3-Day Trip To Coorg: 3 రోజుల్లో కూర్గ్‌ను కవర్ చేసే సూపర్ ప్లాన్ ఇదే !
3-Day Trip To Coorg : భారత దేశ స్కాట్లాండ్ అని (Scotland of India) పిలుచుకునే కూర్గ్ వర్షాకాలం వస్తే చాలా ఒక మినీ స్వర్గంగా మారిపోతుంది. ఇతర అనేక హిల్ స్టేషన్స్‌తో పోల్చితే కాస్త్ సేఫ్ అయిన కూర్గ్‌కు వెళ్లేందుకు మీర్ ప్లాన్ చేస్తుంటే ఈ 3 రోజుల ట్రావెల్ గైడ్ మీ కోసమే.
దక్షిణాదిలో ఎన్నో హిల్ స్టేషన్స్‌తో (Hill Stations in South India) నిత్యం పర్యాటకులతో కిటకిటలాడే రాష్ట్రం కర్ణాటక (Karnataka). వర్షాకాలంలో ఈ రాష్ట్రంలో కొన్ని ప్రాంతాలు పచ్చదనంతో కళకళలాడుతాయి.
ఇక సమ్మర్లో కూల్‌గా ఉండే కూర్గ్ వర్షాకాలంలో ఆకాశంలో దట్టమైన మేఘాలతో…నేలపై కిమీ కొద్ది పరుచుకున్న కాఫీ తోటలు, పచ్చదనంతో పర్యాటకులను పలకరిస్తుంది.
ముఖ్యాంశాలు
- ఇది కూడా చదవండి : Honeymoon : వీసా అవసరం లేకుండా ఈ ఏడు దేశాల్లో హనీమూన్‌కు వెళ్లొచ్చు.
కూర్గ్ ఎలా చేరుకోవాలి ? | How To Reach Coorg
తెలుగు రాష్ట్రాల నుంచి చాలా మంది కూర్గ్‌కు వెళ్తుంటారు. అయితే మొదటిసారి కూర్గ్‌కు వెళ్తున్న వారి కోసం, లేదా చాలా రోజులైంది ఎలా వెళ్లాలో మర్చిపోయాను (చాలా మందికి రూట్లు, అడ్రెస్లు ఇవి గుర్తుండవు కదా…) అనుకునే వారి కోసం…
హైదరాబాద్ నుంచి | Hyderabad To Coorg
హైదరాబాద్ నుంచి కూర్గ్ 750 కిమీ దూరంలో ఉంటుంది. మీ సెల్ప్ డ్రైవ్‌లో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ లేదా స్పెషల్ పర్సన్‌తో కలిసి లేదా మీతో మీరుగా వెళ్లాలి అనుకుంటే 13-14 గంటల సమయం పడుతుంది.
- బండి మీదే, ట్రిప్ మీదే, కాబట్టి మధ్యలో బెంగుళూరు, మైసూరు ఇలా ఎక్కడ నచ్చితే అక్కడ ఆగే హక్కు కూడా మీదే. నచ్చినంత సమయం గడిపి వెళ్లొచ్చు. లేదు వర్షాకాలంలో రోడ్డు జర్నీలు మరీ ముఖ్యంగా కొండ ప్రాంతాల్లో ఘాట్ రోడ్డుల్లో రిస్కు అనుకుంటే ఇంకో మార్గం ఉంది.
విమానంలో : త్వరగా ప్రశాంతంగా వెళ్లాలి అనుకుంటే హైదరాబాద్ నుంచి బెంగళూరు, మంగళూరుకు ప్లైట్‌లో వెళ్లిపోవచ్చు.అక్కడి నుంచి మడికెరి (Madikeri) క్యాబులో చేరుకోవచ్చు.
ట్రైన్లో : కూర్గ్ వరకు డైరక్ట్ ట్రైన్లు లేవు. సో మీరు బెంగుళూరు లేదా మైసూరు నుంచి మెడికెరి వరకు ట్రైన్లో వెళ్లొచ్చు. ఈ జర్నీ వైజాగ్ నుంచి అరకు ట్రైన్ జర్నీలాగే (Vizag To Araku Train Journey) అదిరిపోతుంది.
- ఇది కూడా చదవండి : Telugu Women Travel Vloggers : ట్రావెల్ వ్లాగింగ్‌లో వీర వనితలు
విజయవాడ | Vijayawada to Coorg
విమానంలో : విజయవాడ నుంచి కూర్గ్ 850 కిమీ దూరంలో ఉంటుంది. మీరు విమానంలో డైరక్టుగా బెంగుళూరు చేరుకుని అక్కడి నుంచి ట్రైన్లో మెడికెరి వరకు చేరుకోవచ్చు. లేదా క్యాబ్‌లో అయితే డైరక్ట్‌గా కూర్గ్ వెళ్లొచ్చు.
ఇక సొంత వాహనంలో వెళ్లాలి అనుకుంటే మాత్రం 15-16 గంటల సమయం పడుతుంది.
