పులికాట్లో వేల కొద్ది ఫ్లెమింగోలను చూసే ఛాన్స్..తేదీలు ఫిక్స్ | AP Flamingo Festival 2026 Complete Guide
January 2026 లో AP Flamingo Festival లో పింక్ బ్యూటీలు సందరడి చేయనున్నాయి 🦩
నెలపట్టు పక్షుల అభయారణ్యం & పులికాట్ సరస్సులో వేలాది ఫ్లెమింగోల గ్లైడింగ్, టికెట్లు, వ్యూయింగ్ స్పాట్స్, హోటల్స్ & ట్రావెల్ టిప్స్‌తో పూర్తి గైడ్.
ముఖ్యాంశాలు
2026 జనవరిలో పులికాట్ సరస్సు దగ్గర ఆకాశం పింక్‌గా మారిపోతుంది. నీటిపై ఫ్లెమింగో పక్షులు తమ రెక్కలను చాచి గ్లైడ్ చేస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లోని Nelapattu Bird Sanctuary లో వేలాది పక్షులు ఒక్కసారిగా ల్యాండ్ అయి ఇన్స్టాగ్రామ్ పోస్టుకోసమే అన్నట్టుగా ఒక బ్యూటిఫుల్ సీనరీని క్రియేట్ చేస్తాయి.
చలికాలంలో ఆంధ్రప్రదేశ్‌లో ప్రతి ఏడాదిలాగే AP Flamingo Festival 2026 ను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తోంది.
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts
🦩 ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రాధాన్యత | Facts About Flamingo Festival
ఈ Bird Festival అనేది Pulicat Lake వద్ద ఉన్న సమృద్ధమైన జీవ వైవిధ్యాన్ని సెలబ్రేట్ చేసే వేదిక. వలస పక్షుల వింటర్ హోమ్‌ను చూడాలనుకుంటే, ఈ ముఖ్య విషయాలు తెలుసుకోవాలి.

- పులికాట్ సరస్సు భారతదేశంలో రెండవ అతిపెద్ద ఉప్పు-తీపి నీటి (Brackish Water) సరస్సు
- ఇది ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద సరస్సు కూడా
- ప్రతి సంవత్సరం 1,00,000+ వలస పక్షులు ఇక్కడికి వస్తాయి
- వలస కాలం: సెప్టెంబర్ నుంచి జనవరి వరకు
- ఫ్లెమింగోలు (Flamingo) యాక్టివ్‌గా కనిపించే సమయం: తెల్లవారు జాము & సూర్యాస్తమయం
- ఫెస్టివల్ ద్వారా లోకల్ ఎకానమీకి ఊతం లభిస్తుంది
- పక్షి సంరక్షణపై అవగాహన పెరుగుతుంది
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ 2025: Nelapattu Bird Sanctuary ఎలా చేరాలి, టైమింగ్ & టికెట్ వివరాలు
ఎప్పటి నుంచి అంటే? | AP Flamingo Festival 2026 Dates
ఏపీ ప్రభుత్వం ఈ పక్షుల పండగను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. గత సంవత్సరాల మాదిరిగానే, 2026 లో కూడా ఘనంగా ఈ ఫెస్టివల్‌ను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.
- ఫెస్టివల్ తేదీలు: జనవరి 10 & 11, 2026
- వ్యవధి: 2 రోజులు
- ప్రచార కార్యక్రమాలు, ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి.
- ఇది కూడా చదవండి : శ్రీ పైడితల్లి అమ్మవారు..యుద్ధాలు వద్దు, శాంతే ముఖ్యం అన్న దేవత కథ | Sri Paidithalli Ammavaru
టికెట్లు ఎలా పొందాలి? | Tickets & Booking
గత ఎడిషన్ల ఆధారంగా టికెట్ల గురించి తెలుసుకోవాల్సిన ముఖ్య విషయాలు:
- ఎంట్రీ పాసులు Bird Sanctuary వద్దనే లభిస్తాయి
- APTDC (Andhra Pradesh Tourism Development Corporation) కౌంటర్లలో కూడా అందుబాటులో ఉంటాయి
- ఫెస్టివల్ దగ్గరగా వచ్చేకొద్దీ ఆన్లైన్ బుకింగ్ లింక్స్ విడుదలయ్యే అవకాశం ఉంది
- ప్రధానంగా ఈ వాటికి చార్జీలు ఉండవచ్చు:
- ఎంట్రీ టికెట్
- బోట్ రైడ్ (అనుమతించిన ప్రాంతాల్లో)
- వ్యూయింగ్ ప్లాట్‌ఫామ్
- ఇది కూడా చదవండి : Top 7 Vizag foods : వైజాగ్‌లో తప్పకుండా ట్రై చేయాల్సిన 7 లోకల్ ఫుడ్
పూర్తి టికెట్ వివరాలు, ఇతర అధికారిక ప్రకటనల గురించి తర్వాత అప్డేట్ చేయబడతాయి.
పక్షులను ఎక్కడ చూడవచ్చు? | Best Viewing Points
ఫ్లెమింగో పక్షులను వీక్షించడానికి ఈ ప్రదేశాలు ఉత్తమమైనవి :
- Nelapattu Bird Sanctuary
- Pulicat Lake Flamingo Zones
- Sullurpeta Wetland Pockets
- ఫెస్టివల్ కోసం ఏర్పాటు చేసిన Designated Viewing Points
ఉత్తమ సమయం: ఉదయం 6:00 – 9:00 AM
ఎక్కడ ఉండాలి? | Accommodation Options
మీరు తిరుపతి ని బేస్ క్యాంప్‌గా చేసుకుని ఈ ఆప్షన్స్‌లో ఎక్కడైనా ఉండవచ్చు.
- APTDC Haritha Hotels
- ప్రభుత్వ గెస్ట్ హౌసులు
- సూళ్లూరుపేటలో బడ్జెట్ లాడ్జీలు / హోటల్స్
- నెల్లూరు నగరంలోని బడ్జెట్ హోటల్స్
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
సాధారణంగా ఫెస్టివల్‌కు 2–3 వారాల ముందు బుకింగ్స్ ప్రారంభమవుతాయి.
ఈ ఫ్లెమింగో ఫెస్టివల్ సంక్రాంతి 2026 సమయానికి వస్తుండటంతో ముందుగానే ప్లాన్ చేసుకోవడం మంచిది.
📌 ఫ్లెమింగో ఫెస్టివల్‌కు సంబంధించిన తాజా అప్డేట్స్ కోసం ప్రయాణికుడు.కామ్ ను రెగ్యులర్‌గా విజిట్ చేయండి.
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
