Coonoor : ఫాస్ట్ లైఫ్ నుండి బ్రేక్ కావాలా? కూనూర్ వెళ్లండి
Coonoor : కూనూర్‌లో ఉదయం అనగానే పచ్చని టీ తోటలపై తొలి మంచు నిదానంగా తిరుగుతుంది. గాలులు చల్లగా, ఫ్రెష్‌గా వీస్తాయి. ప్రతీ ఆకుపై ఉండే తడి ఒక కొత్త అనుభవాన్ని ఇస్తుంది. ఇక్కడి నేచర్ రీఫ్రెష్ బటన్లాంటి ఫీల్ ఇస్తుంది. మార్నింగ్ వాక్స్‌లో ఈ ఫ్రెష్‌నెస్ ఇంకా ఎక్కువగా అనిపిస్తుంది.
టీ తోటల మధ్య ఉదయం | Tea Estates In Coonoor
టీ గార్డెన్స్ మధ్య నడుస్తూ ఉంటే అన్ని వైపులా పచ్చని రంగుల లేయర్స్ కనిపిస్తాయి. వర్కర్స్‌ను నిదానంగా టీ లీవ్స్ సేకరిస్తూ ఉండడం చూస్తే ఆ దృశ్యం ఒక డాక్యుమెంటరీలా అనిపిస్తుంది. చిన్న దారుల్లో నడిచే ప్రతీ స్టెప్‌లో సైలెన్స్ , ప్రకృతి మధ్య ఒక కనెక్షన్ కలుగుతుంది. ఇక్కడ టైమ్ స్లోగా మూవ్ అవుతుందనే భావన కలుగుతుంది.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్‌లో అదిరిపోయే కొరియన్ రుచులు.. ఐటీసీ వద్ద రూ.200కే నోరూరించే స్ట్రీట్ ఫుడ్
నీలగిరి పర్వతాల రిథమ్ | Nilgiri Mountains
నీలగిరి పర్వతాల మధ్య నడుస్తూ ఉంటే ప్రతీ టర్న్‌లో ఒక కొత్త దృశ్యం కనిపిస్తుంది. చిన్న రైలుమార్గాలు, వుడెన్ హౌసెస్, వీటితో పాటు ప్రకృతి.. ఇవన్నీ ఒక ప్రశాంతమైన జీవితం ఎలా ఉండాలో లైవ్‌లో చూపిస్తాయి. కొన్ని ప్రదేశాల నుండి వ్యాలీస్ చూస్తే మేఘాలు కింద తిరుగుతున్నట్టుగా కనిపిస్తాయి. ఆ అనుభవం మరింత మేజికల్‌గా ఉంటుంది.
Was working from this location of Coonoor last full week,that came to an end today… Tamilnadu is indeed blessed with lush greenery.
— Pawan Arora (@pawanaroraleo) October 2, 2022
Bangalore/coimbatore national highway is too good with great scenic views. pic.twitter.com/hesfHriFQl
హైదరాబాద్ నుండి ప్రయాణం | How To Travel From Hyderabad
హైదరాబాద్ నుండి ముందుగా కోయంబత్తూరు వరకు ఫ్లైట్ లేదా ట్రైన్లో చేరుకుని, అక్కడి నుండి రోడ్ మార్గంలో కూనూర్‌కి చేరుకోవచ్చు. ఆ ఘాట్ రోడ్స్‌లో తిరుగుతూ వెళ్తే పర్వత దృశ్యాలు ప్రయాణాన్ని నిధానంగా, ఆనందంగా మార్చేస్తాయి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