రైలు : ఇక రైలు విషయానికి వస్తే బెంగుళూరు లేదా మైసూరు నుంచి మెడికెరి చేరుకుని అక్కడి నుంచి కూర్గ్ వెళ్లొచ్చు.
కూర్గ్ వెళ్లేందుకు బెస్ట్ టైమ్ ఏంటి ? | Best Time To Visit Coorg
మనం వర్షాకాలం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఈ సీజన్లో బెస్ట్ టైమ్ ఏంటో తెలుసుకుందాం. జూన్ నుంచి సెప్టెంబర్ మధ్యలో ఉండే మాన్సూన్లో జులై, ఆగస్టు నెలల్లో భారీగా వర్షాలు కురుస్తాయి. సో కూర్గ్‌కు మాత్రమే కాదు దేశంలో ఏ టూరిస్ట్ స్పాట్ లేదా హిల్ స్టేషన్ అయినా మీరు వర్షాకాలంలో జూలై, ఆగస్టులో వెళ్లేముందు ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోండి. అవసరమా అని పది సార్లు ఆలోచరించండి.
అయితే అదే సమయంలో..అంటే జూలై- ఆగస్టులో కూర్గ్ సమీపంలో ఉన్న ఎబ్బె జలపాతం (Abbey Falls) లో భారీగా నీరు చేరుకుంటుంది. జలసిరి సొగసు వర్ణించేందుకు మాటలు సరిపోవు అంత అందంగా ఉంటుంది. అందుకే చాలా మంది ఈ సమయంలోనే కూర్గ్ వెళ్లేందుకు ఇష్టపడతారు. ఒక వేళ మీరు కూడా వెళ్లాలి అనుకుంటే మంచి రెయిన్ కోర్ట్, స్ట్రాంగ్ షూలతో గట్టి బందోబస్తుతో వెళ్లండి. ఎందుకంటే వర్షాలు ఎప్పడు వస్తాయో వర్షానికి కూడా తెలియదు.
ఒక మూడు రోజుల ట్రిప్ విషయానికి వస్తే…
మొదటి రోజు | Day -1 | మెడికెరి, ఎబ్బె ఫాల్స్
మీరు హైదరాబాద్, విజయవాడ ఎక్కడి నుంచి స్టార్ట్ అయినా మీ కూర్గ్ అసలు ప్రయాణం మెడికెరి నుంచే ప్రారంభం అవుతుంది.

- మెడికెరి నుంచి వెళ్లే దారిలో మీకు అందమైన ముడుత పర్వతాలు, లోయలు (Rolling Valley) కనిపిస్తాయి. అప్పటి వరకు దాక్కున్న కొండలు హఠాత్తుగా మబ్బుల తెరను చించుకుని మీ ముందుకు వచ్చి ఏంటి ఇంత దూరం వచ్చావు. ఆ వస్తే వచ్చావులే మూడు రోజులు ఉండి మా ఆ ఆతిథ్యం తీసుకుని వెళ్లు అంటాయి..
- మార్నింగ్ షో అయ్యాక మీరు దగ్గర్లో ఉన్న ఓంకారేశ్వర్ ఆలయాన్ని (Omkareshwar Temple) దర్శించుకోండి. ఆలయ నిర్మాణం మిమ్మల్ని తప్పకుండా ఇంప్రెస్ చేస్తుంది.
- తరువాత లంచ్ పూర్తి చేసి అనంతరం ఏబ్బె జలపాతం చూసేందుకు వెళ్లండి.
- సాయంత్రం మెడికెరిలో రుచికరమై స్నాక్స్ తినేసి అలా అలా సరదాగా తిరగండి.
- ఒక వైపు ఆకాశం నుంచి షవర్ , మరో వైపు లోకల్ ఫ్లేవర్ కాఫీ (Coorg Coffee)…ఈ కాంబినేషన్లో ఒక్క పదం మార్చకుండా ఎంజాయ్ చేయండి.
రెండవ రోజు | Day 2 | దుబారె, బైలకుప్పె
సెకండ్‌డే ఉదయం 9 గంటలలోపు మీరు దుబారె ఎలిఫెంట్ క్యాంప్ (Dubare Elephant Camp) చేరుకునే ప్లాన్ చేసుకోండి. 28 కిమీ కాబట్టి అంత టెన్షన్ పడాల్సిన అవసరం లేదు.
మనం ఎలా పొద్దున్నే స్నానం చేస్తామో అలాగే ఇక్కడ గజరాజులు కూడా మార్నింగ్ షవర్ చేస్తాయి.
- తొండంతో కావేరీ నది నిటినీ తీసుకుని టోటల్ బాడీ షవర్ చేస్తుంటాయి. అలాగే వాటి మావటి లేదా సంరక్షకుడు వాటికి ఫుడ్ కూడా పెడతారు. అది కూడా చూడొచ్చు.
- ఇక నిసరగంధామా (Nisargadhama) ద్వీపానికి వెళ్లేందుకు సిద్ధం అవ్వండి. నదిలోంచి బయటికి వచ్చే బాంబూ (Bamboo Groves) గ్రూవ్స్, హాంగింగ్ బ్రిడ్జెస్…చాలా బాగుంటుంది.
