Travel Tip 02 : జూలైలో వెళ్లకూడని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే
Travel Tip 02 : వర్షాకాలం చాలా మందికి కొత్త కొత్త ప్రదేశాలకు వెళ్లాలని, నేచర్‌ను ఎంజాయ్ చేయాలని… చిరుజల్లుల్లో తడవాలని ఉంటుంది. అందుకే చాలా మంది ముందుగా ఆలోచించక, రీసెర్చ్ లేకుండా బ్యాగులు సర్దేసి బయల్దేరుతారు. కానీ అక్కడికి చేరిన తర్వాతే తెలుసుకుంటారు – ఇది సరైన సమయం కాదని. ఈ మిస్టేక్ మీరు చేయకూడదనే ఈ స్టోరీను పోస్ట్ చేస్తున్నాను.
ఇక్కడ చెప్పేవి మీరు తరచుగా వినే పాపులర్ టూరిస్ట్ డెస్టినేషన్లే అయినా, ఈ కాలంలో వెళ్ళడం పెద్దగా సురక్షితం కాదు. ఎందుకంటే కొన్ని ప్రాంతాల్లో మామూలు వర్షాల నుంచి కుండపోత వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడటం వంటి సమస్యలు ఎక్కువగా జరుగుతాయి. అలాంటి రెండు రెట్లు ప్రమాదం ఉన్న ప్రదేశాలు ఇవి…
ముఖ్యాంశాలు
- ఇది కూడా చదవండి : ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన గురుద్వార Hemkund Sahib ట్రావెల్ గైడ్ , 10 Tips and Facts
హిమాలయ పర్వత శ్రేణులు | Himalayan Tourist Spots in Monsoon
మొదట, హిమాలయ పర్వత ప్రాంతాల్లోని ముఖ్యమైన డెస్టినేషన్లను చూద్దాం. ఈ సమయంలో ఇక్కడ ప్రయాణించడం చాలా ప్రమాదకరం. ఎందుకంటే కొండ చరియలు ఎప్పుడు విరిగిపడతాయో తెలియదు. క్షణాల్లో పర్వతాల నుంచి పెద్ద రాళ్లు ఊడి పడి ఊళ్లకు ఊళ్లూ భూస్థాపితం అయిన ఘటనలు ఇప్పటికే చాలానే జరిగాయి. మరీ ముఖ్యంగా జూలై నుంచి ఆగస్టు మధ్యలో…
హిమాచల్ ప్రదేశ్
స్పితి వ్యాలీ, కిన్నోర్ లాంటి ప్రాంతాలు కొండ చరియలు ఎక్కువగా పడే చోట్లు. చాలా మంది కొండ ప్రాంతాల్లో రైడ్ ఎంజాయ్ చేయడానికి ఇక్కడికి వెళ్లేందుకు ఇష్టపడతారు. కానీ వర్షాకాలంలో మాత్రం వెళ్ళకండి. ఒక పెద్ద రాయి రోడ్డుపై పడితే, రోజుల తరబడి రూట్ మొత్తం బ్లాక్ అవుతుంది.
ఉత్తరాఖండ్

చార్ ధామ్ యాత్ర దారుల్లో యమునోత్రి, కేదార్నాథ్, గంగోత్రి, బద్రినాథ్ ధారులు ఉన్నాయి. ఇవి ఉన్న ఛమోలీ జిల్లా ల్యాండ్‌స్లైడ్స్ ఎక్కువగా జరిగే ప్రాంతం. నిత్యం కొండల నుంచి రాళ్లు కింద పడుతుంటాయి. అదే సమయంలో ఒక్కసారిగా మోస్తరు వర్షం కురుస్తూ, అలకానందా, భాగీరథి, లక్ష్మణ్ గంగా ఇలా ఎన్నో నదులు ఉప్పొంగుతుంటాయి.
బద్రినాథ్ వీడియో చూశారా…
ఈశాన్య భారత దేశం | Northeast India in Monsoon | Travel Tip 02
ఉత్తర సిక్కిం
వర్షాకాలంలో సిక్కిం వెళ్లడం అంత సేఫ్ కాదు. వరదలతో పాటు ఎవరూ ఊహించని విధంగా కొండచరియలు విరిగిపడుతుంటాయి.
ముఖ్యంగా ఉత్తర సిక్కింలో ఉన్న గురుడోంగ్మార్, యుంథాంగ్ ప్రాంతాలు ఇంకా ఎక్కువ ప్రమాదకరం.
అరుణాచల్ ప్రదేశ్

