Lashkar Bonalu 2025 : సికింద్రాబాద్ బోనాలు ఎప్పుడు మొదలయ్యాయి ? దీనిని లష్కర్ బోనాలు అని ఎందుకు పిలుస్తారు ?
Lashkar Bonalu 2025 : తెలంగాణలో ప్రతీ ఏట జరిగే బోనాల పండుగ అనేది ఇక్కడి ప్రజల ఆధ్మాత్మిక చింతనకు, వారి భక్తి, విశ్వాసానికి ప్రతీకగా చెప్పవచ్చు. మరీ ముఖ్యంగా ఆషాఢ మాసంలో గొల్కొండ నుంచి లాల్ దర్వాజ వరకు బోనాలు (Golconda and Lal Darwaja Bonalu) ఎక్కడ జరిగినా సరే ప్రజలు అత్యంత భక్తి శ్రద్ధలతో, ఆచార, సాంప్రదాయాలతో అమ్మవార్లకు బోనం సమర్పిస్తారు. త్వరలో సికింద్రాబాద్‌లోని శ్రీ ఉజ్జయినీ మహాకాళి అమ్మవారి బోనాల సందర్భంగా స్పెషల్ స్టోరీ ఇది
ముఖ్యమైన తేదీలు : Lashkar Bonalu 2025 Dates
శ్రీ ఉజ్జయినీ అమ్మవారి బోనాలు ఈ సంవత్సరం జూలై 13వ తేదీన జరుగనున్నాయి. ఇక 14వ తేదీన రంగం, ఘట్టం వేడుకలు జరుగుతాయి.
- ఈ వేడుక కోసం ఇప్పటికే అధికారులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు.
- మొత్తం 2500 పోలిసులను మోహరించారు.
- భక్తుల కోసం 6 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇందులో రెండు లైన్లను బోనం తీసుకెళ్లే మహిళల కోసం కేటాయించారు.
- ఈసారి లష్కర్ బోనాలు సవ్యంగా జరిగేందుకు అధికారులు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు.
లష్కర్ బోనాలు అని ఎందుకంటారు | Why it is Called Lashkar Bonalu
సికింద్రాబాద్‌లోని ఉజ్జయినీ అమ్మవారి బోనాలను లష్కర్ బోనాలు అని కూడా పిలుస్తారు. ఇలా పిలవడానికి కారణం ఏంటో మీకు తెలుసా ?
సికింద్రాబాద్‌లో ఒకప్పడు బ్రిటిష్ వారి సైన్యం ఉండేది అని మీకు తెలిసే ఉంటుంది. నిజాంల (Nizam) పాలనా కాలంలో ఆంగ్లేయులు ఇక్కడ తమ సైన్యాన్ని మోహరించి ఉంచేవారు. వారి వ్యూహంలో భాగంగా ఇక్కడ పూర్తి రెజిమెంట్ నిత్యం సిద్ధంగా ఉండేది. ఈ సైనిక గుడారాలను లేదా ఆర్మీ క్యాంపు లేదా రెజిమెంట్‌ను లష్కర్ ( ఉర్దూ లేదా హిందీ) అని పిలుస్తారు.
నాటి ఆర్మీ బ్రిటిష్ వారిదే అయినా అందులో సైనికులు మాత్రం స్థానికులే ఉండేవారు. స్థానిక ప్రజలతో పాటు, రెజిమెంట్‌లోని సైనికులు ఉజ్జయినీ మహాంకాళి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించేవారు కాబట్టి ఈ బోనాలను లష్కర్ బోనాలు అనే పేరు వచ్చింది అని తెలుస్తోంది.
ఉజ్జయినీ మహాంకాళి ఆలయానికి ఆ పేరు ఎలా వచ్చింది ? |
Ujjaini Mahankali Temple Secunderabad History : సికింద్రాబాద్‌లోని మహాంకాళి అమ్మవారి ఆలయాన్ని ఉజ్జయినీ మహాకాళి అమ్మవారు అని పిలుస్తారు. అయితే మధ్యప్రదేశ్‌లో ఉన్న ఉజ్జయినీ ఆలయానికి ఈ ఆలయానికి ఉన్న పోలికలు ఏంటి…అసలు ఆ పేరు ఎందుకు వచ్చిందో తెలుసుకుందాం.
వికీపీడియాలో ఉన్న సమాచారం ప్రకారం…1813 లో జంటనగరాల్లో ప్లేగు వ్యాధి వ్యాపించి వేలాది మంది మరణించారట. అయితే ఈ వ్యాధి వ్యాపించడానికి కొంత కాలం ముందే హైదరాబాద్ మిలిటరీ బెటాలియన్‌కు చెందిన సైనికులను మధ్యప్రదేశ్‌లోని శ్రీ మహకాళేశ్వర్ మహాదేవ్ ఆలయం ( Sri Mahakaleshwar Mahadev Temple, Madhya Pradesh) ఉన్న ప్రాంతంలో మొహరించారట.
అయితే అక్కడికి వెళ్లీ వెళ్లగానే హైదరాబాద్- సికింద్రాబాద్‌లో ప్లేగు వ్యాధితో ప్రజలు చనిపోవడం గురించి తెలిసింది. తమ కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి వారిలో దిగులు మొదలైంది.
వెంటనే ఉజ్జయినిలోని మహాకాళి (Mahankali Temple, Ujjaini – Madhya Pradesh) ఆలయంలో ఉన్న మహాకాళి అమ్మవారిని దర్శించుకుని జంట నగరాల ప్రజలను ప్లేగు వ్యాధి నుంచి కాపాడమని వేడుకున్నారట.
- వ్యాధి నుంచి ప్రజలకు విముక్తి లభిస్తే వెంటనే అమ్మవారి విగ్రహాన్ని జంటనగరాల్లో ఒకచోట ప్రతిష్టిస్తామని మొక్కుకున్నారట సైనికులు.
- వారి ప్రార్థనలు విన్న అమ్మవారు ప్లేగు వ్యాధి నుంచి నగర ప్రజలకు ఉపశమనం కల్పించారని స్థానికుల విశ్వాస
- తమ ప్రార్థనలను విని, ప్రజలను వ్యాధి నుంచి రక్షించిన అమ్మవారికి సికింద్రాబాద్‌లో ఆలయం నిర్మించారు సైనికులు.
- తరువాత విగ్రహం ప్రతిష్టించి బోనాలు సమర్పించడం మొదలు పెట్టారు.
- అలా మొదలైన బోనాల సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది.
- ఇది కూడా చదవండి: Travel Tip 01 : ప్రయాణాల్లో తక్కువ బరువు – ఎక్కువ ఆనందం కోసం 5 చిట్కాలుv
- ఇది కూడా చదవండి : Travel Tip 02 : జూలైలో వెళ్లకూడని ప్రముఖ పర్యాటక ప్రాంతాలు ఇవే
- ఇది కూడా చదవండి : Travel Tip 03 : జూలై నెలలో టూర్ ప్లాన్ చేస్తున్నారా ? ఈ ప్రాంతాలకు వెళ్తే బెటర్
Sources: Telangana Tourism (Feature Image) , Wikipedia, news reports, local temple information.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.