మనసిటీ మన పుస్తకాల పండగ..ఇంకా రెండు రోజులే మిత్రమా..| Hyderabad Book Fair 2025
Hyderabad Book Fair 2025 గైడ్ కోసం వెతుకుతున్నారా? ఎన్టీఆర్ స్టేడియం టైమింగ్స్, టికెట్స్ ధరలు, ఇంకా ఫేమస్ బాంబూ బిర్యానీ గురించి మొత్తం వివరాలు ఇక్కడ…
ఈ రోజు NTR Stadium లో జరుగుతున్న 38వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌కి వెళ్లాను. సింపుల్‌గా చెప్పాలంటే ఇది ఫెయిర్ కాదు… రీడింగ్ ఫెస్టివల్.
పుస్తకాలు చదవడం బోర్ అనే వాళ్లు ఉంటే ఒకసారి ఇక్కడ అడుగుపెట్టండి. పేజీలు మాట్లాడుతాయి. కవర్స్ పిలుస్తాయి. పర్సు మాత్రం మౌనంగా ఏడుస్తుంది. ఎందుకంటే మనసు మాట వినకుండా మీరు నచ్చిన పుస్తకాలు కొంటే పర్సు ఖాళీ అవుతుంది కదా.
ఈ పుస్తకాల పండగ విశేషాలు (Book Fair Highlights) మీ కోసం
ముఖ్యాంశాలు
వెయిటింగ్ (Waiting Experience)

అందె శ్రీ ప్రాంగణం (Ande Sri Pranganam) దగ్గర క్యూ చూస్తూనే అర్థం అవుతుంది. బుక్స్ కోసం వెయిట్ చేయడం కూడా ఒక భక్తిలాంటిదే.
- Entry Fee: రూ.10 ఉంటుంది. PhonePe preferred, క్యాష్ చాలా తక్కువగా తీసుకుంటారు.
- ఇది కూడా చదవండి : జనవరి 1న పబ్లిక్ హాలిడేనా ? ఏం పని చేస్తాయి ? ఏం పని చేయవు ? | Jan 1, 2026 Public Holiday Hyderabad
స్టేడియం వైబ్స్ (Stadium Vibes)

సాయంత్రం సమయంలో NTR Stadium మొత్తం ఒక సినిమా ఫ్రేమ్‌లా మారిపోతుంది. ఆకాశం సూర్యుడి నారింజ రంగు, నేలపై గ్రీన్ కార్పెట్. పూర్తిగా కలర్‌ఫుల్ సీన్. ఈ సమయంలో ఒక ట్రెండీ Instagram Reels చేసేయొచ్చు. కానీ హడావిడి చేయకుండా ప్లాన్ చేయండి.
- Timing: మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు విజిట్ చేయవచ్చు.
పుస్తకాల దర్శనం (Book Exploration)

షెల్ఫ్‌ల మధ్యలో అలా తిరుగుతుంటే టైమ్ ఐస్‌లా కరిగిపోతుంది. మొబైల్ ఆపరేట్ చేసినా వేళ్లు నొప్పి పడతాయి. అలాగే ఇక్కడ పేజీలు తిప్పినా వేళ్లు నొప్పి పడతాయి. కానీ ఈ పెయిన్లో ఒక సంతోషం ఉంటుంది… మనసు సంతోషంగా ఉంటుంది. Digital Reading vs Physical Books ఛాయిస్ మీదే.
పుస్తక ప్రేమికుల్లో పులకింత (Crowd Energy)

పుస్తకాలు చూస్తే పుస్తక ప్రేమికులు పువ్వుపై బటర్‌ఫ్లై వాలినట్టు వాలిపోతారు. విద్యార్థులు, పేరెంట్స్, సీనియర్స్, పిల్లలు అందరూ ఒకే సింక్‌లో కదులుతారు. పుస్తకాలు అందరినీ లాగేసే గ్రావిటీలా పని చేస్తాయి. తెలంగాణలో Book Reading Culture ఇంకా ఉంది అనడానికి ఇదే ప్రూఫ్.
- Dates: 2025 డిసెంబర్ 29 వరకు జరుగుతుంది.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
నిధి కోసం వేట (Treasure Hunt)

ఒక స్టాల్లో ఏమీ లేదు అనిపిస్తుంది. నెక్ట్స్ స్టాల్లో బంగారం లాంటి బుక్ దొరుకుతుంది. గుర్తుంచుకోండి Book Fair అంటే Shopping కాదు, ఒక Hunting Experience, ఒక Exploration.
తెలుగు సాహిత్యం జోన్ (Telugu Literature Zone)

