హైదరాబాద్‌లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్: ఎప్పుడు వెళ్లాలి? ఏం చూడాలి? | Hyderabad Hot Air Balloon Festival Guide
Hyderabad Hot Air Balloon Festival Guide : హైదరాబాద్‌లో ప్రతిష్మాత్మకంగా జరిగే హాట్ ఎయిర్ బెలూన్ పెష్టివల్కు ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇవన్నీ క్లియర్‌గా తెలియాలంటే ఈ ఫస్ట్ టైమ్ విజిటర్ గైడ్ మీ కోసం.
హైదరాబాద్‌లో సంక్రాంతి సెలబ్రేషన్స్ అంటే కేవలం గాలిపటాలకు మాత్రమే పరిమితం కాదు. ఈ సంవత్సరం తెలంగాణ టూరిజం శాఖ సంక్రాంతి వైబ్‌ను నెక్స్ట్ లెవల్‌కు తీసుకెళ్లింది. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్‌తో నగరవాసులను అలరించేందుకు అన్ని ఏర్పాట్లు చేసింది.
ఈ ఫెస్టివల్‌కు ఎలా వెళ్లాలి? ఎప్పుడు వెళ్లాలి? ఏం ఎక్స్పెక్ట్ చేయాలి? ఇవన్నీ క్లియర్‌గా తెలియాలంటే ఈ ఫస్ట్ టైమ్ విజిటర్ గైడ్ మీ కోసం.
- హైదరాబాద్‌ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసందుకు క్లిక్ చేయండి.
ముఖ్యాంశాలు
ఈ ఈవెంట్ గురించి బేసిక్ విషయాలు | Event Overview
వేదిక: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్
తేదీలు: 2026 జనవరి 16 నుంచి జనవరి 18 వరకు
బెలూన్ టైమింగ్స్: సాయంత్రం 5 నుంచి 6 వరకు
ఎంట్రీ: ఉచితం, ఎలాంటి టికెట్ అనౌన్స్ చేయలేదు
నిర్వహించేది: తెలంగాణ టూరిజం విభాగం
ఇక్కడ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, బెలూన్ యాక్టివిటీ అనేది సమయం, సందర్భం, వాతావరణాన్ని బట్టి మారే అవకాశం ఉంటుంది. అన్ని అనుకూలంగా ఉంటే ముందుగా అనుకున్న విధంగానే ఈవెంట్ కొనసాగుతుంది.
బెలూన్ ఫెస్టివల్లో ఏం చేయొచ్చు?

ముందుగా ఒక విషయం చెప్పాలి. ఇది ఫుల్ బెలూన్ రైడ్ ఎక్స్‌పీరియెన్స్ కాదు.
గ్రౌండ్లో జరిగేది ఇలా ఉంటుంది:
- హాట్ ఎయిర్ బెలూన్ ఇన్ఫ్లేషన్ (వెలిగించే) ప్రక్రియ
- బెలూన్ కాసేపు పైకి లేవడం
- సేఫ్టీ కారణాల వల్ల చిన్నపాటి మూమెంట్స్ మాత్రమే
అయితే ప్రధాన ఆకర్షణలు మాత్రం ఇవే:
బెలూన్ ఇన్ఫ్లేషన్ ప్రక్రియను చూడటం, బెలూన్ కింది భాగంలో మంటను గమనించడం, ఆ తర్వాత అది సాయంత్రం సమయంలో ఆకాశంలో కనిపించే అందం చూడటమే అసలైన మజా.
దీనిని ఒక అడ్వెంచర్ రైడ్‌లా కాకుండా ఒక విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా చూస్తే మంచి ఫీల్ కలుగుతుంది. నేను హాట్ ఎయిర్ బెలూన్ రైడ్‌ను కులు–మనాలిలో చూశాను. చాలా కాస్ట్లీ కావడంతో ట్రై చేయలేదు. కానీ చూడటం మాత్రం చూశాను.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
Best Time | ఎప్పుడు వెళ్లాలి?
మీ విజిట్ విజయవంతం కావాలంటే సాయంత్రం 4:30 నుంచి 4:45 మధ్యలో పరేడ్ గ్రౌండ్ చేరుకోవడం మంచిది.
- సూర్యాస్తమయం సమయానికి బెలూన్ ఇన్ఫ్లేషన్ ప్రక్రియ మొదలవుతుంది
- సాయంత్రం 6 తర్వాత బెలూన్ యాక్టివిటీ దాదాపు పూర్తవుతుంది
- లేట్‌గా వెళ్తే బెలూన్లు నేలపైకి దిగిపోయే అవకాశం ఉంటుంది
అప్పుడు మెయిన్ ఈవెంట్ మిస్ అవుతుంది.
