Masab Tank Burj : ట్రాఫిక్ మధ్యలో హఠాత్తుగా వచ్చిన ఈ కట్టడం వెనక అసలు కథ ఏమిటి?
హైదారాబాద్ నగరానికి కొత్త సింబాలిక్ ల్యాండ్‌మార్క్‌గా మారింది Masab Tank Burj. దీనికి ఎందుకు కట్టారు ? ఎక్కడ ఉందో, ఎప్పుడు చూడాలో ట్రావెలర్స్ కోసం సింపుల్ గైడ్.
హైదారాబాద్ నగరానికి కొత్త సింబాలిక్ ల్యాండ్‌మార్క్‌గా మారింది Masab Tank Burj. దీనికి ఎందుకు కట్టారు ? ఎక్కడ ఉందో, ఎప్పుడు చూడాలో ట్రావెలర్స్ కోసం సింపుల్ గైడ్.
హైదరాబాద్‌కు కొత్త ల్యాండ్‌మార్క్ వచ్చింది.
మాసాబ్ ట్యాంక్ చౌరస్తా దానికి వేదిక అయింది.
మొన్నటి వరకు సింపుల్‌గా ఉన్న మాసాబ్ ట్యాంక్ జంక్షన్లో ఒక బురుజు ప్రత్యక్షం అయంది.
ముఖ్యాంశాలు
ఈ బుర్జ్ ఎందుకు నిర్మించారు? ఎవరు నిర్మించారు ?
- ఎలా వెళ్లాలి?
- ఎప్పుడు వెళ్లాలి?
- ఈ విషయాలను ప్రయాణికుడి కోణంలో వివరిస్తాను.
- ఇది కూాడా చదవండి : Hyderabad లో తప్పకుండా వెళ్లాల్సిన Top 7 Best Family Parks – Entry Fee, Timings & Complete Guide

ఈ బుర్జ్ ఒక రకంగా వాచ్ టవర్ లాంటిది. దీనిని చూసేందుకు మీరు ప్రత్యేకంగా అక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి వెళ్లేటప్పుడు చూడవచ్చు. లేదూ, వెళ్లి చూస్తాను అనుకుంటే ఈ పోస్టు మీకు బెస్ట్ గైడ్‌లా పని చేస్తుంది.
అసలు ఈ బుర్జ్ ఎందుకు కట్టారు?
ఈ డౌట్ నాకూ వచ్చింది.
సెర్చ్ చేస్తే కొన్ని వెబ్‌సైట్స్‌లో నాకు ఈ విషయాలు తెలిసాయి.
ఈ బుర్జ్‌ను GHMC కోసం Deccan Terrain Heritage డిజైన్ చేసింది.
ఎందుకు నిర్మించారు? | Masab Tank Burj
1869లో ఏర్పడిన హైదరాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ 2025లో 157 ఏళ్లు పూర్తి చేసుకుంది.
మున్సిపల్ విభాగం పనితీరుకు ఒక ట్రిబ్యూట్‌గా షట్కోణ (Hexagon) ఆకారంలో దీనిని నిర్మించారు.
అయితే దీని పర్పస్ అదే అయినా, హైదరాబాద్ వాసులకు ఒక కొత్త ఫోటో స్టాప్ పాయింట్ (Photo Stop Point In Hyderabad) దొరికింది అని చెప్పవచ్చు.
దాంతో పాటు హైదరాబాద్ వారసత్వ కట్టడాలపై అవగాహన పెంచుకునేందుకు కూడా ఇది ఒక మంచి పాయింట్.
- ఇది కూడా చదవండి ఎక్స్‌పీరియా పార్క్‌కు దగ్గర్లో ఉన్న 10 సందర్శనీయ స్థలాలు | Places Near Experium Eco Park
ఈ బుర్జ్ ఎక్కడ ఉంది? | Masab Tank Burj Location
ఈ బుర్జ్ మాసాబ్‌ట్యాంక్ చౌరస్తాలో ఉంది.
లకిడీకాపూల్ నుంచి మెహిదీపట్నం, పెన్షన్ ఆఫీస్ వెళ్లే దారిలో ఫ్లైఓవర్ ఎక్కకుండా లో-లెవల్ రోడ్ నుంచి వెళ్తే, సిగ్నల్ దగ్గర మీకు ఇది కనిపిస్తుంది.

- సాధారణంగా చాలా చౌరస్తాల్లో మనకు ఆసక్తికరమైన నిర్మాణాలు, శిల్పాలు కనిపిస్తుంటాయి.
