హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో తెలంగాణలో ఒక జైపూర్ | Jaipur In Telangana Travel Guide 2025
తెలంగాణలో కూడా ఒక జైపూర్ ఉందా? అవును. బట్ ఇది రాజస్థాన్ జైపూర్ కాదు. మంచిర్యాల జిల్లాలో ఉన్న ఆఫ్ బీట్ టౌన్ జైపూర్ కంప్లీట్ ట్రావెల్ క్లారిటీ గైడ్ ఇది. Jaipur In Telangana Travel Guide 2025…
Jaipur In Telangana Travel Guide : హైదరాబాద్‌కు 245 కిమీ దూరంలో తెలంగాణలో ఉన్న జైపూర్ గురించి రియల్ ఫ్యాక్ట్స్. పూర్తి ట్రావెల్ క్లారిటీ, దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు, ప్లానింగ్…
జైపూర్ (Jaipur) అంటే ముందుగా మనకు రాజస్థాన్ (Rajasthan) గుర్తొస్తుంది కదా. అక్కడి గులాబీ రంగు భవనాలు, రాజ మందిరాలు, కోటలు ఇవన్నీ కళ్ల ముందు కదలాడుతాయి. కానీ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే తెలంగాణలో (Telangana) కూడా ఒక జైపూర్ అనే పట్టణం ఉంది.
అదే మంచిర్యాల జిల్లాలో ఉన్న జైపూర్ మండలం. ఇది హైదరాబాద్ (Hyderabad) నుంచి 245 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.
ముఖ్యాంశాలు
ఈ పోస్టు ఎందుకు అంటే..
అయితే ఈ పోస్టు పబ్లిష్ చేయడానికి కారణాలు చాలా సింపుల్…ఆ జైపూర్ – ఈ జైపూర్ మధ్య కన్ఫ్యూజన్ను దూరం చేయడం.. దీనిపై క్రియేట్ అయ్యే హైప్‌ను ఎవాయిడ్ చేయడం… పర్యాటకులకు (travellers) ఈ ప్రదేశం సెట్ అవుతుందో లేదో క్లారిటీ ఇవ్వడం.
- ఇది కూడా చదవండి : రామప్ప ఆలయం గురించి తెలుగు వారు తప్పకుండా ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే
ముందుగా క్లారిటీ విషయానికి వస్తే…ఇది రాజస్థాన్‌లోని జైపూర్ కాదు. ఇది టూరిస్టు హాట్ స్పాట్ కాదు.
రోజంతా స్పెండ్ చేయాల్సినంత ఇంపార్టెంట్ టూరిస్ట్ డెస్టినేషన్ కాదు.
ఇది చాలా ఆఫ్‌బీట్ , తక్కువ మందికి తెలిసిన పట్టణం.
ఒకవైపు పరిశ్రమలు, మరోవైపు నేచర్ రెండూ కలిసిన ప్రాంతం ఇది.
తెలంగాణ జైపూర్ గురించి… | Jaipur Telangana – Quick Facts
ఇది తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో ఉన్న పట్టణం. హైదరాబాద్ నుంచి 245 కిమీ దూరంలో ఉంటుంది
రోడ్డు మార్గంలో అయితే 4–5 గంటలు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. పర్యాటకుల రద్దీ చాలా చాలా తక్కువ ఇతర టూరిస్ట్ ప్రాంతాలతో పోల్చితే పర్యాటకులకు సదుపాయాలు తక్కువగా ఉంటాయి.

ఈ జైపూర్ ప్రత్యేకత ఏంటి? | What Makes Telangana Jaipur Different
రాజస్థాన్ జైపూర్‌లో కోటలు, రాజమందిరాలు ఉంటాయి. కానీ ఈ జైపూర్‌లో పవర్ ప్లాంట్స్, అడవులు, నదులు ఉంటాయి. ఇది తెలంగాణ కోల్ బెల్ట్ లో భాగం. సింగరేణి మైనింగ్ ప్రాంతం.
ప్రాణహిత – గోదావరి రివర్ బేసిన్ పరిసరాలు ఉంటాయి. ఒకవైపు పచ్చదనం, మరోవైపు భారీ పరిశ్రమలు
ప్రశాంతమైన రహదారులు వెరసి ప్రశాంతమైన వాతావరణం, డిఫరెంట్ లాండ్స్కేప్ ఉంటుంది.
జైపూర్ సమీపంలో చూడాల్సినవి | Places To Explore Near Telangana Jaipur
గమనిక: ఇవి జైపూర్ పట్టణం మధ్యలో ఉన్న స్పాట్స్ కావు. వీటిని చూడాలంటే సొంత వాహనం లేదా ట్యాక్సీలో కొంత దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. ఇవి నడిచి వెళ్లే దూరంలో లేవు.
