మిడిల్ ఈస్ట్‌తో పాటు నార్త్ అమెరికాలో బడ్జెట్ ఎయిర్‌లైన్స్‌లో ఎయిర్ అరేబియా (Air Arabia) మంచి పేరును సంపాదించుకుంది. తాజాగా బడ్జెట్ ప్రయాణికుల కోసం సూపర్ సీట్ సేల్ ఆఫర్ తీసుకువచ్చింది. ఏకంగా 5 లక్షల సీట్లను ఇందులో అందుబాటులోకి తీసుకువచ్చింది.
ముఖ్యాంశాలు
కేవలం రూ.5,914 నుంచి ప్రారంభం | Super Seat Sale
ఈ సేల్ వచ్చేసి 2025 ఫిబ్రవరి 17న ప్రారంభం కాగా మార్చి 2 వరకు కొనసాగనుంది. ఇందులో మీరు వన్ వే టికెట్‌ను కేవలం ఏఈడీ 129 అంటే రూ.5,914 కే బుక్ చేసుకోవచ్చు. ఈ టికెట్లు బుక్ చేసుకున్న ప్రయాణికులు 2025 సెప్టెంబర్ 1 నుంచి 2026 మార్చి 28 వరకు తమ ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవచ్చు.
ఎక్కడికి వెళ్లవచ్చు ? | Air Arabia Destinations
యూఏఈ, మొరాకో(Morocco), ఈజిప్టు… ఇలా మీరు ప్రపంచ వ్యాప్తంగా 200 డెస్టినేషన్స్‌కు టికెట్లను బుక్ చేసుకోవచ్చు. ఇందులో పాపులర్ డెస్టినేషన్స్ వచ్చేసి:
- భారత దేశంలోని ముంబై, ఢిల్లీ, అహ్మదాబాద్, బెంగుళూరు, హైదరాబాద్ (Air Arabia Hyderabad), చెన్నై, కలకత్తా, జైపూర్, నాగ్‌పూర్, గోవా, తిరువనంత పురం, కోచి, కోయంబత్తూర్, కోజికోడ్ ప్రాంతాల నుంచి మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు.
- అంతర్జాతీయంగా అయితే యూఏఈ, షార్జా, అబు ధాబి, రస్ ఆల్ ఖైమా (Ras Al Khaimah).
- దీంతో పాటు యూరోప్ ఆఫ్రికా, ఆసియాలోని మిలాన్, వియోన్నా, కైరో, క్రాకోవ్, ఏథెన్స్, మాస్కో, బాకు, టిబ్లిస్, నైరోబీ వంటి ప్రాంతాలకు వెళ్లవచ్చు.
టికెట్లు ఎలా బుక్ చేసుకోవాలి ? | How To Book Air Arabia Flight Tickets

మీ డ్రీమ్ డెస్టినీకి ఇక టికెట్లు బుక్ చేసుకోవడం చాలా ఈజీ
- ముందుగా ఎయిర్ అరేబియా అధికారిక వెబ్‌సైట్‌ను విజిట్ చేయండి. ఆ వెబ్‌సైట్స్ వచ్చేసి:
www.airarabia.com లేదా https://www.airarabia.com
- తరువాత మీరు వెళ్లాలి అనుకుంటున్న ప్రాంతం, తేదీలను పైన వివరించిన గడువు తేదీల్లోగా బుక్ చేసుకోండి.
- డిస్కౌంట్ ఉన్న ధరను ఎంచుకొని బుకింగ్‌ను పూర్తి చేయండి.
చక్కని ప్రయాణ అనుభవానికి | Air Arabia Travel Experience
మీ ప్రయాణాన్ని మీరు మీకు నచ్చినట్టుగా కస్టమైజ్ చేసుకునే అవకాశాన్ని కల్పిస్తోందిన ఎయిర్ అరేబియా. వీటీని వాల్యూ ఆడెడ్ సర్వీసెస్ అంటారు.
Half a million seats are on sale across our network. Book by 2nd March 2025 and start your journey from 1st September 2025. Don’t miss out on the biggest sale! ✈🌍 pic.twitter.com/wyjeGfoyuQ
— Air Arabia (@airarabiagroup) February 16, 2025
- ప్రీ-బుకింగ్ బ్యాగేజ్ : మీ బ్యాగేజ్‌కు సంబంధించిన బుకింగ్ ముందు చేసుకుంటే మీరు 90 శాతం వరకు డబ్బును ఆదా చేసే అవకాశం ఉంటుంది.
- మీ సీటు రిజర్వ్ చేసుకోండి : ముందస్తుగా బుక్ చేసుకునే ప్రయాణికులకు వారికి నచ్చిన సీట్లను..అంటే విండో, ఐల్ (Aisle) సీట్లను బుక్ చేసుకునే అవకాశం లభిస్తుంది.
- ట్రావెల్ ఇన్సురెన్స్ | Travel Insurance : అన్నం ఉడకడానికి నీరు ఎంత అవసరమో విదేశీ ప్రయాణాల్లో ట్రావెల్ ఇన్సురెన్స్ అనేది అంత అవసరం. దీని వల్ల ఫ్లైట్ మోడిఫికేషన్, క్యాన్సలేషన్, ప్రమాదం జరిగినా, వైద్య అవసరాలకు అయ్యే ఖర్చు లేదా నష్టం మీకు కవర్ అవుతుంది.
- ప్రీ సెలెక్టెడ్ మీల్ : స్కై కేఫ్ మెన్యూలో (Sky Cafe Menu) లో మీకు నచ్చిన ఆహార పదార్థాన్ని ముందుగానే బుక్ చేసుకోవచ్చు.
ఎయిర్ అరేబియా విజయగాథ | Air Arabia Success Story
ప్రపంచ విమానయాన సంస్థల్లో (International Airlines) ఎయిర్ అరేబియా తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సొంతం చేసుకుంది. యూఏఈలోని షార్జాకు (Sharjah) చెందిన సంస్థ ఇది. 2003లో ప్రారంభమైన ఈ సంస్థ ప్రయాణికులకు అందుబాటు ధరలోనే మెరుగైన సేవలు అందిస్తూ మంచి పేరును సంపాదించుకుంది.
2024 లో ఎయిర్ అరేబియా 1.6 బిలియన్ల యునైటెడ్ అరమ్ ఎమిటేట్స్ దిర్హామ్స్ (AED) ప్రీ టాక్స్ ప్రాఫిట్‌ను బుక్ చేసుకుంది. 2023 తో పోల్చితే ఈ లాభం 4 శాతం పెరిగింది. మొత్తం ఆదాయం కూడా పెరగి ఏఈడి 6.63 బిలయన్లుగా నమోదైంది. ఇందులో కూడా 11 శాతం పెరుగుదల కనిపించింది.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.