అరుణాచల్ ప్రదేశ్ వెళ్లాలని అనుకునేవారు ఈ సీజన్లో వాయిదా వేసుకోవడం ఉత్తమం. గువహటి నుంచి తవాంగ్ లేదా ఇతర ప్రాంతాలకు వెళ్లే దారులు వేల అడుగుల ఎత్తులో ఉంటాయి. ముఖ్యంగా సేలా పాస్‌లో రోడ్డే కనిపించనంత ముసురు లేదా మేఘాలు ఉంటాయి. దీనికి తోడు కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉంటుంది.
తవాంగ్ నుంచి చైనా బార్డర్ వెళ్లే నా ప్రయాణాన్ని మీ కోసం నా ఛానెల్లో అప్లోడ్ చేశాను
Click చేసి చూడండి :
మేఘాలయ

మేఘాలయ అంటేనే మేఘాలే రాజ్యం. వర్షాకాలం అంటే ఇక్కడ వర్షాలే వర్షాలు. షిల్లాంగ్ కూడా ప్లాన్ చేసినా వీలైతే రద్దు చేసుకోవడం బెటర్. చిరపుంజి, మాసిన్రామ్ లాంటి ప్రదేశాలను మరీ మర్చిపోవాలి. ఎందుకంటే ఇక్కడ ఒక్క నెలలోనే 2,000 మిమీకి పైగా వర్షపాతం నమోదవుతుంది.
అసోం | Travel Tip 02
ఈశాన్య భారతానికి గేట్‌వే లాంటి రాష్ట్రం. కానీ ఇక్కడ కొన్ని ప్రాంతాలను కూడా ఎవాయిడ్ చేస్తే మంచిది. అందులో కాజీరంగా నేషనల్ పార్క్ – వర్షాకాలంలో మూసేస్తారు. విపరీతమైన వరదల కారణంగా హాఫ్లాంగ్, మజౌలి లాంటి ప్రాంతాలకూ రాకుండా ఉండటం బెటర్.
తీర ప్రాంతాలు | Coastal Areas in Monsoon
చాలామంది “బీచ్‌లు మాత్రం సేఫ్ కదా” అనుకుంటారు. కానీ ఈ సీజన్లో కొన్ని తీర ప్రాంతాలు కూడా సురక్షితం కావు. సముద్రంలో అల్లకల్లోలాలు, ఉప్పెనలు, భారీ అలలు ఎగిసిపడటం జరుగుతుంటాయి.
గోవా – సముద్రం చాలా రఫ్‌గా, ఎత్తైన ఉప్పెలతో ప్రమాదకరంగా మారుతుంది.
అండమాన్ నికోబార్ – తుపానులు వచ్చే అవకాశం ఎక్కువ. ఫెర్రీ సర్వీసులు నిలిపివేస్తారు.
గోకర్ణ, కర్వార్ – అధిక వర్షాల వల్ల రోడ్లు, బీచ్‌లు అందుబాటులో ఉండకపోవచ్చు.
పశ్చిమ కనుమలు | Western Ghats in Monsoon
వర్షాకాలంలో పశ్చిమ కనుమలు ఎంత అందంగా ఉంటాయో, అంతే ప్రమాదకరంగా కూడా ఉంటాయి.
కేరళ – మున్నార్, వాయనాడ్‌లో ల్యాండ్‌స్లైడ్స్ చాలా ఎక్కువగా జరుగుతాయి.
కర్ణాటక – కూర్గ్ ప్రాంతం బురదమయం అవుతుంది. కొండచరియల ప్రమాదం ఎక్కువ.
మహారాష్ట్ర – మహాబలేశ్వర్, లోనావాలా చూడటానికి అద్భుతం. కానీ కొండచరియలు పడితే రోడ్లు పూర్తిగా బ్లాక్ అవుతాయి. ఇరుక్కుపోతే హోటల్స్, ఇతర సదుపాయాలు దొరకడం కూడా ఇబ్బందే అవుతుంది.
సో జూలై నెలలో ఇవి ఖచ్చితంగా ఎవాయిడ్ చేయండి. ఆనందం కన్నా సేఫ్టీ ముఖ్యం అని గుర్తుంచుకోండి.
ఏ ట్రావెల్ ప్లాన్ అయినా చేసేముందు, అక్కడి వాతావరణం గురించి ముందే తెలుసుకోండి. మీ టూరిస్ట్ ఆపరేటర్ “వచ్చేయండి” అన్నా, మీరు మాత్రం మీ రీసెర్చ్నే నమ్మండి.
ఈ సమాచారం మీకు ఉపయోగపడుతుందనుకుంటే, దయచేసి ఇతరులతో షేర్ చేయండి.
“Sources: Public weather advisories, news reports, and general travel safety guides.”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.