రైల్ వన్ యాప్ ద్వారా అన్రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్ | RailOne App unreserved ticket booking
RailOne App unreserved ticket booking , ప్లాట్‌ఫామ్ టికెట్లు ఎలా బుక్ చేయాలి ? 3 శాతం డిస్కౌంట్ ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసుకోండి …సింపుల్ ట్రావెల్ గైడ్
RailOne App unreserved ticket booking , ప్లాట్‌ఫామ్ టికెట్లు ఎలా బుక్ చేయాలి ? 3 శాతం డిస్కౌంట్ ఎప్పుడు అప్లై అవుతుందో తెలుసుకోండి …సింపుల్ ట్రావెల్ గైడ్
రైల్ వన్ యాప్ అనేది ఇండియన్ రైల్వే (Indian Railways) ఇటీవలే లాంచ్ చేసిన సింగిల్ విండో ప్యాసింజర్ అప్లికేషన్.
ముందు వేరువేరుగా ఉండే యాప్ సేవలను ఇప్పుడు ఒక్కే ప్లేస్‌లోకి తీసుకువచ్చారు.
అన్రిజర్వ్డ్ టికెట్లు, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రిజర్వ్డ్ టికెట్లు, లైవ్ ట్రైన్ ట్రాకింగ్, గ్రీవెన్స్ రెడ్రెస్సెల్, ఈ-క్యాటరింగ్ లాంటి ఆప్షన్స్ అన్నీ ఈ యాప్‌తో అనుసంధానం చేశారు.
ప్రయాణికుల కోణంలో చూస్తే ఇది జస్ట్ యాప్ మాత్రమే కాదు.
రైల్వే స్టేషన్లో టైమ్, శ్రమ, ఒత్తిడి తగ్గించే ఒక డిజిటల్ టూల్.
మరీ ముఖ్యంగా తక్కువ దూరం ప్రయాణించే వారికి ఈ యాప్ రోజూ ఉపయోగపడుతుంది.
ముఖ్యాంశాలు
అన్రిజర్వ్డ్, ప్లాట్‌ఫామ్ టికెట్లు ఎలా బుక్ చేయాలి?
| How to Book Unreserved & Platform Tickets
గతంలో ఉన్నట్టుగా స్టేషన్‌కి వెళ్లాక కౌంటర్ దగ్గర లైన్లో నిలబడే అవసరం లేదు.
RailOne App లో అన్రిజర్వ్డ్ టికెట్లతో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్లను కూడా సులభంగా బుక్ చేసుకోవచ్చు.
యాప్ ఇన్స్టాల్ చేసి లాగిన్ అయిన తర్వాత,
అన్రిజర్వ్డ్ లేదా ప్లాట్‌ఫామ్ టికెట్ ఆప్షన్లో మీకు కావాల్సినదాన్ని సెలెక్ట్ చేయాలి.
- ఇది కూడా చదవండి : సంక్రాంతికి ట్రైన్ టికెట్ల గురించి వర్రీ అవుతున్నారా ? అదనపు స్పెషల్ ట్రైన్లు ప్రకటించిన South Central Railway
మీరు బయల్దేరే స్టేషన్, డెస్టినేషన్ సెలెక్ట్ చేసి డిజిటల్ పేమెంట్ పూర్తి చేస్తే,
టికెట్ ఫోన్లోనే వచ్చేస్తుంది.
ఇది నిత్యం రైలులో ప్రయాణించే వాళ్లతో పాటు,
అప్పుడప్పుడూ ట్రైన్లో ప్రయాణించే కుటుంబాలకు, పెద్దలకు కూడా చాలా ఉపయోగపడుతుంది.
3 శాతం డిస్కౌంట్ ఎప్పుడు వస్తుంది?
| When Does 3% Discount Apply

Indian Railways డిజిటల్ పేమెంట్స్‌ని ప్రోత్సహించేందుకు ఈ యాప్‌ను వినియోగంలోకి తీసుకువచ్చింది.
రిజర్వ్ కాని టికెట్లను బుక్ చేసుకునే ప్రయాణికులకు 3 శాతం రాయితీ ఇవ్వనున్నట్టు ప్రకటించింది.