- కాబట్టి అంత ఫోకస్ చేయము అనేది ఫ్యాక్ట్.
- పైగా ఇది అంత పెద్ద టూరిస్ట్ అట్రాక్షన్ కూడా కాదు.
- కానీ ఇంత బిజీ లైఫ్‌లో కూడా ఒక హెరిటేజ్ టచ్ ఉన్న కట్టడం కనిపిస్తే కాస్త రిలాక్స్ అయిన ఫీలింగ్ వస్తుంది.
- నిజానికి ఇది కట్టడం మాత్రమే కాదు.
- ఒక మార్కర్ కూడా.
- “మాసాబ్ ట్యాంక్ బుర్జ్ దాటి లెఫ్ట్‌కు రా, రైట్‌కు రా” అని చెప్పడానికి బాగా పనికొస్తుంది.
- ఇది కూడా చదవండి : హైదరాబాద్ మొత్తాన్ని 2 రోజుల్లో పూర్తి చేయగలమా? – No | 2-Day Hyderabad Practical Tour
బెస్ట్ అప్రోచ్ | Best Approach
ఈ బుర్జ్‌ను ఒక డెస్టినేషన్‌లా కాకుండా,
మీరు వెళ్లే దారిలో కవర్ చేసే ఒక ప్లేస్‌లా ప్లాన్ చేయండి.
ఎప్పుడు చూడాలి? | Best Time To Visit
ఇది చాలా ఇంపార్టెంట్ విషయం.
ఎందుకంటే మాసాబ్‌ట్యాంక్ చౌరస్తా అంటే ఫుల్ ట్రాఫిక్ ఉండే ఏరియా.
అందుకే ట్రాఫిక్ తక్కువగా ఉన్న సమయంలో వెళ్లాలి.
- ఉదయం
- 6.30 నుంచి 8.00 గంటల వరకు
- ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది
- ఈ టైమ్‌లో ఫోటోలు, రీల్స్ ట్రై చేయవచ్చు
హైదరాబాద్‌ను పూర్తిగా ఎక్స్ప్లోర్ చేసందుకు క్లిక్ చేయండి.
సాయంత్రం
6.30 నుంచి 8.30 వరకు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది. ఈ సమయంలో వెళ్లమని చెప్పను.
కానీ ఫీచర్ ఇమేజ్‌లో కనిపించినట్టు ఫుల్ లైటింగ్ ఉంటుంది
రాత్రి 9 తర్వాత వెళ్లి చూడండి అని చెప్పడం కరెక్ట్ కాదు.
అది మీరు మీ కుటుంబంతో ఉండాల్సిన సమయం.
ఇక మీరే డిసైడ్ చేసుకోండి ఏం చేయాలో.
- ఇది కూడా చదవండి : జూపార్క్‌కు వెళ్లే ముందు ఇవి తెలియకపోతే టైమ్ వేస్ట్ అవుతుంది | Hyderabad Zoo Entry Fee ,Timings
లేదంటే ఇంకో ఐడియా ఉంది.
మాసాబ్‌ట్యాంక్ సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు ఒక 30 సెకన్లు అలా చూసి వెళ్లిపోవచ్చు.
మధ్యాహ్నం మాత్రం వెళ్లకండి.
ఎందుకంటే ఆ సమయంలో ఎండ, ట్రాఫిక్ రెండూ ఉంటాయి.
మరి ఫోటోలు ఎలా? | Photography & Viewing Tips
బుర్జ్ చుట్టూ రహదారులే ఉంటాయి. ఫోటోగ్రఫీ డెడికేటెడ్‌గా చేయడం సాధ్యం కాదు. కానీ,
సిగ్నల్ దగ్గర బండి ఆగినప్పుడు ఫుట్‌పాత్ నుంచి ఒక ఫోటో ట్రై చేయవచ్చు.
- బురుజు ముందు కూడా ఒకట్రెండు బైకులు ఆగే ప్లేస్ ఉంది.
- ట్రాఫిక్ లేనప్పుడు అక్కడ 10 సెకన్లు చూసి ఫోటోలు తీసుకోవచ్చు.
- కళ్లతో చూడటం ఇంపార్టెంట్.
- కెమెరాతో ఫోటోలు తీయడం కాదు.
