TTD October Darshan : అక్టోబర్ నెల దర్శన కోటా విడుదల చేసిన తితిదే
TTD October Darshan : తిరుమలేషుడి దర్శనానికి 2025 అక్టోబర్లో వెళ్లాలని ప్లాన్ చేసే భక్తులకు శుభవార్త. ఈ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, గదులు, సేవలకు సంబంధించిన కోటా వివరాలను అధికారులు షేర్ చేశారు. తితితే నుంచి అందిన సమాచారం ప్రకారం.
ముఖ్యాంశాలు
ఆర్జిత సేవా టికెట్లు | Arjitha Seva Tickets October 2025
శ్రీవారి భక్తులకు అందించే ఆర్జిత సేవా టికెట్ల అక్టోబర్ కోటాను ఆన్లైన్లో ఈ నెల 19వ తేదీన ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది తితిదే (Tirumala Tirupati Devasthanam) . ఇక సేవల టికె్ట్ల ఎలక్ట్రానిక్ డిప్ కోసం భక్తులు నమోదు చేసుకోవాల్సిన తేదీని జూలై 21 గా సమయాన్ని ఉదయం 10 గంటలుగా నిర్ణయించారు.
ఇక ఎలక్ట్రానిక్ డిప్ టికెట్లు (TTD Electronic Dip Tickets) పొందిన భక్తులు లక్కీ డిప్ పొందేందుకు జూలై 21వ తేదీ నుంచి జూలై 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటల లోపు పేమెంట్ చెల్లించాల్సి ఉంటుంది. తరువాత లక్కీ డిప్లో టికెట్లు మంజూరు అవుతాయ.
సేవలు ఇతర టికెట్లు, కోటాల వివరాలు
ఆర్జిత సేవల టికెట్లు…
తిరుమల ఆలయంలో ఆర్జిత బ్రహ్మోత్సవం, వార్షియ పుష్పయాగము, సహస్త్రదీప అలంకరణతో పాటు కళ్యాణోత్సవం, ఉంజల్ సేవా, ఆర్జిత సేవల టికెట్లను జూలై 22 ఉదయం 10 గంటలకు విడుదల చేస్తారు.
ఆన్ లైన్ సేవా టికెట్లు | TTD Virtual Seva Tickets 2025 October
ఇక వర్చువల్ లేదా ఆన్లైన్లో సేవలు, దర్శన స్లాట్ట కోటా వివరాలు చెక్ చేసుకోవడానికి జూలై 22 మధ్యాహ్నం 3 గంటల తరువాత టీటిడి అధికార వెబ్సైట్ను చెక్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : వాట్సాప్లో టీటీడీ సేవల ఫిర్యాదు…క్యూఆర్ కోడ్ లాంచ్ చేసిన దేవస్థానం | TTD WhatsApp Feedback
జూలై 23వ తేదిన…
- ఉదయం 10 గం.లకు అంగ ప్రదక్షిణం టోకెన్లు (ఆన్లైన్లో), ఉదయం 11 గంటలకు శ్రీవాణి టికెట్ల (Srivani Tickets) ఆన్లైన్ కోటా విడుదల కానున్నాయి.
- ఇక దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న భక్తులకు, వయోవృద్ధులకు ఉచిత దర్శనం కోసం మధ్యాహ్నం 3 గంటలకు దర్శనం టోకెన్లు విడుదల చేయనున్నారు (ఆన్లైన్లో)
- ఇది కూడా చదవండి : Palani Temple : పళని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం గైడ్ ! 10 Facts
జూలై 24వ తేదీన…
ఈ తేదీన ఉదయం 10 గంటలకు ప్రత్యేక దర్శనం కోటాను ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
- తిరుపతి, తిరుమలలో గదులకు (TTD Rooms Quota October 2025) సంబంధించిన కోటాను మధ్యాహ్నం 3 గంటకు ఆన్లైన్లో విడుదల చేస్తారు.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.