కుంభమేళాకు వెళ్లే ఏపీ ఆర్టీసి బస్సులు ఎలా బుక్ చేసుకోవాలి ? టికెట్ ధర ఎంత ? | APSRTC Busses To Kumbh Mela

షేర్ చేయండి

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు మత ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ( APSRTC Busses To Kumbh Mela ) ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ బస్సు టికెట్ ధర, బుకింగ్ విధానం, కవర్ చేసే ప్రాంతాల వివరాలు ఇవే…

భక్తుల విశ్వాసానికి ప్రతీక మహాకుంభ మేళా

ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌‌లో జరిగుతున్న కుంభమేళాకు వెళ్లాలని కోట్లాది మంది భక్తులు కోరుకుంటారు. జీవిత కాలంలో అరుదుగా జరిగే ఈ మహా కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2025 )  వెళ్లి అక్కడ త్రివేణి సంగమంలో పవిత్ర స్నానం ఆచరించాలని భక్తులు ఆశిస్తారు. ఇలా పవిత్ర స్నానం చేయడం వల్ల వారి పాపాలు తొలగి ముక్తి లభిస్తుంది అనేది భక్తుల విశ్వాసం. అందుకే దేశ విదేశాల నుంచి భక్తులు ప్రపంచంలోని ఈ అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమానికి తరలి వస్తున్నారు.

లక్షల సంఖ్యలో తెలుగు వారు కూడా  ( Telugu Devotees In Kumbh Mela ) మహా కుంభమేళాకు తరలి వెళ్తున్నారు.చాలా మంది ట్రైన్లు, ఫ్లైట్స్ ఎక్కి వెళ్తున్నారు. అయితే టికెట్స్ దొరక్కపోవడం ఇతర చాలా కారణాల వల్ల చాలా మంది వెళ్లలేకపోతున్నారు. ఇలాంటి వారి కోసం ఏపీ ఆర్టీసి ప్రత్యేర ఏర్పాట్లు చేసింది. 

కుంభమేళాకు బస్సులో | AP To Maha Kumbh Mela On RTC Bus

ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఇటీవలే ఏపీఎస్ఆర్టీసి ప్రత్యేక బస్సులు ప్రకటించిన విషయం తెలిసిందే. విజయవాడ నుంచి ఈ ప్రత్యేక బస్సులు తమ ప్రయాణాన్ని మొదలు పెట్టి ప్రయాగ్‌రాజ్‌తో పాటు ఇతర తీర్థ క్షేత్రాలను కూడా కవర్ చేయనున్నాయి. ఈ యాత్రలో కవర్ అయ్యే ప్రదేశాలు..

  • ప్రయాగ్‌రాజ్ ( Prayagraj )
  • వారణాశి
  • అయోధ్య

8 రోజుల పాటు సాగే ఈ ఆధ్యాత్మిక యాత్ర అనేది ఈ మూడు పుణ్యక్షేత్రాల దర్శనం చేయిస్తూ మొత్తం 3,600 కిమీ మేరా యాత్ర సాగుతుంది.

8 రోజుల షెడ్యూల్ ఇలా | APSRTC Busses To Kumbh Mela Schedule

 

 APSRTC Busses To Kumbh Mela
| గంగానదిలో స్నానం ఆచరిస్తున్న భక్తులు

విజయవాడ నుంచి మహకుంభ మేళా జరిగే ప్రయాగ్‌రాజ్ వెళ్లే ఆర్టీసి బస్సులు 8 రోజుల పాటు భక్తులకు అద్భుతమైన యాత్రా అనుభవాన్ని కలిగించనున్నాయి. ప్రయాణికులకు అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తూ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 8వ తేదీ వరకు కొనసాగనుంది ఈ యాత్ర.

  • 2025 ఫిబ్రవరి 1 : ఈ రోజు ఉదయం విజయవాడలోని ( Vijayawada Bus Station ) పండిత్ జవహార్ లాల్ నెహ్రూ బస్టాండ్ నుంచి ప్రత్యేక బస్సులు ప్రయాణం మొదలుపెట్టనున్నాయి.
  • ఫిబ్రవరి 2వ తేది  :  ఈ రోజు సాయంత్రం వరకు ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ చేరుకోనున్న బస్సు
  • ఫిబ్రవరి 3వ తేది  :  యాత్రికులు ఈ రోజు ప్రయాగ్‌రాజ్‌లోనే బస చేయనున్నారు.
  • ఫిబ్రవరి 4వ తేది  :  ఈ రోజు రాత్రి అయోధ్యవైపు ( Ayodhya ) ప్రయాణం మొదలవుతుంది.
  • ఫిబ్రవరి 5వ తేది  : ఉదయం వరకు అయోధ్యకు చేరుకుంటారు. అనంతరం బాలరాముడి దర్శనం చేసుకుంటారు. ఇదే రోజు రాత్రి వారణాసి వైపు ప్రయాణం మొదలుపెడతారు.
  • ఫిబ్రవరి 6వ తేది  : ఉదయవ వారణాసి ( Varanasi ) చేరుకుని అక్కడే బస చేయనున్నారు యాత్రికులు
  • ఫిబ్రవరి 7వ తేది  :  ఈ రోజు ఉదయం వారణాసి ( Kashi ) నుంచి విజయవాడవైపు తిరుగు ప్రయాణం మొదలు అవుతుంది.
  • ఫిబ్రవరి 8వ తేది  : ఈ రోజు ప్రయాణికులు విజయవాడకు చేరుకుంటారు.