హెరిటేజ్ వాక్‌లో చేర్చుకోవాలా? | Hyderabad Heritage Walk Circuit
మీరు హైదరాబాద్ వారసత్వ కట్టడాలను (Hyderabad Heritage Monuments) చూడాలనుకుంటే, ఇందులో ఈ బురుజును కూడా చేర్చుకోవచ్చు. అయితే ఇది నిజంగా వారసత్వ సంపద కాదు. కానీ వారసత్వానికి ప్రతీకగా నిలిచే కట్టడం.
- ఇది కూడా చదవండి : Beyond Biryani: హైదరాబాద్ అంటే బిర్యానీ మాత్రమే కాదు, అంతకు మించి! ఇవి కూడా ట్రై చేయండి
బిర్లామందిర్ (Birla Mandir), ట్యాంక్‌బండ్ (Tank Bund) లేదా నీలోఫర్ హోటల్లో చాయ్ (Nilofer Tea) తాగడానికి వచ్చినప్పుడు దీనిని కవర్ చేసుకోవచ్చు. ఇలా భక్తి, భుక్తి, స్ట్రెస్ నుంచి విముక్తి, వారసత్వ సంపద శక్తి అన్నింటినీ ఆసక్తితో కవర్ చేయండి.
దారి కనుక్కోవడం కష్టంగా ఉంటే ప్రభుత్వం పాలిటెక్నిక్ కాలేజీ లేదా “మాసాబ్ ట్యాంక్ చౌరస్తా ఎక్కడ?” అని అడగండి. సరిపోతుంది.
కుటుంబంతో వెళ్లాలి అనుకుంటే | Family Safety Note

ఇది టూరిస్టు ప్రదేశం కాదు.
ఒక సింబాలిక్ నిర్మాణం మాత్రమే.
దీనిని దూరం నుంచి చూసినా, దగ్గరి నుంచి చూసినా ఇబ్బంది లేదు.
కానీ దగ్గరి నుంచి చూడాలి అని పిల్లలు, పెద్దలతో రోడ్ క్రాస్ చేయించడం లాంటివి చేయకండి.
మీరు ఉన్న సేఫ్ ప్లేస్ నుంచే చూసేయండి.
బండి ఆపకుండా సిగ్నల్ దగ్గరి నుంచే చూసేయడం బెస్ట్.
గమనిక: ఫుడ్ స్టాల్స్, వాష్‌రూమ్స్, పార్కింగ్ సౌకర్యాలు అందుబాటులో ఉండవు.
ఒక పర్యాటక ప్రదేశానికి వెళ్తున్నట్టు కాకుండా,
హైదరాబాద్ వారసత్వాన్ని చూసేలా ఏర్పాటు చేసిన ఒక స్టాప్‌లా దీనిని భావించండి.
- ఇది కూడా చదవండి : క్లీనర్ నుంచి భారత్‌లోనే అతిపెద్ద టీ కేఫ్ పెట్టేవరకు కేఫ్ నీలోఫర్ ఫౌండర్ కథ | Hitech City Cafe Niloufer
సందేహాలు సమాధానాలు | FAQs
మాసాబ్ ట్యాంక్ బురుజు ఎందుకు కట్టారు ? | Why Masab Tank Burj was constructed
GHMC 157 Years Completion సందర్భంగా, హైదరాబాబాద్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ చరిత్రకు అంకితంగా దీనిని నిర్మించారు.మున్సిపల్ విభాగంలో ఆర్డర్, బ్యాలెన్స్, కంటిన్యుటీకి చిహ్నంగా దీనిని షట్కోణ ఆకారంలో నిర్మించారు.
మాసాబ్ ట్యాంక్ బురుజు ఎక్కడ ఉంది ? | Where is Masab Tank Burj located
- పేరును బట్టే ఇది మాసబ్‌ట్యాంకులో ఉంది. లొకేషన్ వచ్చేసి మాసాబ్ ట్యాంక్ జంక్షన్ వద్ద. లకిడీకాపూల్ నుంచి మెహిదీపట్నం దారిలో ఫ్లైఓవర్ కింద రోడ్డులో ఉంటుంది.
మాసాబ్ ట్యాంక్ బురుజు టూరిస్ట్ ప్లేసా ? | Is Masab Tank Burj a tourist attraction
- కాదు. ఇది పూర్తి స్థాయిలో పర్యాటక ప్రదేశం కాదు. ఇక్కడి నుంచి వెళ్లే సమయంలో ఒకసారి చూసి వెళ్లేందుకు, నగర చరిత్రను గుర్తు చేసే నిర్మాణం మాత్రమే.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
