Window Seat: విమానంలో విండో సీట్ బుక్ చేస్తే గోడ పక్కన కూర్చోబెట్టారు !

షేర్ చేయండి

విమానంలో విండో సీట్ (Window Seat) దొరికితే ప్రపంచాన్నే జయించినంత ఆనందంగా అనిపిస్తుంది. ఇదే ఆనందాన్ని ఎక్స్‌పెక్ట్ చేసి వెళ్లిన ప్రయాణికుడు షాక్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ కిటికీ లేదు గోడ మాత్రమే ఉంది. 

బస్సులో , విమానంలో, ట్రైన్లో అయినా విండో సీట్ దొరికితే కలిగే ఆనందమే వేరు. మరీ ముఖ్యంగా ఫ్లైట్‌లో (Flight) విండో సీట్ దొరికితే గాల్లోంచి ప్రపంచాన్ని చూడొచ్చు అని అనుకుంటారు ప్రయాణికులు. మేఘాల మధ్యలోంచి దూసుకెళ్లే విమానంలో ప్రయాణించాలకున్న ఒక ఇండిగో ప్రయాణికుడు (IndiGo Passenger) విండో సీట్ బుక్ చేసుకున్నాడు. కానీ అతనికి దొరికింది మాత్రం విండో సైడ్ ఉండే గోడ మాత్రమే. 

కిటికీ సీటు కథ | Window Seat

ప్రదీప్ అనే ప్రయాణికుడు ట్విట్టర్‌లో (X) తన ప్రయాణ గాథను నెటిజెన్లతో షేర్ చేసుకున్నాడు. విండో సీట్ దొరికాలని అనే ఆశ ఎలా అడియాశలు అయిందో వివరించాడు ప్రదీప్. ఒక బ్లాంక్ వాల్ పక్కనే కూర్చుని ఉన్న తన చిత్రాలను కూడా అతను షేర్ చేశాడు.

నిజానికి అక్కడ విండో ఉండాలి. కిటికీ లేకపోడంతో “ నేను విండో సీటు కోసం డబ్బు చెల్లించాను. కానీ కిటికీ ఎక్కడ?” అని వివరించాడు. ఇప్పుడు ఈ పోెస్టు నెట్టింట సందడి చేస్తోంది.

స్పందించిన ఇండియో | IndiGo Reacts

ఈ పోస్టుకు ఇప్పటి వరకు 9,37,000 వ్యూస్ వచ్చాయి. దీనిని ఇండిగో విమానయాన (IndiGo Airlines) సంస్థ కూడా గమనించింది. ఈ ట్వీటుకు స్పందిస్తూ ప్రదీప్ తన ఫ్లైట్ వివరాలను డైరక్ట్ మెసేజ్ చేయమని కోరింది సంస్థ.

ఫన్నీగా రియాక్ట్ అయిన నెటిజెన్లు

కిటికీ లేని ఈ విమాన ప్రయాణం గురించి ప్రదీప్ పోస్టు చేసిన తరువాత నెటిజెన్లు ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. కొంత మంది నిరాశను కూడా వ్యక్తం చేశారు. ఎయిర్‌లైన్ సంస్థలు నిజాయితీగా ఉండాలని కోరారు కొంత మంది.

తను కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొన్న విషయాన్ని మరో ప్రయాణికుడు షేర్ చేశాడు

Window Seat
Phot Source: X/drarpitoparmar

అనేక అంతర్జాతీయ విమానయాన సంస్థలు (International Airlines) విండో సీటు లేకుండానే విండో సీటు ఉన్నాయని చెప్పి బుకింగ్ చేసేలా చేస్తున్నాయి అని కొంత మంది వివరించారు. అదే సమయంలో కొన్ని సంస్థలు విండో సీటు ఉన్నదీ లేనిదీ స్పష్టంగా చెబుతాయి అని ఇండిగో కూడా అలాగే చేయాలి అని సూచించారు.

