హైదరాబాద్ యాన్యువల్ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ ( All India Industrial Exhibition), మనం ముద్దుగా నుమాయిష్ అని పిలుచుకునే ఈ ప్రదర్శన 84వ ఎడిషన్ 2025 ఫిబ్రవరి 17తో ముగిసింది (Numaish 2025 Wraps Up) . హైదరాబాద్ వైభవానికి ప్రతీకగా నిలిచే నుమాయిష్ ఈ ఏడాది కూడా తన లక్ష్యాన్ని పూర్తి చేసుకుంది.
ఆరంభం కాస్త ఆలస్యం జరిగినా, గత సంవత్సరంతో పోల్చితే ఈ సంవత్సరం సందర్శకుల తాకిడి తక్కువగా ఉన్నా ఈ 46 రోజుల వ్యాపార ప్రదర్శన ఆర్థికంగా లాభాలు తెచ్చిపెట్టింది. ఇందులో సందర్శకులు షాపింగ్ చేయడంతో పాటు, వివిధ రకాల ప్రాంతాల సంప్రదాయాల గురించి తెలుసుకున్నారు, పలు యాక్టివిటీస్‌లో పాల్గొన్నారు.
ముఖ్యాంశాలు
నుమాయిష్ అంటే ? | What’s Numaish Meaning?
నుమాయిష్ (Numaish) అంటే ప్రదర్శన అని అర్థం వస్తుంది. గత 8 దశాబ్దాలుగా హైదరాబాద్‌కు ఒక ఐకాన్‌గా నిలుస్తోంది నుమాయిష్. దీనిని 1938 లో స్థానిక ఉత్పత్తులు, క్రాఫ్ట్‌లను ప్రమోట్ చేసే లక్ష్యంతో ఎగ్జిబిషన్ సొసైటీ ప్రారంభించింది. కానీ తరువాత కాలంలో ఇందులో దేశ వ్యాప్తంగా ఉన్న వ్యాపారులు పాల్గొని దీనిని నెక్ట్స్‌లెవల్‌కి తీసుకెళ్లారు.
- ఇది కూడా చదవండి : Azerbaijan అజర్ బైజాన్ ఎలా వెళ్లాలి ? ఏం చూడాలి ? 10 టిప్స్!
ఈ ఎగ్జిబిషన్‌ను ప్రతీ సంవత్సరం నాంపల్లి (Nampally Exhibition) దగ్గరున్న 23 ఎకరాల ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో నిర్వహిస్తారు. నుమాయిష్ జరిగే 46 రోజుల పాటు ఈ ప్రాంతం అంత ఒక మినీ ఇండియాలా వివధ రాష్ట్రాల నుంచి వచ్చే వ్యాపార, వర్త, కళాకారులతో సందడిగా ఉంటుంది.
కొనసాగిన వారసత్వం | Numaish As Tradition
ప్రతీ సంవత్సరం జనవరి 1వ తేదీన ప్రారంభమయ్యే నుమాయిష్ 2025 సంవత్సరం మాత్రం కాస్త ఆలస్యంగా జనవరి 3వ తేదీన ప్రారంభమైంది. అందుకే ప్రతీ సంవత్సరం ఫిబ్రవరి 15న ముగియాల్సి ఉండగా ఈ ప్రదర్శనను మరో రెండు రోజులు అంటే ఫిబ్రవరి 17వ తేదీ వరకు పొడిగించారు. అయినా కానీ అధిక సంఖ్యలో పర్యాటకులు వచ్చి ఈ ఎడిషన్‌ను విజయవంతం చేశారు. సుమారు 18 లక్షల మంది ఈ సారి ఎగ్జిబిషన్‌కు వచ్చారని అంచనా.
ఎగ్జిబిషన్ సొసైటీ లక్ష్యం
ఎగ్జిబిషన్ సొసైటీ (Exhibition Society) అనేది ఒక లాభాపేక్ష లేని నాన్ ప్రాఫిట్ సొసైటీ. ఎగ్జిబిషన్ నిర్వహించగా వచ్చిన ఆదాయంతో పలు పాఠశాలలు, విద్యాసంస్థల్లో విద్యార్థులకు చదువుకునేందుకు అవకాశం కల్పిస్తుంది. దీంతో పాటు మహిళా సాధికారత, స్వావలంభన దిశలో నిధులను కేటాయిస్తుంది. తెలంగాణలోని (Telangana) 20 విద్యాసంస్థల్లో 30,000 మంది విద్యార్థులకు విద్యాభ్యాసం అందిస్తుంది ఈ సొసైటీ.
