క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా హైదరాబాద్ నుంచి ముంబైకి స్పెషల్ ట్రైన్లు | Hyderabad Mumbai Christmas New Year Special Trains
క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్కి హైదరాబాద్-ముంబై మధ్య స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. టైమింగ్, స్టాప్స్, కోచులుచ టిప్స్ ఫుల్ సమాచారం (Hyderabad Mumbai Christmas New Year Special Trains)
క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ హాలిడేస్కి హైదరాబాద్-ముంబై మధ్య స్పెషల్ ట్రైన్లు ప్రకటించింది దక్షిణ మధ్య రైల్వే. టైమింగ్, స్టాప్స్, కోచులుచ టిప్స్ ఫుల్ సమాచారం (Hyderabad Mumbai Christmas New Year Special Trains)
క్రిస్మస్, న్యూ ఇయర్ హాలిడేస్ టైమ్‌లో ప్రయాణికుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. దీనిని గమనించిన సౌత్ సెంట్రల్ రైల్వే (South Central Railway) ప్రత్యేక రైళ్లను (Hyderabad Mumbai Christmas New Year Special Trains) ప్రకటించింది.
ఈ ట్రైన్లు హైదరాబాద్ నుంచి ముంబైలోని లోకమాన్య తిలక్ టెర్మినస్ (Lokmanya Tilak Terminus – LTT) వరకు నడుస్తాయి. ఇయర్ ఎండ్‌లో ట్రావెల్ చేయాలని భావిస్తున్న వారికి ఈ కింది విషయాలు బాగా ఉపయోగపడతాయి.
ముఖ్యాంశాలు
తెలుసుకోవాల్సిన విషయాలు | Christmas & New Year Special Trains – Key Details

హైదరాబాద్ – ముంబై మధ్యలో రెండు ప్రత్యేక ట్రైన్ (Indian Railways) సర్వీసులను ప్రకటించారు.
అందులో మొదటిది…
Train No. 07458 | ఇది హైదరాబాద్ నుంచి ముంబైకి (LTT Mumbai) 2025 డిసెంబర్ 28వ తేదీన సాయంత్రం 5.30 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 10.40 గంటలకు ముంబై చేరుకుంటుంది.
ఇక రెండవ ట్రైన్ వచ్చేసి…
Train No. 07459 | ఇది ముంబై (LTT Mumbai) నుంచి హైదరాబాద్‌కు 2025 డిసెంబర్ 29వ తేదీన మధ్యాహ్నం 3.20 గంటలకు బయల్దేరి మరుసటి రోజు ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఏ స్టేషన్లో ఆగుతాయి? | Stopping Stations
ఈ స్పెషల్ ట్రైన్లు బేగంపేట్, లింగంపల్లి, వికారాబాద్, తాండూరు, వాడి, కలబుర్గి, షోలాపూర్, పుణే, కల్యాణ్ స్టేషన్లలో ఆగుతాయి. హైదరాబాద్ నుంచి వెళ్లే ప్రయాణికులకు బేగంపేట్, లింగంపల్లి స్టాపులు ఉండటం మేజర్ అడ్వాంటేజ్ అని చెప్పవచ్చు.
కోచుల వివరాలు | Coach Details
ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ స్పెషల్ ట్రైన్లలో 1AC, 2AC, 3AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచులు ఉంటాయి. అంటే AC, Sleeper, General అన్నీ కేటగిరీ ప్రయాణికులకు కోచులు అందుబాటులో ఉంటాయి అన్నమాట.
Prayanikudu Practical Tips
ఈ ట్రైన్లు లిమిటెడ్ తేదీల్లో మాత్రమే నడుస్తాయి, కాబట్టి టికెట్లు ఎర్లీగా బుక్ చేసుకోవడం మంచిది. క్రిస్మస్, న్యూ ఇయర్ సీజన్లో వెయిటింగ్ లిస్ట్ వేగంగా మూవ్ అవుతుంది. IRCTC లో Train No. 07458 / 07459 సెర్చ్ చేసి లైవ్ స్టేటస్ చెక్ చేయండి.
- చివరి నిమిషంలో ప్రయాణించే వారు జనరల్ కోచుల్లో ఎక్కువ రష్ ఉంటుంది.
- కాబట్టి దానికి తగినట్టు ప్లాన్ చేయండి.
- పండగల సమయంలో స్పెషల్ ట్రైన్స్ గురించి ముందే తెలుసుకుంటే ట్రావెల్ స్ట్రెస్ తగ్గుతుంది.
- రైల్వే అనౌన్స్మెంట్స్ ఫాలో అవుతూ, ప్రాక్టికల్ ప్లానింగ్‌తో ప్రయాణించండి.
- మీరు వెళ్లే సమయంలో రిటర్న్ టికెట్ బుక్ చేసుకోండి. అంటే ఒకే సమయంలో రెండూ బుక్ చేసుకోండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