ఒకవేళ విండో సీటు లభించకపోతే మాత్రం లేదు అని చెప్పాలి లేదంటే ఫ్లైట్ ఎక్కాక ప్రయాణికులు సర్‌ప్రైజ్ అవుతారు లేదా షాక్ అవుతారు.

మీరు మీతో పాటు ల్యాప్ టాప్ తీసుకెళ్లలేదా అని మరో యూజర్ ఫన్నీగా రిప్లై ఇచ్చాడు.

ఒక యూజర్ ఈ పరిస్థితిని కాస్త కామెడిగా మార్చుతూ విండో సీట్ అని బుక్ చేసుకుంటే సీటు మాత్రమే లభిస్తుంది. మీరు విండోనే బుక్ చేసుకోవాల్సింది అని సూచించాడు సరదాగా. విండో కావాలంటే ఎగస్ట్రా అవుతుంది అని తెలిపాడు

ఈ ఘటన నుంచి ఏ నేర్చుకోవచ్చు అంటే ?

ఏమైనా నేర్చుకోవాల్సి ఉంటే ఎయిర్‌‌లైన్ సంస్థలు నేర్చుకోవాలి. ఎయిర్‌లైన్ సంస్థలు సీట్ల ఏర్పాటు, బుకింగ్ గురించి క్లియర్‌గా వివరించి చెప్పాలి. మనకు ఈ విషయం కాస్త సరదాగా అనిపించవచ్చు. కానీ ఫస్ట్‌టైమ్ ఈ విషయం తెలిసిన తరువాత ఎంత నిరాశగా ఉంటుందో..ఎంత కోపం వస్తుందో మీరు అర్థం చేసుకోవచ్చు. 

మళ్లీ అదే ఎయిర్‌లైన్ ఎక్కాలని ఎవరికైనా అనిపిస్తుందా ? ఈ వార్త వైరల్ అయిన తరువాత ఇలా చేసే విమానయాన సంస్థలు ఇలాంటి విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. 

ఇలా ఎందుకు జరుగుతుంది ?

ఈ విండో సీటు వ్యవహారం అనేది కేవలం మన దేశానికి మాత్రమే పరిమితం కాదు. ఇలా అనేక దేశాల్లో జరుగుతూ ఉంటుంది. నిజానికి ఇలా జరగడానికి మిగితా కారణాలను పక్కన పెడితే …విమానాలను తయారు చేసే సంస్థలను బట్టి , వాటి డిజైన్, ఇంటీరియర్‌, మోడల్స్‌ను బట్టి కూడా విండో సీట్ వద్ద ఇలా గోడ ఉండే అవకాశం ఉంది.

దీనికి సంబంధించిన ఒక ట్విట్టర్ యూజర్ చేసిన పోస్ట్ చూడండి

ఈ విషయాల్లో జాగ్రత్త | Flight Ticket Booking Tips

ఇక ప్రయాణికుల విషయానికి వస్తే మీరు టికెట్ బుక్ చేసుకునే సమయంలో సీట్ మ్యాప్‌ను (Seat Map) డబుల్ చెక్ చేసుకోండి. దీతో పాటు సీటు గురించి డిస్క్రిప్షన్ జాగ్రత్తగా చదవండి. అర్థం అయ్యాకే బుకింగ్ పూర్తి చేయండి. విండో సీటు బుక్ చేస్తే విమానంలోని విండో ఉండే భాగంలో సీటు వచ్చేస్తుంది అనేది తెలిసే ఉంటుంది.

అయితే విండో సీటు (window seat) దొరుకుతుంది అని మాత్రం గ్యారంటీగా చెప్పలేము. మీకు గోడ మాత్రతే దొరకవచ్చు. సో మీతో ఇలాగే జరిగితే మాత్రం మీరు కూడా ఒక పోస్టు పెట్టండి. 

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!