- అనంతరం బౌద్ధుల ఆలయం అయిన నామ్‌డ్రోలింగ్ మోనాస్టరీ అనే గోెల్డెన్ టెంపుల్ ఉన్న బైలకుప్పే (Bylakuppe) కు వెళ్లండి. బౌద్ధ మతస్థులు ఆచారాలు, జీవన విధానం, మోనాస్టరీ నిర్మాణ శైలిని గమనించండి. గోల్డెన్ బుద్ధ విహ్రహం మిమ్మల్ని తప్పకుంగా మరో లోకంలోకి తీసుకెళ్తుంది.
మూడవ రోజు | Day 3 | కాఫీతోటలు, తలకావేరి
కూర్గ్ వెళ్లి కాఫీ తోటలు చూడలేదా అని పక్కింటి వాళ్లు అడిగితే ఏం చెప్తారు ? అందుకే మూడవ రోజు ముచ్చగా కాఫీ తోటలకు వెళ్లండి.
- కాఫీ తోటలు తిప్పేందుకు కాఫీ ఎస్టేట్ వాళ్లు గైడ్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు.
- కాఫీ తోటల్లో విహరిస్తూ గింజలు ఎలా పండుతాయి, వాటిని ఎలా రోస్ట్ చేస్తారో తెలుసుకోవచ్చు. ఈ విషయంలో అక్కడి గైడ్ మీకు హెల్ప్ చేస్తాడు.
- ఇక మధ్యాహ్నం పవిత్ర కావేరి నది జన్మస్థానం అయిన తలకావేరి (Talacauvery) అనే ప్రాంతానికి వెళ్లండి.
- అంతా బాగుండి, టైమ్ ఉంటేనో వాతావరణం, మీ శరీరం సహకరిస్తేనో దగ్గర్లో ఉన్న బ్రహ్మగిరి హిల్స్ వెళ్లి సూర్యాస్తమయమో లేదా అందమైన చుట్టపక్కల ప్రాంతాలను కూడా చూసేయండి. ఒక పనైపోతుంది కదా..
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
తిరగడమేనా..ఏమైనా తినేది కూడా | 3-Day Trip To Coorg
3-Days Trip To Coorg : కొత్త ప్రదేశానికి వెళ్తే కాళ్లకు చెక్రాలు కట్టుకున్నట్టు తిరుగుతారు కొందరు. ఇంజిన్‌ను కాస్త చల్లార్చేందుకు మధ్యలో బ్రేకులు తీసుకున్నట్టు మీరు కూడా బ్రేక్ తీసుకోండి. మంచి ఇంజిన్ ఆయిల్ బండిని ఎలా స్మూత్‌గా ముందుకు తీసుకెళ్తుందో అలాగే మంచి భోజనం కూడా మనిషిని…( ప్రాస కుదరక వదిలేశాను)…
ఇక విషయాని వద్దాం…కర్ణాటకలో ఉండి అక్కడి రొట్టి ( Akki Rotti) తినకపోతే అక్కడి వాళ్లు ఫీల్ అవుతారు. దానికి తోడు కదంబుట్టు (Kadambuttu), బాంబూ షూట్ కర్రి తినకపోతే కూడా ఫీల్ అవుతారు.ప్రతీ మీల్ తరువాత తేనె కలిపిన కూర్గ్ కాఫీ తాగకపోతే కూర్గ్ ఫీలవుతుంది. ఎవ్వరినీ హర్ట్ చేయకుండా వచ్చేయండి. సరేనా…
అన్నట్టు చెప్పడం మర్చిపోయాను…కర్ణాటక వెళ్లే ముందు కొన్ని ముఖ్యమైన పదాలు తెలుసుకుని వెళ్లండి.
- నమస్కారం (తెలుగు)- నమస్కార ( కన్నడ)
- ధన్యవాదం (తెలుగు)- ధన్యవాద (కన్నడ)
- ఎంత- ఎస్టు
- తిన్నారా ? – హూటాయిత్తు
- నా పేరు కిషోర్ – నన్ హెసరు కిషోర్
- నీ పేరు ఏంటి ? – నిన్ హెసరేను
- బాగున్నారా – చెన్నాగిదురే
వర్షాకాలంలో కూర్గ్ బాగానే (Coorg In Monsoon) ఉంటుంది. మిగితా హిల్స్టేషన్లలా కాకుండా కాస్తా సేఫ్ అన్నాను అని మీరు కేర్లెస్గా ఉండకండి. అక్కడ కూడా కొండలు ఉన్నాయి. కొండలపై పడిపోవడానికి సిద్ధంగా ఉండే బండరాళ్లు, మట్టి అవీ ఇవీ ఉంటాయి…వర్షానికి వాటి కింద నేల తడిచి ఆ మట్టి మెత్తగా మారి అవి జారిపడుతుంటాయి…సో కొండచరియలు పడే ఛాన్స్ ఉంటుంది. సో, కూర్గే కాదు, ఈ సీజన్ ఎక్కడికి వెళ్లాలి అనుకున్నా అక్కడి వాతావరణం గురించి పూర్తిగా తెలుసుకోండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.