తెలుగు బుక్స్ సెక్షన్ దగ్గర ఎమోషన్స్ ఆటోమెటిక్‌గా హైలో ఉంటాయి. కిడ్స్ స్టోరీస్ ఉంటాయి. హిస్టరీ, పోయెట్రీ నుంచి పాలిటిక్స్ దాకా మన భాషలో దొరికే పుస్తకాల రేంజ్‌కు తిరుగేలేదు. నిజానికి ఇది చాలా గర్వంగా ఫీల్ అవ్వాల్సిన విషయం. మన రచయితలకు థ్యాంక్స్ చెప్పాల్సిందే.
సరదా కోసం సీరియస్‌గా (Classic Fun Reads)

పెళ్లి కార్టూన్లు (Pelli Cartoons) లాంటి స్టాల్స్ ఈ బుక్ ఫెయిర్‌లో చిన్నపాటి స్పెషాలిటీని తీసుకొస్తాయి. కార్టూనిస్టులకు అంకితం అయిన ఆ స్టాల్లో మీకు మంచి కూల్ స్టఫ్ దొరుకుతుంది. సీరియస్ కంటెంట్‌ను కార్టూనిస్టులు సిల్లీగా, ఫన్నీగా, చతురతతో చూపించడం చాలా పెద్ద ట్యాలెంట్.
- బ్రెయిన్, ట్యాలెంట్, క్రియేటివిటీకి మధ్య కరెక్ట్ బ్యాలెన్స్ కుదిరితేనే ఇలాంటి అద్భుతాలు సాధ్యం.
- సరదాగా ఉండాలి. లాజిక్ ఉండాలి. అలాగే పంచ్ ఉండాలి. ఉగాది పచ్చడిలా అన్నమాట.
- కార్టూనిస్టులు కాన్సెప్టు కోసం ఎంత కష్టపడతారో నేను పత్రికల్లో పని చేసినప్పుడు చూశాను. అంత ఈజీ కాదు.
- ఇది కూడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide
దక్కన్ | Balachelimi

తెలంగాణ కళలు, దక్కన్ పీఠభూమి జీవన విధానంపై బాలచెలిమీ అనే స్టాల్లో ఏర్పాటు చేసిన పుస్తకాలు. ఇవి మనకు తెలియని తెలంగాణనను మనకు పరిచయం చేస్తాయి
ఎడ్యుకేషన్ గేమ్స్ కాదు – Education Gems

గాడ్ ఫాదర్ లాంటి కల్డ్ పుస్తకాలు ఎన్ని సార్లు చదివినా తక్కువే అనిపిస్తుంది. విశ్వనాథ సత్యనారాయణగారి వేయి పడగలు, బుచ్చిబాబు కధలు, మల్లాది, మధుబాబు, ఉషశ్రీ, చిలకమర్తి వంటి రచయితల పుస్తకాలు చదివితేనే కదా మనం పుస్తక ప్రియులు అనిపించుకునేది
కళాకారులకు అంకితం (Artistic Finds)

కొల్లి కన్ను పెయింటింగ్ (Kolli Kannu Painting Book) నాకు కొత్తగా అనిపించిన బుక్. దిష్టి బొమ్మలను వివిధ ప్రాంతాల్లో ఎలా పెయింట్ వేస్తారు అనే విషయాన్ని వందల డిజైన్లతో చూపిస్తుంది. ఇది Universal Book Depot లో లభిస్తుంది. ఈ బుక్‌లో ఇలస్ట్రేషన్స్, కవర్ డిజైన్స్, కలర్స్ కాన్సెప్ట్ అన్నీ చాలా బాగుంటాయి.
క్రియేటివ్ కార్నర్లు (Creative Corners)

యూనిక్ కవర్స్, భారతీయ పబ్లిషర్స్, ఫ్రెష్ ఐడియాలు… ఈ స్టాల్లో ఫ్యూచర్లో హిట్ అయ్యే పుస్తకాలు దొరికేస్తాయి. Future Bestseller Books ఇక్కడే మొదలవుతాయి.
బుక్‌మార్క్స్‌లో ఆనందం (Bookmarks & Little Joys)

“Pick Any 3 Bookmarks” స్టాల్ దగ్గర రష్ చూసి బుక్స్‌తో పాటు బుక్మార్క్స్కూ మంచి డిమాండ్ ఉందని తెలిసింది. రూ.20 పెట్టి బుక్‌మార్క్ కొనడం కన్నా రూ.10 నోటు పెట్టడం మంచిదని నేను కొనలేదు. అలా బుక్‌లో నోట్ పెట్టి మర్చిపోవడం అలవాటు చేసుకుంటే పిల్లలకు చెప్పవచ్చు…
- ఈ బుక్స్ ఉన్నంత వరకు నువ్వు పేదరికంతో ఇబ్బంది పడవు అని.
- పిల్లలు గంపగుత్తగా బుక్స్ అమ్మేస్తే స్క్రాప్ షాప్ వాడికి నిధి దొరికినట్టే.
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
ఫుడ్ స్టాల్స్ (Food Stalls) | Hyderabad Book Fair 2025

