ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించడం అంటే ఇదే! Himachal Pradesh

షేర్ చేయండి

హిమాచల్ ప్రదేశ్ అంటే అందమైన పర్వతాలు, అద్భుతమైన చరిత్ర, సంప్రదాయాలు, ఆచారాలతో పాటు సన్నని, ఇరుకైన రోడ్డు మార్గాలకు కూడా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ (Himachal Pradesh) కొన్ని రోడ్లపై ప్రయాణిస్తే ఎంత థ్రిల్లింగ్‌గా అనిపిస్తుందో అంతే భయంగా కూడా అనిపిస్తుంది. ఇలాంటి ఫియర్ అండ్ థ్రిల్‌ను చూపించే ఒక వీడియో ఇప్పుడు నెట్టింట సందడి చేస్తోంది. 

ఈ వీడియోలో హిమాచల్ రోడ్డు రవాణా సంస్థకు చెందిన ఒక బస్సు కొండ అంచునుంచి వెళ్లడాన్ని షూట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు ఒక వ్యక్తి.

ఈ వీడియో చూస్తున్నంత సేపూ నరాలు తెగిపోయేంత ఉత్కంఠత,  బస్సు పడిపోతే పరిస్థితి ఏంటి అనే ఊహ రానే వస్తుంది. 

నెటిజెన్ల రియాక్షన్ | Himachal Pradesh

ఈ వీడియోను టెక్ మూసాఫిర్ అనే యూజర్ ఇన్‌స్టాగ్రామ్ ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు. పోస్ట్ చేసిన వెంటనే హిమాచల్‌లో రోడ్డు (Himachal Pradesh Road Trip) మార్గంలో ప్రయాణించిన వారు వెంటనే రియాక్ట్ అయ్యారు. తమ ప్రయాణ అనుభవాలను షేర్ చేయడం మొదలు పెట్టారు.

  • ఇన్‌స్టా‌గ్రామ్‌లో ఈ వీడియోను చూసి నెటిజెన్లు భిన్నంగా స్పందిస్తున్నారు.
  • కొంత మంది యూజర్లు బస్సు డ్రైవర్ల పనితీరును మెచ్చుకుంటున్నారు. 
  • ఈ దారిలో బస్సులో వెళ్లడం కన్నా నడిచి వెళ్లేందుకే ఇష్టపడతాను అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

ఇది నిజంగా ప్రాణాలను అరచేతుల్లో పెట్టుకుని ప్రయాణించడమే అని ఒక యూజర్ కామెంట్ చేశారు.

నిజానికి ఈ వీడియో హిమాచల్ ప్రదేశ్‌లోని ఏ ప్రాంతానికి చెెందినదో ఖచ్చితంగా తెలియదు. కానీ నది అండ్ చుట్టుపక్కల ఉన్న లోయను బట్టి ఇది చంబా నుంచి పాంగి (Chamba to Pangi) వెళ్లే దారిలో ఉంది అని అనిపిస్తోంది. ఇది హిమాచల్ ప్రదేశ్‌లోని చంబా జిల్లాలో ఉంది.

ఈ లొకేషన్ గురించి మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి ప్రయాణాలను మీరు ఇష్టపడతారో లేదా కూడా తెలపండి.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!