1. సింగరేణి థర్మల్ పవర్ ప్రాజెక్ట్ | Singareni Thermal Power Project
జైపూర్ పట్టణం నుంచి సుమారు 4 కిమీ దూరంలో ఉంటుంది. భారీ కూలింగ్ టవర్స్, ప్లాన్ చేసిన సింగరేణి టౌన్షిప్ చూడొచ్చు. పరిశ్రమల పక్కనే వ్యవసాయ భూములు చూడాలనుకునే వారికి ఇది ఆసక్తికరం. 20–30 నిమిషాలు సరిపోతాయి.
2. గాంధారీ కోట | Gandhari Fort
దీనిని Gandhari Khilla అని కూడా పిలుస్తారు. జైపూర్ నుంచి సుమారు 25 కిమీ దూరం. ఒక గంట డ్రైవ్. అడవి, కొండపై శిథిలాలు, చిన్న ట్రెక్కింగ్, ఫోటోగ్రఫీకి బాగుంటుంది. సాయంత్రం సమయంలో వెళ్లకండి.
- ఇది కూడా చదవండి : రామప్ప నుంచి లక్నవరం వరకు.. Mulugu District Top 8 Tourist Spots
3. శివరామ్ మొసళ్ల అభయారణ్యం | Shivaram Crocodile Sanctuary
గోదావరి నది తీరంలో ఉన్న అభయారణ్యం. జైపూర్ నుంచి సుమారు 30 కిమీ. వెళ్లే ముందు స్థానికులు లేదా అధికారులను అడిగి, వెళ్లొచ్చా లేదా అనే విషయంపై క్లారిటీ తీసుకోండి.
జైపూర్ ఎలా చేరుకోవాలి? | How To Reach Jaipur (Mancherial)
రోడ్డు మార్గంలో హైదరాబాద్ నుంచి NH-63 ద్వారా జైపూర్ చేరుకోవచ్చు. సుమారు 4–5 గంటలు పడుతుంది. రహదారులు బాగుంటాయి, ట్రాఫిక్ తక్కువ.
ట్రైన్ మార్గంలో వస్తే దగ్గర్లోని మంచిర్యాల రైల్వే స్టేషన్ నుంచి జైపూర్ 18 కిమీ దూరం.
ప్లాన్ చేసే ముందు … | Planning Reality & Crowd Intelligence
- అక్టోబర్ నుంచి ఫిబ్రవరి బెస్ట్ టైమ్
- వీకెండ్స్‌లో కూడా రద్దీ తక్కువ
- వీక్‌డేస్‌లో దాదాపు రద్దీ ఉండదు
- పార్కింగ్ సమస్య ఉండదు
- స్థానిక భోజనం బేసిక్
- నీటి బాటిల్ తీసుకెళ్లండి
- మొబైల్ నెట్వర్క్ బాగుంటుంది
- నైట్ లైఫ్ లేదా ఎంటర్టైన్మెంట్ జోన్స్ లేవు
- కుటుంబంతో వెళ్లవచ్చు, కానీ భారీ అంచనాలు పెట్టుకోకండి
- వయసులో పెద్దవాళ్లు గాంధారీ కోటను ఎవాయిడ్ చేయడం మంచిది
మొత్తానికి జైపూర్ అనే పేరు వల్ల క్యూరియాసిటీ కలగవచ్చు. కానీ ఇది టూరిస్ట్ హాట్ స్పాట్ కాదు అనే విషయం గుర్తుంచుకోండి.
- ఇది కూడా చదవండి : 3 రోజుల్లో రాజస్థాన్ రాయల్ ట్రిప్ ఎలా పూర్తి చేయాలి ? | Jaisalmer Desert Triangle Itinerary
సాధారణ ప్రశ్నలు | FAQs Jaipur In Telangana Travel Guide 2025
జైపూర్ పర్యాటక ప్రదేశమా?
ఆఫ్‌బీట్ ప్లేసెస్ ఇష్టమైతే వెళ్లండి, లేదంటే స్కిప్ చేయండి
ఒక్కరోజు ట్రిప్ చేయవచ్చా?
టెక్నికల్‌గా చేయొచ్చు. వీకెండ్ బెటర్
హోటల్స్ ఉంటాయా?
తక్కువే. మంచిర్యాలలో మంచి ఆప్షన్స్ ఉంటాయి
ఈ జైపూర్ ఎందుకు వెళ్లాలి?
పరిశ్రమలు + పర్యావరణం కలిసిన డిఫరెంట్ లొకేషన్ చూడటానికి
మీరు రాజస్థాన్ జైపూర్‌లాంటి వైభవం ఆశిస్తే నిరాశపడవచ్చు. కానీ సైలెంట్ రోడ్స్, కొత్త ల్యాండ్‌స్కేప్, పరిశ్రమలు పచ్చదనం పక్కపక్కనే చూడాలంటే తెలంగాణ జైపూర్ (Telangana Jaipur) నచ్చే అవకాశం ఉంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
