UTS App: ఈ యాప్‌తో రైల్వే టికెట్లు కొంటే 3 శాతం క్యాష్‌బ్యాక్

షేర్ చేయండి

క్యాష్‌లెస్ టికెటింగ్ దిశలో దక్షిణ మధ్య రైల్వే వేగంగా అడుగులు ముందుకు వేస్తోంది. అందులో భాగంగా తన యూటీఎస్ (UTS App) మొబైల్‌ యాప్‌ను ప్రయాణికులకు మరింత చేరువ చేసే ప్రయత్నం మొదలు పెట్టింది.

రిజర్వ్ అవ్వని టికెట్లను ఈ యూటీఎస్ యాప్‌ నుంచి కొనుగోలు చేసి 3 శాతం వరకు రాయితీని పొందే సదుపాయం కల్పిస్తోంది. ఈ సదుపాయం వల్ల డిజిటల్ పేమెంట్‌ను ప్రమోట్ చేయడంతో పాటు క్యూలైన్లో నిలబడే ఇబ్బంది నుంచి కూడా ప్రయాణికులు తప్పించుకోవచ్చు.

డిజిటల్ చెల్లిపులు ఇలా | UTS Mobile App

యూటీఎస్ యాప్‌లో వచ్చిన కొత్త అప్డేట్స్ వల్ల అనేేక విధాలుగా పేమెంట్స్ చేసే అవకాశం ప్రయాణికులకు కలుగుతుంది. 

యూటీఎస్ యాప్ నుంచి రైల్వే టికెట్ కొనుగోలు చేసే ప్రయాణికులు పైన వివరించిన ఏ పేమెంట్ విధానం ద్వారా అయిన పేమెంట్ చేయవచ్చు. దీని వల్ల చాలా టైమ్ సేవ్ అవుతుంది. 

3 శాతం క్యాష్‌ బ్యాక్ | Cash Back On R-Wallet

UTS App
యూటీఎస్ యాప్

యాప్ ద్వారా టికెట్లు బుక్ చేయడాన్ని ప్రోత్సాహించేందుకు ఇన్ ఆప్ వ్యాలెట్ అయిన ఆర్-వ్యాలెట్‌ (R-wallet) ఉపయోగాగాన్ని ప్రోత్సాహిస్తోంది దక్షిణ మధ్య రైల్వే. ఈ యాప్ వినియోగించి రైల్వే టికెట్లు బుక్ చేసుకుంటే 3 శాతం క్యాష్ బ్యాక్ ఇవ్వనుంది . ఈ వ్యాలెట్లో యూజర్లు రూ.20,000 వరకు నగదును అందుబాటులో ఉంచుకోవచ్చు. 

తరచూ ప్రయాణాలు చేసే వారికి ఇది బాగా ఉపయోగపడుతుంది. డిజిటల్ చెల్లింపులు చేసే వారికి క్యాష్‌బ్యాక్ (Cash Back) ప్రయోజనం కలగనుంది.

యూటీఏస్ యాప్ ప్రయాణం  | UTS App History

దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికులు ఎక్కువగా వినియోగించే యాప్స్‌లో యూటీఎస్ (Unreserved Ticketing System) యాప్ ఒకటి. నిత్యం దీని యూజర్ల సంఖ్య పెరుగుతూ వస్తోంది :

యూజర్లకు వేగవంతమైన టికెటింగ్ సౌకర్యాన్ని కల్పించడం వల్లే యూజర్ల సంఖ్య సాధ్యం అయింది అంటున్నారు అధికారులు.

ఆ ఇబ్బందులు తొలగింపు

గతంలో యూటీఎస్ యాప్ వినియోగించే ప్రయాణికులకు ఎక్కువ దూరం టికెట్లు కొనుగోలు చేయడంలో ఇబ్బందిగా ఉండేది. ఈ ఇబ్బందిని తొలగించింది దక్షిణ మధ్య రైల్వే (South Central Railways) . ఇక ప్రయాణ టికెట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ టికెట్లను ప్రయాణికులు ఎక్కడి నుంచి అయినా కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. దీని వల్ల క్యూలో నిలబడాల్సిన అవసరం తగ్గిపోతుంది. 

ప్రధాన ఫీచర్లు | Some Features of the UTS App

యూటీఎస్ యాప్ (UTS App) అనేది యూజర్ ఫ్రెండ్లీ ఇంటర్‌ఫేస్ ఉన్న యాప్. ఇందులో అనేక ఫీచర్లు వినియోగదారులు సులభంగా ఈ యాప్‌ను వినియోగించే సదుపాయాన్ని కల్పిస్తున్నాయి.

వినియోగదారుల సేవా కేంద్రం : ప్రయాణికుల కోసం వినియోగదారుల సేవా కేంద్రంతో పాటు, సాధారణ ప్రశ్నలు వాటి సమాధానాలు (FAQs), యూజర్ గైడ్ కూడా అందుబాటులో ఉంటుంది.

📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

షేర్ చేయండి

Leave a Comment

error: Content is protected !!