Kotappakonda: మహా శివరాత్రి ఉత్సవాలకు సిద్ధం అవుతున్న కోటప్పకొండ…ట్రావెల్ గైడ్

షేర్ చేయండి

మహా శివరాత్రి సందర్భంగా కోటప్పకొండకు (Kotappakonda) పూర్వ వైభవం తీసుకొస్తున్నారు.దూర దూరం నుంచి వచ్చే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం టెంపుల్ టూరిజానికి ప్రధాన్యత ఇస్తున్నట్టు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపిన విషయం తెలిసిందే. దేవాలయాలు (Andhra Pradesh Temples) అనేవి ఆధ్యాత్మికతకు కేంద్రాలు మాత్రమే కాదు…అవి అభివృద్ధికి ఒక సోర్స్ అని కూడా చంద్రబాబు అన్నారు. ఇక ఆలయాల డెవెలెప్మెంట్ కోసం రూ.134 కోట్లు ఖర్చు చేస్తున్నట్టు కూడా తెలిపారు.

ఆలయ ఆర్థిక వ్యవస్థ లక్షల కోట్లలో | Indian Temple Economy

దేశ సంస్కృతి, వారసత్వాన్ని (Indian Heritage and Culture) పరిరక్షించడంలో ఆలయాలు కీలక పాత్రను పోషిస్తున్నాయని సీఎం చంద్రబాబు తెలిపారు. అలాగే మన దేశంలో ఉన్న ఆలయాల ఆర్థిక వ్యవస్థ అనేది సుమారు రూ.6 లక్షల కోట్లు ఉంటుందన్నారు. అలాంటి విలువైన ఆలయాలను కాపాడుకోవాలని ఆయన తెలిపారు. 

ఆలయాలకు ఆలవాలం | Famous Temples In AP

ఇక దేవాలయ పర్యాటకానికి ప్రాధాన్యత ఇస్తున్నట్టు తెలిపిన చంద్రబాబు,  2024 లో 21 కోట్ల మంది ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆలయాలను సందర్శించారన్నారు . తిరుమల, శ్రీశైలంతో (Srisailam) పాటు పంచారామ క్షేత్రాలు, జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఏపీలో ఉన్నాయని గుర్తుచేశారు. దేవాలయ పర్యాటకాన్ని(Temple Tourism) అభివృద్ధి చేసి దానితో రాష్ట్రాన్ని అభివృద్ధి చేయవచ్చు అన్నారు.

కోటప్పకొండకు పూర్వ వైభవం | Kotappakonda Temple

Kotappakonda is Getting Ready for Maha Shivaratri 2025 (B)
ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్న అధికారులు, మంత్రి నేతలు

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) దేవాలయ టూరిజానికి ఉన్న ప్రాధాన్యత తెలపగా కోటప్పకొండకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు అధికారులు సిద్ధం అయ్యారు. దీని కోసం పవిత్ర శైవ క్షేత్రంలో (Lord Shiva Temple In Andhra Pradesh) త్వరలో జరగనున్న మహా శివరాత్రి వేడుకను వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. 

  • భక్తులకు ఇబ్బంది లేకుండా దర్శనానికి ఏర్పాట్లు 
  • భక్తుల రద్దీని క్రమబద్ధీకరించేందుకు స్పెషల్ ప్లాన్ 
  • కోటప్పకొండలో రాష్ట్ర పండగ హోదాలో (State Festival) మహా శివరాత్రి వేడుకలు నిర్వహించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ప‌ల్నాడు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి ర‌వికుమార్ తెలిపారు.

రాష్ట్ర పండుగగా కోటప్పకొండ తిరునాళ్లు | Kotappakonda Tirunallu

ఫిబ్రవరి 26వ తేదీన మహా శివరాత్రి (Maha Shivaratri) ఉన్నందున కోటప్పకొండలో జరిగే ఉత్సవాలకు సంబంధించిన ఎర్పాట్లు ఎలా జరుగుతున్నాయో ఎమ్మెల్యే ప్రత్తిపాటు పుల్లారావుతో కలసి మంత్రి గొట్టిపాటు పరిశీలించారు. భక్తులకు మంచినీటి ఏర్పాటు, రవాణా, పారిశుధ్ద్యం, తాత్కాలిక వసతి వంటి అంశాలను పరిశీలించారు. 

వంజంగి ఎలా వెళ్లాలి ? ఎలా సిద్ధం అవ్వాలి ? 10 టిప్స్ !
  • కోటప్ప కొండ తిరునాళ్లను రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్న తరుణంలో ఎలాంటి లోపాలు ఇబ్బందులు లేకుండా ఆధ్యాత్మిక వాతావరణంలో వేడుకలు జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
  • భక్తులందిరకి స్వామి దర్శనం ప్రశాంతంగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని భక్తులు అధికారుల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని మంత్రి కోరారు.

కోటప్పకొండ | Kotappakonda Specifications

ఆంధ్రప్రదేశ్ జిల్లాలోని పల్నాడు (Palnadu District) జిల్లాలో ఉన్న పవిత్రమైన కోటప్పకొండకు దూర దూరం నుంచి భక్తులు వస్తుంటారు. ఇక్కడ ఉన్న త్రికోటేశ్వర స్వామి (Trikoteswara Swami Temple) దర్శనం చేసుకుంటే కష్టాలు తొలగుతాయి అని భక్తుల విశ్వాసం.ఇక్కడ బ్రహశిఖరం, విష్ణు శిఖరం, రుద్రశిఖరం అనే మూడు శిఖరాలు ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తాయి.

ఎక్కడ ఉంది ? | Where is Kotappakonda 

కోటప్పకొండ  నర్సారావు పేట నుంచి 10 కిమీ దూరం, గుంటూరు నుంచి 62 కిమీ దూరంలో ఉంటుంది

కోటప్పకొండ ఎలా వెళ్లాలి ? | Hyderabad To Kotappakonda

హైదరాబాద్ నుంచి కోటప్పకొండ సుమారు 260 కిమీ దూరంలో ఉంటుంది. ఇక్కడికి రోడ్డు మార్గాన వెళ్లడానికి మీరు నేషనల్ హైవే 65, నేషనల్ హైవే 16పై ప్రయాణించాల్సి ఉంటుంది. 

  • 5-6 గంట సమయంలో ఆలయానికి చేరుకోవచ్చు.
  • ట్రైనులో అయితే మీరు నర్సారావు పేటకు చేరుకుని అక్కడి నుంచి ప్రైవేట్ ట్యాక్సీ లేదా ఆటోలో ఆలయానికి చేరుకోవచ్చు.

విజయవాడ నుంచి | Vijayawada to Kotappakonda

విజయవాడ నుంచి మీరు కోటప్పకొండ 120 కిమీ దూరంలో ఉంటుంది. బైరోడ్ వెళ్లాలి అనుకుంటే నేషనల్ హైవే 65 లో ప్రయాణించి 2-3 గంటల్లో చేరుకోవచ్చు. 

  •  విజయవాడ నుంచి నర్సారావుపేటకు కూడా బస్సులు వెళ్తుంటాయి. 
  • ట్రైనులో ప్రయాణించాలి అనుకుంటే మీకు విజయవాడ నుంచి నర్సారావుపేటకు ట్రైన్లు అందుబాటులో ఉంటాయి. 
  • నర్సారావు పేట (Narasaraopet) నుంచి మీరు ట్యాక్సీ లేదా ఆటోలో ఆలయ ప్రాంగణానికి చేరుకోవచ్చు.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!