బ్రెయిన్ వర్కౌట్ అయిన తర్వాత పొట్ట కూడా శాంతించాలి. అందుకే బొంగులో చికెన్ బిర్యానీ (Bamboo Biryani) సిద్ధంగా ఉంటుంది. అరకులో దొరికే రుచి ఇక్కడ కూడా దొరుకుతుంది. ఇంకా చాలా ఫుడ్ ఐటమ్స్ లభిస్తాయి. బ్రెయిన్‌కు బిర్యానీ తిన్నాం అని తెలిస్తే ఎంత సంతోషిస్తుందో కదా.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
- ఇది కూడా చదవండి : Street Food : హైదరాబాద్‌లో ఈ స్ట్రీట్ ఫుడ్స్ అస్సలు మిస్ అవ్వొద్దు.. తిని తీరాల్సిందే
నైట్ మస్తీ (Night Experience)

నైట్ లైటింగ్‌లో ఫెయిర్ చాలా డిఫరెంట్ ఫీల్ ఇస్తుంది. ఫ్యామిలీస్, కిడ్స్, కపుల్స్… మొత్తానికి కంప్లీట్ సొసైటీని ఇక్కడ చూడొచ్చు. ఇది ఒక Complete Family Outing Spot.
ఛాయ్ బ్రేక్ (Final Chai Break)

పుస్తకాల ప్రపంచంలో అలసిపోయిన శరీరానికి, మనసుకు ప్రశాంతతను ఇచ్చేదే ఛాయ్ బ్రేక్. ఈసారి ఫెయిర్‌లో బుక్స్‌తో పాటు టీలు కూడా అమ్ముడయ్యాయి. ఎందుకంటే ఛాయ్ తాగితే బుర్ర గిర్రునా పని చేస్తుంది కదా.
ట్రావెల్ టిప్స్ | Travel Info & Quick Tips
- Location : హైదరాబాద్ బుక్ ఫెయిర్ అనేది లోయర్ ట్యాంక్‌బండ్ వద్ద ఉన్న ఎన్టీఆర్ స్డేడియంలో జరుగుతోంది.
- Transportation : ఆర్టీసీ క్రాస్‌రోడ్డు వరకు మెట్రోలో చేరుకుని అక్కడి నుంచి నడచుకుంటూ రావచ్చు. బస్సులు కూడా ఉంటాయి.
- Entry Ticket : వచ్చేసి ఎవరికైనా రూ.10 ఉంటుంది. అయితే స్డూడెంట్స్కి ఫ్రీ అని విన్నాను. ఐడీ కార్డు చూపిస్తే సరిపోతుంది అని తెలిసింది. కానీ నేను వెరిఫై చేయలేకపోయాను. మీరు కామెంట్లో కన్ఫర్మ్ చేయండి.
- టైమింగ్స్ వచ్చేసి
- Hyderabad Travel Guide కోసం క్లిక్ చేయండి
- వీక్స్‌లో మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు
- వీకెండ్లో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 9 వరకు వెళ్లవచ్చు.
- మీతో పాటు పెద్ద బ్యాగు, వాటర్ బాటిల్ తీసుకెళ్లండి. అనుకున్నదాని కన్నా కొంచెం ఎక్కువ డబ్బు పెట్టుకు వెళ్లండి. జేబులో డబ్బు లేకపోయినా జస్ట్ పుస్తకాలు చూడటానికి అయినా వెళ్లొచ్చు.
- Specialties: మొత్తం350+ స్టాల్స్ ఉన్నాయి. పబ్లిషర్స్, రైటర్స్‌తో డైరక్టుగా కలవవచ్చు.
- Events: బుక్ లాంచులు, రచయితల టాక్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా ఉంటాయి.
- Washrooms : ఉన్నాయి
- Drinking Water : ఉంటాయి.
- Parking : పార్కింగ్ సదుపాయం ఉంది. కానీ రష్లో టైట్‌గా ఉంటుంది. కార్లు ఎవాయిడ్ చేస్తే బెటర్.
- Food : ఫెయిర్ లోపల బుక్ ఫెయిర్. బయట ఫుడ్ ఫెయిర్. అర్థం అయింది అనుకుంటా. పొట్ట బయటకి వచ్చేలా పర్సు లోపలికి వెళ్లేలా ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి.
- రచయితలు కనిపిస్తే వారిని అభినందించండి. వీలైతే సెల్ఫీ తీసుకుని సోషల్ మీడియాలో వారిని ట్యాగ్ చేసి ప్రమోట్ చేయండి. మన రచయితలను మనం కాకపోతే ఇంకెవరు ప్రమోట్ చేస్తారు.
- Prayanikudut Tip : ఫెయిర్ చివరి రోజు అంటే 29వ తేదీన వెళ్తే మీకు Buy 1 Get 1, 50 % డిస్కౌంట్ లేదా మీరు ఊహించినదానికన్నా తక్కువ ధరకు బుక్స్ లభించే అవకాశం ఉంది.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