ఫోటోగ్రఫీ, వీడియోగ్రఫీ చిట్కాలు | Photography & Video Tips
మీరు ఫోటోలు లేదా వీడియోల కోసమే ఈవెంట్‌కు వెళ్లాలనుకున్నా, లేదా మంచి కంటెంట్ తీయాలనుకున్నా ఇలా ట్రై చేయండి:
- బెలూన్ ఇన్ఫ్లేషన్ స్టేజ్‌ను మిస్ అవ్వకండి
- 5:15 నుంచి 5:40 మధ్య సూర్యాస్తమయం విజువల్స్ బాగుంటాయి
- వైడ్ యాంగిల్ షాట్స్ క్లోజప్ షాట్స్ కంటే బెటర్
- నైట్ విజువల్స్ లైటింగ్‌పై ఆధారపడి ఉంటాయి, ఫుల్ నైట్ షో ఎక్స్పెక్ట్ చేయకండి
- సందర్శకుల నుంచి కొంచెం దూరంగా తీసే షాట్స్‌లో మొత్తం బెలూన్ బాగా కవర్ అవుతుంది
క్రౌడ్, పార్కింగ్
పరేడ్ గ్రౌండ్లో జరిగే ఈ ఈవెంట్ గ్రౌండ్ రియాలిటీ ఇలా ఉంటుంది:
- జనవరి 16, 17 తేదీల్లో రష్ ఎక్కువగా ఉండే అవకాశం
- పరేడ్ గ్రౌండ్ దగ్గర పార్కింగ్ లిమిటెడ్
- పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా డ్రాప్-ఆఫ్ బెస్ట్ ఆప్షన్
- సాయంత్రం సమయంలో పోలీస్ బ్యారికేడ్స్ వల్ల మూమెంట్ నెమ్మదిస్తుంది
పిల్లలు లేదా పెద్దలతో వస్తే బఫర్ టైమ్ యాడ్ చేసుకుని ప్లాన్ చేసుకోవడం మంచిది.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
ఈ ఈవెంట్ ఎవరికి సెట్ అవుతుంది?
హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ అనేది
ఫ్యామిలీస్‌కి, పిల్లలతో ఔటింగ్ ప్లాన్ చేస్తున్నవారికి, ఫస్ట్ టైమ్ ఫెస్టివల్ విజిట్ చేస్తున్నవారికి, క్యాజువల్ సంక్రాంతి ఈవినింగ్ ప్లాన్ చేసేవారికి బాగా సెట్ అవుతుంది.
వీరికి సెట్ అవ్వదు:
లాంగ్ హాట్ ఎయిర్ బెలూన్ రైడ్ ఎక్స్పెక్ట్ చేసే వాళ్లకు, అడ్వెంచర్ థ్రిల్ సీకర్స్కి, అలాగే సాయంత్రం 6 తర్వాత ఈవెంట్‌కు వెళ్లేవారికి ఇది అంతగా సెట్ అవ్వదు.
మంగ్లీ లైవ్ సింగింగ్ | Mangli Live Singing
బెలూన్ ఫెస్టివల్‌తో పాటు:
- ఫుడ్ స్టాల్స్
- హ్యాండ్లూమ్, హ్యాండీక్రాఫ్ట్ స్టాల్స్
- మ్యూజిక్ లైవ్ సింగింగ్ షోలు
ఓవరాల్‌గా గంట నుంచి గంటన్నర సమయం వెచ్చించి మంచి ఔటింగ్లా ప్లాన్ చేసుకోవడం బెటర్.
వెళ్లడం అంత వర్తా?
మీరు ఈ ఈవెంట్‌ను సంవత్సరానికి ఒకసారి వచ్చే విజువల్ ఎక్స్‌పీరియెన్స్‌లా చూస్తే తప్పకుండా వెళ్లాల్సిన ఈవెంట్.
కానీ ఫుల్ రైడ్ ఎక్స్పెక్ట్ చేస్తే, టైమ్‌కు చేరుకోలేమనిపిస్తే, లేదా షార్ట్ అండ్ స్వీట్ ఔటింగ్లా ప్లాన్ చేయలేకపోతే ఇది సెట్ అవ్వకపోవచ్చు.
అయితే వెళ్లితే మాత్రం హైదరాబాద్ సంక్రాంతి సెలబ్రేషన్స్‌లో ఈ వేడుక ఒక ఎవర్గ్రీన్ మెమరీగా మిగిలిపోతుంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. ఉదాహరణకు : Warangal Prayanikudu ఇలా వెతకండి… తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