- ఇది కూడా చదవండి : UAE: యూఏఈలో తప్పకుండా చూాడాల్సిన 10 ప్రదేశాలు
తక్కువ మంది ఎక్కువ లాభం

గత సంవత్సరంతో పోల్చితే 2025 నుమాయిష్‌కు సందర్శకుల తాకిడి తగ్గినట్టు నిర్వహాకులు తెలిపారు. సుమారు లక్ష మంది వరకు తగ్గారని అంచనా వెస్తున్నారు. దీనిని అనేక కారణాలు ఉన్నాయని అందులో ముఖ్యంగా మహా కుంభ మేళా (Maha Kumbh Mela 2025) ఉండటం వల్ల చాలా మంది రాలేకపోయారేమో అని భావిస్తున్నారు.
అయితే సందర్శకుల సంఖ్య స్వల్పంగా తగ్గినా కానీ వ్యాపారం మాత్రం తగ్గలేదట. బిజినెస్ బాగుంది అని అమ్మకాలు బాగా జరిగాయి అని పలు స్టాల్స్ నిర్వాహకులు తెలిపారు. వచ్చిన సందర్శకులు కొనుగోలు చేయడానికి ఎక్కువ ఆసక్తి చూపించారని తెలిపారు కొందరు వ్యాపారులు.
ఈసారి నుమాయిష్ ప్రత్యేకలు | Numaish 2025 Wraps Up
2025 నుమాయిష్‌లో సుమారు 2,400 వరకు స్టాల్స్ ఏర్పాటు అయ్యాయి. ఇందులో అనేక రకాల ఉత్పత్తులను ప్రదర్శించారు. ఇందులో హ్యాండీ క్రాఫ్ట్స్, టెక్ట్స్‌టైల్స్ (Textiles) నుంచి ఎలక్ట్రానిక్ పరికరాల వరకు ఉన్నాయి. దీంతో పాటు సందర్శకుల కోసం వినోదానికి కూడా తగిన ఏర్పాట్లు చేశారు. ఇక భోజనం విషయానికి వస్తే దేశ వ్యాప్తంగా ఉన్న అనేక రకాలు వైరైటీ రెసెపీస్ సందర్శకులను ఆకట్టుకున్నాయి.
నుమాయిష్ చరిత్ర | Numaish History
స్థానిక కళాకారులు (Local Artists), వ్యాపారులను ప్రోత్సాహించడానికి వారికి ఆర్థికంగా అండగా ఉండేందుకు నుమాయిష్‌ను ప్రారంభించారు. ఉస్మానియా గ్రాడ్యువేట్స్ అసోసియేషన్ వారి ఆర్థిక సంఘానికి ఈ ఆలోచన రాగా దీనికి సర్ అక్బర్ హైదరి, మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ (Mir Osman Ali Khan) మద్దతు ఇచ్చారు. 1938 లో ఈ ఆలోచనకు ఒక రూపం అందిస్తూ పబ్లిక్ గార్డెన్‌లో తొలి నుమాయిష్ నిర్వహించారు. 1946లో దీనిని పబ్లిక్ గార్డెన్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌కు తరలించారు.
గత 84 సంవత్సరాలుగా హైదరాబాద్ ప్రజలకు మెరుగైన వస్తుసేవలను, వినోదాన్ని, కుటుంబంతో సమయం గడిపే అవకాశాన్ని కల్పిస్తోంది నుమాయిష్. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి వ్యాపారలు వచ్చి హైదరాబాద్ ప్రజల మనసు గెలుచుకునే ఉత్పత్తులను అందిస్తూ లాభాలను గడిస్తున్నారు.
ప్రదర్శన మాత్రమే కాదు ఇది…
నుమాయిష్ అనేది హైదరాబాద్ (Hyderabad) ప్రజల జీవితంలో ఒక భాగం అయిపోయింది. అన్ని వర్గాల ప్రజలు నుమాయిష్ సందర్శిస్తుంటారు. మతసామరస్యానికి ప్రతీగా నిలుస్తూనే వ్యాపారం, వినోదం అందిస్తూ విజయవంతంగా తన ప్రస్థానాన్ని ముందుకు తీసుకెళ్తోంది నుమాయిష్.
మీరు ఈసారి నుమాయిస్ వెళ్లారా ? వెళ్లే మీకు అక్కడ నచ్చిన విషయాలేంటి ? కామెంట్ చేయండి!
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.