డిసెంబర్ 2026 తిరుమల దర్శనం, గదుల కోటా విడుదల తేదీలు | Tirumala Darshan Quota
Tirumala Darshan Quota : డిసెంబర్ 2026 తిరుమల దర్శనం, ఆర్జిత సేవలు, ప్రత్యేక ప్రవేశ దర్శనం, వసతి గదుల కోటా ఏ తేదీల్లో విడుదలవుతుందో పూర్తి వివరాలు తెలుసుకోండి.
డిసెంబర్ 2026లో తిరుమల శ్రీవారి దర్శనం (Tirumala Darshan), ఆర్జిత సేవలు (Arjitha Sevas), వసతి (Accommodation) కోసం ప్లాన్ చేస్తున్న భక్తులకు టీటీడీ (TTD) కీలక ప్రకటన చేసింది.
డిసెంబర్ నెలకు సంబంధించిన వివిధ దర్శనాలు, సేవలు, గదుల కోటాను సెప్టెంబర్ 19 నుంచి 24వ తేదీ మధ్య దశలవారీగా ఆన్లైన్లో విడుదల చేయనుంది. ఏ టికెట్ ఎప్పుడు వస్తుంది? ఎలక్ట్రానిక్ డిప్ ఎప్పుడు ఉంటుంది? గదుల బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది? అనే విషయాల్లో ముందుగానే తేదీలు తెలుసుకోవడం వల్ల భక్తులు తమ తిరుమల ప్రయాణాన్ని సులభంగా ప్లాన్ చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారికి రోజూ 45 రకాల నైవేద్యాలు.. పేర్లు వింటే ఆశ్చర్యపోతారు | Tirumala Naivedyam
డిసెంబర్ దర్శన కోటా వివరాలు | Tirumala Darshan Quota
డిసెంబర్ నెలలో తిరుమల వెళ్లాలనుకునే భక్తులు ముఖ్యంగా ఈ తేదీలను గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. సెప్టెంబర్ 19 ఉదయం 10 గంటలకు సుప్రభాతం (Suprabhatam), తోమాల (Thomala), అర్చన (Archana), అష్టదళ పాదపద్మారాధన వంటి ఆర్జిత సేవల టికెట్ల కోటా విడుదల అవుతాయి.
• సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల వరకు ఈ సేవలకు సంబంధించిన ఎలక్ట్రానిక్ డిప్ (Electronic Dip) కోసం ఆన్లైన్లో నమోదు చేసుకునే అవకాశం ఉంటుంది.
• సెప్టెంబర్ 21 నుంచి 23 మధ్యాహ్నం 12 గంటల వరకు డిప్లో టికెట్ పొందిన వారు నిర్ణీత సమయంలో నగదు చెల్లింపు పూర్తి చేయాల్సి ఉంటుంది.
సెప్టెంబర్ 22న ముఖ్యమైన సేవల టికెట్లు
Arjitha Seva Tickets
కల్యాణోత్సవం (Kalyanotsavam), ఊంజల్ సేవ (Unjal Seva), ఆర్జిత బ్రహ్మోత్సవం (Arjitha Brahmotsavam), సహస్రదీపాలంకార సేవ (Sahasra Deepalankara Seva) టికెట్లను సెప్టెంబర్ 22 ఉదయం 10 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వర్చువల్ సేవలు (Virtual Sevas), వాటికి సంబంధించిన దర్శన స్లాట్ల (Darshan Slots) కోటా కూడా అందుబాటులోకి వస్తుంది.
సెప్టెంబర్ 23న ప్రత్యేక కోటాలు
TTD Special Darshan Quotas
సెప్టెంబర్ 23న ఉదయం 10 గంటలకు అంగప్రదక్షిణ టోకెన్లు (Angapradakshinam Tokens) విడుదల చేస్తారు. ఉదయం 11 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్ల (Srivani Trust Darshan) కోటా అందుబాటులోకి వస్తుంది.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ఉచిత ప్రత్యేక దర్శనం (Free Special Darshan) టోకెన్ల కోటాను విడుదల చేయనున్నారు.
సెప్టెంబర్ 24న దర్శనం, గదుల బుకింగ్
Special Entry Darshan , Rooms
సెప్టెంబర్ 24 తిరుమల ప్రయాణికులకు మరో ముఖ్యమైన రోజు. ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం (Special Entry Darshan) టికెట్ల కోటాను టీటీడీ ఆన్లైన్లో విడుదల చేస్తుంది.
అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుమల, తిరుపతిలోని వసతి గదుల (Accommodation Rooms) కోటా విడుదల కానుంది. తిరుమల ప్రయాణంలో దర్శనం టికెట్‌తో పాటు వసతి, సేవల సమయాలు కూడా ముందుగానే ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.
ముఖ్యంగా డిసెంబర్ వంటి రద్దీ ఉండే కాలంలో చివరి నిమిషంలో బుకింగ్ కోసం ప్రయత్నించడం కంటే, ఏ తేదీన ఏ కోటా విడుదల అవుతుందో ముందే తెలుసుకోవడం ఉపయోగకరంగా ఉంటుంది.
మీ ట్రావెల్ డేట్స్‌కి అనుగుణంగా ముందుగా దర్శనం, ఆ తర్వాత వసతి వంటి అంశాలను ముందుగానే ప్లాన్ చేసుకోవడం బెటర్.
- ఇది కూడా చదవండి : ఆంధ్రప్రదేశ్‌లో 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | i Andhra Pradesh 7 Vishnu Temples
కోటా విడుదల సమయానికి కొన్ని నిమిషాల ముందే అధికారిక వెబ్‌సైట్‌ను తెరచి సిద్ధంగా ఉంచుకోవడం కూడా ఒక సాధారణ ప్రయాణ సూచన.
తిరుమల టికెట్లు ఎక్కడ బుక్ చేసుకోవాలి?
Where to Book Tirumala Tickets
డిసెంబర్ నెలకు సంబంధించిన దర్శనం, ఆర్జిత సేవలు, వసతి కోటాలను టీటీడీ ఆన్లైన్లో దశలవారీగా విడుదల చేయనుంది. ఈ బుకింగ్‌లకు సంబంధించిన వివరాలు టీటీడీ అధికారిక Online Booking Platform లో అందుబాటులో ఉంటాయి.
సాధారణ ప్రశ్నలు | FAQ
డిసెంబర్ ఆర్జిత సేవల కోటా ఎప్పుడు విడుదల అవుతుంది?
సెప్టెంబర్ 19 ఉదయం 10 గంటలకు ఆర్జిత సేవలకు సంబంధించిన కోటా విడుదల అవుతుంది. ఎలక్ట్రానిక్ డిప్ నమోదు సెప్టెంబర్ 21 ఉదయం 10 గంటల వరకు ఉంటుంది.
ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఎప్పుడు వస్తాయి?
సెప్టెంబర్ 24 ఉదయం 10 గంటలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్ల కోటా విడుదల అవుతుంది.
తిరుమల గదుల బుకింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుంది?
డిసెంబర్ నెలకు సంబంధించిన తిరుమల (Tirumala), తిరుపతి వసతి గదుల కోటాను సెప్టెంబర్ 24 మధ్యాహ్నం 3 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు.
▶️ వీడియో చూడండి : కర్మాన్‌ఘాట్ ఆంజనేయుడి మహత్యం
ప్రయాణికుడు వాట్సాప్ ఛానెల్లో చేరడానికి క్లిక్ చేయండి.