ఈ డిస్కౌంట్
2026 జనవరి 14వ తేదీ నుంచి 2026 జూలై 14వ తేదీ వరకు వర్తిస్తుంది.
UPI, Google Pay, PhonePe, Paytm, నెట్ బ్యాంకింగ్ లాంటి డిజిటల్ మోడ్స్ వినియోగిస్తే,
డిస్కౌంట్ ఆటోమేటిక్‌గా అప్లై అవుతుంది.
R-Wallet పేమెంట్‌కు ఇప్పటికే క్యాష్‌బ్యాక్ విధానం ఉండటం వల్ల,
దానికి ప్రత్యేకంగా ఈ 3% డిస్కౌంట్ వర్తించదు.
చిన్న చిన్న ప్రయాణాలు చేస్తూనే, ఇకపై కొంత డబ్బు ఆదా చేసుకోవచ్చు అని చెప్పవచ్చు.
- ఇది కూడా చదవండి : 48 గంటల ట్రైన్ ప్రయాణం –North East వెళ్లేముందు తెలుసుకోవాల్సిన నిజాలు
ఎవరికీ ఎక్కువ ఉపయోగపడుతుంది?
ఈ ఫీచర్ అందరి కోసం తీసుకువచ్చినా, కొంతమందికి మాత్రం ఇది మరింత ఉపయోగపడుతుంది.
- నిత్యం తక్కువ దూరం రైలులో ప్రయాణించే వారు
- ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు
- కాలేజ్ విద్యార్థులు
వీళ్లకు డబ్బుతో పాటు టైమ్ కూడా సేవ్ అవుతుంది. తీర్థయాత్రలకు వెళ్లే సమయంలో, పొద్దున్నే టికెట్ కౌంటర్ల దగ్గర ఉండే రష్ గురించి టెన్షన్ పడే అవసరం ఉండదు.
కుటుంబంతో, పెద్దలతో ప్రయాణించే వారు కూడా ప్రశాంతంగా టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణించవచ్చు. ప్లాట్‌ఫామ్ వరకు మాత్రమే వెళ్లి, బంధుమిత్రులను ట్రైన్ ఎక్కించి వచ్చేవారికీ ఇది ఉపయోగపడుతుంది.
- ఇది కూడా చదవండి : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్… ఈ లిమిట్ దాటితే లగేజీని కోచులోకి తీసుకెళ్లనివ్వరు |
క్యూలో నిలబడాల్సిన పని లేదు.
RailOne App స్పెషాలిటీ ఏంటంటే,
మీరు స్టేషన్‌కు కొంచెం లేటుగా వెళ్లినా కూడా టికెట్ వెంటనే బుక్ చేసుకుని ట్రైన్ ఎక్కవచ్చు.
డబ్బు మోసుకెళ్లాల్సిన అవసరం లేదు.
క్యూలో నిలబడాల్సిన పని లేదు.
ప్రత్యేకంగా ఉదయం సమయంలో ఉండే రద్దీని తట్టుకోవడం కష్టంగా అనిపించే వారు,
ఈ యాప్ వాడితే ఒత్తిడి లేకుండా టికెట్ పొందవచ్చు.
ఒక రకంగా చెప్పాలంటే,
రైల్వే ప్రయాణ అనుభవాన్ని మార్చే దిశలో ఇది మరో అడుగు.
భారతీయ రైల్వే తాజా సమాచారం కోసం క్లిక్ చేయండి.
అన్రిజర్వ్డ్ టికెట్ వ్యాలిడిటీ & రూల్స్
Unreserved Ticket Validity and Rules
ఇది ప్రయాణికులకు చాలా ఇంపార్టెంట్ విషయం.
RailOne App లో బుక్ చేసిన అన్రిజర్వ్డ్ టికెట్లు జర్నీ ప్రారంభం అయ్యాక మాత్రమే వ్యాలిడ్ ఉంటాయి.
టికెట్ బుక్ చేసిన తరువాత పరిమిత కాలంలోనే ప్రయాణం చేయాల్సి ఉంటుంది.
Ticket Expire అయ్యాక ప్రయాణిస్తే రైల్వే ఫైన్ పడొచ్చు.
