Mont Saint Michel : సముద్రం మధ్యలో కలల కోటలా కనిపించే ప్రాచీన ద్వీపం
Mont Saint Michel : ఫ్రాన్స్‌లో ఉన్న మోంట్ సెయింట్ మిషెల్ అనే ప్రాచీన ద్వీపం సముద్రం మధ్యలో ఒక అద్భుత కలల కోటలా కనిపిస్తుంది. హై టైడ్ వచ్చినప్పుడు ఈ ద్వీపం చుట్టూ మొత్తం నీటితో నిండిపోతుంది. లో టైడ్ సమయంలో రోడ్డు బయటికి కనిపిస్తుంది. ఇది నేచర్ క్రియేట్ చేసిన మ్యాజిక్‌లానే అనిపిస్తుంది.
మిడీవల్ స్టైల్లో నిర్మించిన అబ్బే (మఠం), నారో స్టోన్ స్ట్రీట్స్, చిన్న కేఫేలు అన్నీ కలిసి మోంట్ సెయింట్ మిషెల్‌ను ఒక ఫెయిరీ టేల్ లొకేషన్లా మార్చేస్తాయి.
ట్రావెల్ లవర్స్‌కు ఇది ఒక డ్రీమ్ డెస్టినేషన్. ఉదయం వేళలో ఫాగ్ మధ్య కనిపించే మోంట్ సెయింట్ మిషెల్ ఆశ్రమం, సూర్యాస్తమయం సమయంలో గోల్డెన్ లైట్ సముద్రంపై రిఫ్లెక్ట్ అవ్వడంచాలా మెస్మరైజింగ్ ఎక్స్‌పీరియెన్స్. ఫోటోగ్రఫీ లవర్స్‌కు కూడా ఇది పర్ఫెక్ట్ స్పాట్.
- ఇది కూడా చదవండి : Chandaki Village: ఆ ఊర్లో ఎవరూ వంట చేయరు… కానీ ఎవరు ఆకలితో ఉండరు
Mont Saint – Michel, France
— 𝕏 Travels, Hotels and Resorts (@em3dia) January 29, 2026
🎥marinewanders I IG pic.twitter.com/q3yZTpB4l1
హైదరాబాద్ నుండి ఎలా చేరుకోవాలి? | Hyderabad nundi Ela Reach Avvali?
హైదరాబాద్ నుండి Paris కి డైరెక్ట్ లేదా కనెక్టింగ్ ఫ్లైట్స్ తీసుకోవాలి. ప్యారిస్ చేరుకున్న తర్వాత ట్రైన్లో
- Rennes లేదా
- Pontorson వరకు వెళ్లాలి.
Rennes బ్రిట్టనీ ప్రాంత రాజధాని కాగా, Pontorson మోంట్ సెయింట్ మిషెల్‌కు అత్యంత సమీప రైల్వే స్టేషన్.
అక్కడి నుండి షటిల్ బస్సుల ద్వారా మోంట్ సెయింట్ మిషెల్ చేరుకోవచ్చు.
హైదరాబాద్ నుంచి ఈ ప్రదేశానికి చేరుకోవడానికి సుమారు 14 నుంచి 18 గంటల ప్రయాణ సమయం పడుతుంది (ఫ్లైట్ లేయోవర్స్పై ఆధారపడి ఉంటుంది.ఈ మ్యాజికల్ ఐలాండ్‌లో హిస్టరీ, నేచర్, ఆర్కిటెక్చర్ అన్నీకలిసి ఒక మరుపురాని ప్రయాణ అనుభూతిని మిగుల్చుతాయి.
మరిన్ని ట్రావెల్ స్టోరీస్ కోసం
First Telugu Travel Knowledge Website 👉 www.prayanikudu.com ను ఫాలో అవ్వండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
