5 Hidden Villages : మన దేశంలో ఉన్న 5 హిడెన్ విలేజెస్..ఏపి విలేజ్ కూడా ఉంది.
5 Hidden Villages : భారత దేశం అంత వైవిధ్యభరితమైన వాతావరణం, సంప్రదాయాలు, ఐక్యత, భిన్నత్వం, భాషలు, ఆహార అలవాట్లు, నాగరికత, చరిత్ర, నైపుణ్యం ఉన్న దేశం భూమిపై మరొకటి లేదు. ఇవన్నీ మనకు తెలిసిన విషయమే కదా. అయితే మన దేశంలో కొన్ని గ్రామాలు అత్యంత విశిష్టమైనవి అని మీకు తెలుసా? ఆ గ్రామలు ఇవే…
1. మాలినోంగ్ | Mawlynnong, Meghalaya
ఆసియాలోనే క్లీనెస్ట్ విలేజ్ (Cleanest Village In Asia) అయిన మాలినోంగ్‌లో మీకు ఎక్కడా చెత్త కనిపించదు. మేఘాలయలో ఉన్న స్వర్గంలాంటి గ్రామం ఇది. షిల్లాంగ్ నుంచి కేవలం 90 కిమీ దూరంలో ఉన్న గ్రామంలో ఖాసీ తెగకు చెందిన ప్రజలు ఎక్కువగా నివసిస్తుంటారు.
- ఇక్కడ ప్లాస్టిక్ వాడటం అనేది పూర్తిగా బ్యాన్ చేశారు.
- ఇక్కడి స్థానికులు వెదురుతో వివిధ వస్తువులు తయారు చేస్తుంటారు.
- మరో విషయం ఇక్కడి నుంచి మీకు బంగ్లాదేశ్ కూడా కనిపిస్తుంది.
Wartch : మేఘాలయ రాజధానిలో ప్రయాణికుడు… షిల్లాంగ్ నగరం విశేషాలు చూడండి
2. ఖొనోమా | Khonoma, Nagaland
India’s First Green Village : భారత్‌లో తొలి గ్రీన్ నాగాలాండ్‌లో ఉన్న ఖోనోమా . ఇది ఒక ఇకో ప్యారడైజ్‌లా కనిపిస్తుంది. వీరి సాంప్రదాయాలు, వ్యవసాయ పద్ధతులు మనసు దోచేస్తాయి.

ఇక్కడి స్థానికుల్లో ఐక్యత చూస్తే సొసైటీ అంటే ఇలా ఉండాలి అని అనిపిస్తుంది. నేచర్ అన్నా వన్యప్రాణులు అన్నా వీరికి చాలా గౌరకం. ఎంతగా అంటే ఇక్కడ వేటను కూడా నిషేధించారు. ఖోనోమా వెళ్తే మీరు టెర్రెస్ ఫార్మ్స్‌లో సరదాగా నడచుకుంటూ వెళ్లొచ్చు.
- ఇది కూడా చదవండి : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
ఇక్కడ రాతియుగంలో ఉన్నామా అనిపించేలా ఉండే ఇళ్లు మిమ్మల్ని తప్పుకుండా ఇంప్రెస్ చేస్తాయి.
3. చిట్కుల్ | Chit Kul, Himachal Pradesh
Last Village on India-Tibet Border : ఇండో టిబెట్ బార్డర్లో చివరి గ్రామం అయిన చిట్కుల్లో మంచుతో కప్పబడిన పర్వతాలు, అక్కడి ఇళ్లతో పాటు స్వచ్ఛమైన గాలి మిమ్మత్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది.
- ఇది కూడా చదవండి : ఏపీ, తెలంగాణలో అతి పెద్ద మామిడిపండ్ల మార్కెట్లు ఏవో తెలుసా? | Mango Markets In Telugu States
చిట్కుల్ ఉన్న ప్రాంతంలో మీరు ఎటు చూసినా అందమే కనిపిస్తుంది. హిమాలయాల (Himalayas) వైభవాన్ని చాటే బాస్పా వ్యాలీ (Baspa Valley) లో 11,320 అడుగులు ఎత్తులో ఉండే ఈ గ్రామంలో ఉన్న తోటలు, స్థానికుల ఇళ్లు వారి లైఫ్‌స్టైల్ ఇవన్నీ మీకు తప్పకుండా కొత్తగా అనిపిస్తాయి.
- మనాలిలో ప్రయాణికుడు : వీడియో చూడండి
4. లంబసింగి | Lambasingi | 5 Hidden Villages

Kashmir Of The South : ఆంధ్రా కాశ్మీర్‌గా పాపులర్ అయిన లంబసింగిలో ఎండాకాలంలో కూడా చల్లగా ఉంటుంది. ప్రపంచానికి దూరంగా ప్రశాంతతకు చేరువలో ఉంటుంది లంబసింగి. తూర్పు కనుమల్లో ఉన్న అద్భుతమైన ఈ గ్రామాన్ని కొర్రబయలు అని కూడా అంటారు.
మరి అలా ఎందుకు అంటారో తెలుసుకోవాలి అనుకుంటే లంబసింగిపై నేను రాసిన ఈ పోస్టు చదవండి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
5. బానవాసి, కర్ణాటక | Banavasi, Karnataka
2000-Year-Old Temple Village : కర్ణాటకలోని బానావాసిలో ముదుకేశ్వర ఆలయం (Mudukeshwara Temple) ఉంటుంది. ఈ పట్టణాన్ని చూస్తే కాలం ఆగిపోయినట్టు, డిఫరెంట్‌గా ఉంటుంది. బానవాసి అనేది కదంబా రాజవంశానికి చెందిన తొలి రాజధాని (Kadamba Dynasty) కాబట్టి ఇక్కడి (ఆలయం) శిల్పకళా వైభవం ఎవరినైనా ఇంప్రెస్ చేస్తుంది.
ఈ 5 హిడెన్ విలేజెస్‌పై చేసిన షార్ట్ వీడియో చూడండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.