అందుకే మీరు గుర్తుంచుకోవాల్సింది:
- రైల్వే టికెట్ బుక్ చేసిన తరువాత ప్రయాణాన్ని వాయిదా వేయకండి
- జర్నీ స్టార్ట్ టైమ్ & టికెట్ వ్యాలిడిటీ టైమ్ తప్పకుండా చెక్ చేసుకోండి
RailOne App ఎప్పుడు వాడకూడదు?
When To Not Use RailOne App?
రైల్ వన్ యాప్ చాలా ఉపయోకరంగా ఉంటుంది అనేది వాస్తవమే.
కానీ కొన్ని సందర్భాల్లో ఇది పని చేయదు.
ఈ సందర్భాల్లో వాడకూడదు:
- దూర ప్రయాణాలు చేసే Express / Superfast Trains కోసం
- Sleeper / AC Reserved Coaches కోసం
- Tatkal Reserved Tickets కోసం
అలాంటి సందర్భాల్లో IRCTC Regular Reservation Process ఫాలో అవ్వాలి.
ఇలా చేసి చూడండి | RailOne App – Real-Life Travel Tip |
(Mock Test Scenario)
సపోస్ మీరు స్టేషన్‌కు లేటుగా చేరుకున్నారు.
క్యూలో నిలబడితే ట్రైన్ మిస్ అవుతుంది.
అప్పుడు:
- RailOne App లో టికెట్ వెంటనే బుక్ చేసుకోవచ్చు
- జేబులోంచి క్యాష్ తీసే అవసరం లేదు
- క్యూలైన్‌తో పనే లేదు
- మార్నింగ్ రష్ టైమ్‌లో ప్రశాంతంగా జర్నీ స్టార్ట్ చేయొచ్చు
ముఖ్యంగా:
- నిత్యం ప్రయాణాలు చేసే వారికి
- పెద్దవారికి
ఈ యాప్ చాలా ఉపయోగపడుతుంది.
3% డిస్కౌంట్ – చిన్న మాట
3% Discount – Small Disclaimer
RailOne App లో అన్రిజర్వ్డ్ టికెట్లపై 3% డిస్కౌంట్ విషయంలో రైల్వే ఒక స్పష్టమైన పాలసీని పాటిస్తోంది.
- టికెట్ బుక్ చేసిన తరువాత లిమిటెడ్ టైమ్‌లోనే ప్రయాణం ప్రారంభించాలి
- ఈ డిస్కౌంట్ 2026 జనవరి 14 నుంచి జూలై 14 వరకు మాత్రమే ఉంటుంది
- తరువాత కొనసాగుతుందా లేదా అనేది అప్పుడే తెలుస్తుంది
తాజా సమాచారం కోసం:
- రైల్వే అధికారిక నోటిఫికేషన్లను గమనించండి
- మళ్లీ ప్రయాణికుడు డాట్ కామ్ చూడండి
సందేహం – సమాధానం
RailOne App – Common Traveller Doubts (FAQ)
RailOne App లో బుక్ చేసిన టికెట్‌ను TT కి ఎలా చూపించాలి?
How To Show Ticket Booked On RailOne App To TT?
సమాధానం:
యాప్ ఓపెన్ చేసి డిజిటల్ టికెట్ చూపించవచ్చు.
స్క్రీన్ షాట్ కూడా సరిపోతుంది.
కానీ వెరిఫికేషన్ చేసే అవకాశం ఉంటుంది.
లేకపోతే టికెట్ చెల్లదా?
Will Ticket Be Valid If There Is No Network?
సమాధానం:
నెట్వర్క్ లేకపోయినా, ముందుగానే టికెట్‌ను
- డౌన్లోడ్ చేసుకున్నా
- లేదా స్క్రీన్ షాట్ తీసుకున్నా
టికెట్ చెల్లుతుంది.
అయితే డౌన్లోడ్ చేసుకుని పెట్టుకోవడం బెస్ట్.
RailOne App లో ప్లాట్‌ఫామ్ టికెట్ బుక్ చేయవచ్చా?Can We Book Platform Tickets On RailOne App?
సమాధానం:
అవును.
ఇదే యాప్ ద్వారా Platform Tickets కూడా బుక్ చేయవచ్చు.
మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
