Uttarkashi Cloudburst : కుండపోత వర్షం… క్షణాల్లో మాయమైన గ్రామం
Uttarkashi Cloudburst : దేవ్ భూమి ఉత్తరాఖండ్‌లోని ఒక గ్రామం కుండపోత వర్షం వల్ల క్షణాల్లో మాయమైంది. ఏం జరుగుతుందో అని తెలుసుకునే టైమ్ కూడా ఇవ్వనంత మెరుపు వేగంతో వచ్చిన మట్టి బురదతో ఉన్న భారీ వరద ఒక గ్రామాన్ని కొన్ని సెకన్లల వ్యవధిలో మింగేసింది.
ఈ ఉత్పాతాన్ని దూరం నుంచి వీక్షించిన పర్యాటకులు షేర్ చేసిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆ దృశ్యాలు చూస్తుంటే ఒక్కసారిగా ఒళ్లు జలధరిస్తోంది.
See how quickly the debris flow of the flashflood overwhelms the retaining walls put up on the Kheer Ganga rivulet bed. People of Dharali, Uttarkashi, Uttarakhand were living with a false sense of security. Horrific footage.pic.twitter.com/nEXAFI09sJ
— Anand Sankar (@kalapian_) August 5, 2025
ఉత్తర్కాశిలోని ధరాలి అనే గ్రామంలో ఖీర్ గంగా నది ఎగువ ప్రాంతంలో క్లౌడ్ బరస్ట్ అవడంతో ఒక్కసారిగా మెరుపు వరద ఏర్పడి అది స్థానిక గ్రామాన్ని ముంచేసింది. ఈ వరదలో ఇళ్లు, హోటల్లు, ఇతర నిర్మాణాలు అన్నీ కూడా మట్టిలో కూరుకుపోయాయి.
❗️🌊🇮🇳 – Devastating Flash Floods Ravage Uttarkashi, India, Leaving Destruction in Their Wake
— 🔥🗞The Informant (@theinformant_x) August 5, 2025
A catastrophic cloudburst triggered flash floods in Uttarkashi’s Dharali village, located near Harsil in Uttarakhand, India, causing widespread devastation.
The deluge, fueled by a… pic.twitter.com/CKJer99Ql4
మట్టిలో కూరుకుపోయిన వారిలో నలుగురు చనిపోయారని, 100 మందికి పైగా మిస్ అయ్యారని అధికారులు తెలిపారు. స్థానిక ఇండోటిెబెట్ బార్డర్ పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్, ఎస్డిఆర్ఎఫ్, ఆర్మీ, స్థానిక అధికారులు కలిసి సహాయక చర్యలు చేపట్టి ప్రజలను సుమారు 50 మందిని రక్షించారు.
వర్షాకాలంలో వరద, భారీ వర్షాలు పడే ప్రమాదకరమైన ప్రాంతాలకు వెళ్లరాదని స్థానికులను, పర్యాటకులను అధికారులు సూచించారు.
మీరు కూడా వర్షాకాలంలో ఏదైనా టూర్ ప్లాన్ చేస్తున్నారా ? అయితే ఈ విషయాలను గుర్తుంచుకోండి.
- ఇది కూడా చదవండి : వర్షాకాలంలో వెళ్లాల్సిన పర్యాటక ప్రదేశాలు
- ఇది కూడా చదవండి : వర్షాకాలలో అస్సలు వెళ్లకూడని ప్రదేశాలు
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.