియా గ్రామం 7 గంటలు ట్రెక్ చేసి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్‌కు చేరుకుంటాం. మొత్తం 10 కిమీ ట్రెక్ ఇది. మధ్యాహ్నం 1 గంటకు వ్యాలీ నుంచి తిరుగుముఖం పట్టాలి.

నాలగవ రోజు | Day 4

Ghangaria To Hemund Sahib Gurudwara : ఘాంగరియా నుంచి హేంకుండ్ సాహిబ్ గురుద్వార వచ్చేసి అప్ అండ్ డౌన్ 14 కిమీ ఉంటుంది. ట్రెక్కింగ్‌కు 9 గంటల సమయం పడుతుంది. అక్కడ ఒక గంటా రెండు గంటలు ఉండవచ్చు. అయితే ఇక్కడ ఎలివేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిజమైన ట్రెక్కింగ్ అంటే ఏంటో ఇక్కడ అర్థం అవుతుంది.

ఐదవ రోజు | Day 5

Ghangaria To Govind Ghat Or Joshimath : ఘాంగరియాలో బ్రేక్ ఫాస్ట్ పూర్తి చేసి ఉదయం త్వరగా పుల్నా వైపు ట్రెక్ చేస్తూ కిందికి చేరాల్సి ఉంటుంది. మొత్తం 9 కిమీ ట్రెక్కింగ్ ఇది యావెరేజ్‌గా 5 గంటల్లో పూర్తి చేయవచ్చు.

ఆరవ రోజు | Day 6

Joshimath To Haridwar or Rishikesh :మీ ట్రెక్కింగ్‌లో ఇది చివరి రోజు ఇక మీరు రిషికేష్ లేక్ హరిద్వార్‌కు తిరుగుప్రయాణం చేయాల్సిన సమయం ఇది. లేదా మీరు జ్యోషిమఠ నుంచి బద్రినాథ్ కూడా ప్లాన్ చేయొచ్చు.

వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ వీడియో చూడండి

ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. యూట్యూబ్ ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!