Warangal One Day Trip : హైదరాబాద్ నుంచి వరంగల్ వన్ డే ట్రిప్ ..భద్రకాళి టెంపుల్ అండ్ వరంగల్ ఫోర్ట్
Warangal One Day Trip : హైదరాబాద్, విజయవాడ నుంచి వరంగల్ భద్రకాళి టెంపుల్, వరంగల్ ఫోర్ట్ ని ఒక్క రోజులో ఎలా చూడాలి? టైమింగ్స్, రూట్, ఫుడ్, స్టే తో సహా పూర్తి సమాచారం.
వరంగల్ అంటేనే కాకతీయుల గుండెకాయ లాంటిది. ఇక్కడ ఉదయాన్నే భద్రకాళి అమ్మవారి దర్శనం చేసుకుని, సాయంత్రం వరంగల్ కోటలో కాకతీయ కళా తోరణం ముందు నిలబడి ఫోటో దిగితే ఆ కిక్కే వేరు. ఈ రెండు ప్రదేశాల మధ్య దూరం 7 కిలోమీటర్లే, అందుకే చాలా మంది ఒకటి లేదా రెండు రోజుల్లో వరంగల్‌ను కవర్ చేసేలా ప్లాన్ చేస్తుంటారు. అలాంటి వారికి ఈ పోస్టు ఉపయోగపడుతుంది.
దర్శన సమయాలు, ఎంట్రీ ఫీజు | Darshan Timing, Entry Fee
భద్రకాళి టెంపుల్ చాలా పురాతనమైనది. 625 లో రెండవ పులకేశి కట్టించాడని చరిత్ర చెబుతోంది. అనంతరం కాకతీయులు అమ్మవారిని తమ కులదైవంగా కొలిచారు. ఇక్కడ 2.7 మీటర్ల ఎత్తున్న ఏకశిలా విగ్రహం ఉంటుంది.
- దర్శన వేళలు ఉదయం 5:30 నుంచి మధ్యాహ్నం 1:00 వరకు
- తిరిగి సాయంత్రం 3:00 నుంచి రాత్రి 8:30 వరకు.
- లోపల ఫోటోలు తీయకూడదు, దర్శనానికి టికెట్ లేదు.
- ఇది కూడా చదవండి : Simhachalam : సింహాచలం దర్శనం, చరిత్ర, ఎలా చేరుకోవాలి, ఖర్చు, దగ్గర్లో చూడాల్సిన ప్రదేశాలు
వరంగల్ ఫోర్ట్ (Warangal Fort Timing
ఇది 13వ శతాబ్దంలో గణపతి దేవుడు కట్టించిన కోట. తెలంగాణ ఎంబ్లెమ్ (రాజముద్ర, అధికారిక చిహ్నం) లో కనిపించే కళా తోరణాలు ఇవే.
- టైమింగ్స్ ఉదయం 9:00 నుంచి సాయంత్రం 7:00 వరకు
- ఎంట్రీ టికెట్ ఇండియన్స్ కి రూ.15, ఫారినర్స్ కి రూ.200.
హైదరాబాద్, విజయవాడ నుంచి ఎలా వెళ్లాలి? | Hyderabad To Warangal Trip Guide
హైదరాబాద్ నుంచి వరంగల్ దూరం బైరోడ్డు డిస్టెన్స్ వచ్చి 151 కిలోమీటర్లు. ట్రైన్ అయితే 3 గంటల్లో చేరుకోవచ్చు. సికింద్రాబాద్ నుంచి ఉదయం 5 గంటలకు బయలుదేరే ట్రైన్ ఎక్కితే 7:30 కల్లా వరంగల్ లో ఉంటారు.
- బస్సులో అయితే JBS నుంచి TSRTC బస్సులో 4 గంట్లో చేరుకోవచ్చు.
- కారులో అయితే NH163 మీద డ్రైవ్ చాలా బాగుంటుంది.
విజయవాడ నుంచి వరంగల్ కి ట్రైన్ దూరం 208 కిలోమీటర్లు. ట్రైన్ లో 4 గంటలు, బస్సులో అయిదున్నర గంటలు పడుతుంది. ఈ రూట్ లో రోజూ 35 ట్రైన్స్ తిరుగుతాయి కాబట్టి రిటర్న్ కి కూడా ఇబ్బంది ఉండదు.
దగ్గరలో ఉన్నవి (Places Near Warangal): వరంగల్ రైల్వే స్టేషన్ గుడికి 5 KM, వరంగల్ సెంట్రల్ బస్ స్టాండ్ కూడా 5 KM దూరంలోనే ఉంటాయి. దగ్గరి ఎయిర్ పోర్ట్ హైదరాబాద్ RGIA, 173 KM దూరం.
ఎక్కడ ఉండాలి, ఏం తినాలి? | Food and Accommodation
వన్ డే ట్రిప్ అయినా నైట్ స్టే చేయాలనుకుంటే హనుమకొండలో హరిత (Hanmakonda Haritha Hotel) కాకతీయ హోటల్ బెస్ట్ ఆప్షన్. ప్రైవేట్ లో రత్న హోటల్, సుప్రభ హోటల్ కూడా బడ్జెట్ లో వస్తాయి.
Warangal Food వియానికి వస్తే నాన్ వెజ్ ప్రియులు వరంగల్ లో బోటి కర్రీ, జొన్న రొట్టె అస్సలు మిస్ అవ్వద్దు. అయితే గుడికి వెళ్లేప్పుడు చాలా మంది నాన్‌వెజ్ తినరు కాబట్టి లోకల్ వెజ్ ఆప్షన్స్ ట్రై చేయవచ్చు. ఇక్కడి సకినాలు (Sakinalu) కూడా చాలా ఫేమస్.
గుడి దగ్గర చిన్న టిఫిన్ సెంటర్లు, ఫోర్ట్ దగ్గర ఫుడ్ కోర్ట్ ఉంటుంది. ఒక ఆటో మాట్లాడుకుంటే రోజుకి రూ.800 నుంచి 1000 తీసుకుని రెండు ప్లేసులు చూపిస్తారు.
స్పెషల్ ఈవెంట్స్, చుట్టుపక్కల చూడాల్సినవి | Events in Warangal Bhadrakali Temple
ప్రతీ సంవత్సరం ఈ ఆలయంలో కొన్ని ప్రత్యేక వేడుకలు జరుగుతాయి. చైత్ర మాసంలో 12 రోజుల బ్రహ్మోత్సవాల (Warangal Bhadrakali Brahmhostavalu) సమయంలో 5 లక్షల మంది వరకు వస్తారు.
ఆషాఢ మాసంలో శాకంబరీ ఉత్సవం, దసరా టైం లో శరన్నవరాత్రులు, బతుకమ్మ పండుగకి భద్రకాళి చెరువు దగ్గర చాలా సందడిగా ఉంటుంది.
టైం ఉంటే వెయ్యి స్తంభాల గుడి (1000 Pillar Temple-12 KM), పద్మాక్షి టెంపుల్, వరంగల్ జూ, మ్యూజికల్ గార్డెన్ చూడొచ్చు. 70 KM వెళ్తే UNESCO సైట్ అయిన రామప్ప టెంపుల్ (Ramappa Temple Guide)కూడా కవర్ చేయొచ్చు.
గమనిక: ఈ బ్లాగ్ లోని సమయాలు, టికెట్ ధరలు, దూరాలు అధికారిక టూరిజం, రైల్వే సోర్సెస్ నుంచి సేకరించినవి. ప్రయాణానికి ముందు ఒకసారి చెక్ చేసుకోగలరు.