ఛార్జీలు | APSRTC Kumbh Mela Bus Charges

కుంభమేళా కోసం ఏపీ ఆర్టీసి సూపర్ లగ్జరీ, స్టార్ లైనర్ నాన్ ఏసి స్లీపర్, వెన్నెల స్లీపర్ బస్సులను ఏర్పాటు చేసింది. భక్తులు తమ అవసరాన్ని బట్టి, ఇష్టాన్ని బట్టి ఇందులో ఏదో ఒక సర్వీసును బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు వాటి ధర ఏంటో తెలుసుకుందాం. 

  • సూప‌ర్ ల‌గ్జ‌రీ బస్సు- రూ.8,000
  • స్టార్ లైన‌ర్ నాన్ ఏసీ స్లీప‌ర్‌ బస్సు- రూ.11, 000
  • వెన్నెల ఏసీ స్లీప‌ర్‌ బస్సు- రూ.14,500

ఈ ప్రత్యేక బస్సుల్లో ప్రయాణించే పిల్లలకు కూడా ఇవే ధరలు నిర్ణయించారు. వారికి తగ్గింపు కానీ ప్రత్యేక ధరలు కాని లేవు అని ఆర్‌టీసి అధికారులు తెలిపారు. 

మరి భోజనం వసతి ?

ఈ యాత్రలో వసూలు చేసే ఛార్జీలు కేవలం బస్సు ప్రయాణావి మాత్రమే. భోజనం, వసతి వంటి ఏర్పాట్లు, వాటి ఖర్చులను భక్తులే భరించాల్సి ఉంటుంది. దీంతో పాటు భక్తులు ఒక సమూహంగా ఏర్పడి అంటే 29 మంది లేకా 35 మంది ఇలా ఉంటే వారికి ప్రత్యేక బస్సులు (ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు.

ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book APSRTC Kumbh Mela Bus

ప్రయాగ్‌రాజ్ వెళ్లే బస్సు టికెట్ బుక్ చేసుకోవాడానికి మీకు పలు ఆప్షన్లు అందించారు ఆర్టీసి అధికారులు. ఇందులో మీ వెసులుబాటును బట్టి ఏదో ఒక ఆప్షన్ ఎంచుకుని టికెట్ బుక్ చేసుకోవచ్చు

  • మీరు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఆర్టీసీ సంస్థ వెబ్‌సైట్ విజిట్ చేసి బుక్ చేసుకోవచ్చు.

ఆ లింక్ వచ్చేసి : https://www.apsrtconline.in/ లేదా www.apsrtconline.in/

  • ఆఫ్‌లైన్లో టికెట్ బుక్ చేయాలి అనుకుంటే మీరు ఆర్టీసీ బస్ స్టేషన్లలో సంప్రదించవచ్చు.
  • ఆర్టీసి టికెట్లు బుక్ చేసే ఏజెంట్లు కూడా టికెట్ బుక్ చేస్తారు.
  • మీకు ఏమైనా సందేహాలు ఉన్నా, మరింత సమాాచారం కావాలి అనుకుంటే మీరు ఈ నెంబర్లకు కాల్ చేయవచ్చు.
  •  ఆ నెంబర్లు 8074298487, 0866 2523926, 0866 2523928 

ఈ ప్రత్యేక బస్సులు ( APSRTC Busses To Kumbh Mela ) ఫిబ్రవరి 1వ తేదీ నుంచి బయల్దేరుతాయి. ఒక వేళ మీరు కుంభమేళా వెళ్లాలి అనుకుంటే వెంటనే బుకింగ్ కోసం ప్రయత్నించండి. ఎందుకంటే చాలా మంది భక్తులు బుకింగ్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఎవరు ముందు బుక్ చేసుకుంటే వారిదే సీటు అనేది మీకు తెలిసే ఉంటుంది.

ఈ  Travel కంటెంట్ నచ్చితే, ఎవరికైనా ఉపయోగపడుతుంది. అనుకుంటే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!