మహాకుంభ మేళాకు వెళ్లాలని కోరుకునే భక్తుల కోసం భారత దేశంలోని ఒక రాష్ట్రం బంపర్ ఆఫర్ ప్రకటించింది. ప్రయాగ్‌రాజ్ వెళ్లాలని కోరుకునే ప్రయాణికులకు ఉచిత రైల్వే ప్రయాణాన్ని ( Free Train Travel ) ప్రకటించింది. ఆధ్యాత్మిక టూరిజాన్ని ( Spiritual Tourism ) ప్రోత్సాహించేందుకు ఇటీవలే ఈ ట్రైనును జెండా ఊపి ప్రారంభించారు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి. మరి ఆ రాష్ట్రం పేరేంటో తెలుసా ?
ఆధ్యాత్మిక టూరిజాన్ని ప్రోత్సాహించేందుకు గోవా రాష్ట్ర ప్రభుత్వం కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఇందులో భాగంగా కుంభమేళా జరిగే ప్రయాగ్‌రాజ్ వరకు భక్తులకు ఉచిత రైలు ప్రయాణ సౌకర్యాన్ని అందించనుంది. ఈ కార్యక్రమాన్ని గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్ ( Pramod Sawant) ఇటీవలే ప్రారంభించారు.
ముఖ్యాంశాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక సంగమం అయిన కుంభ మేళాకు ( Maha Kumbh Mela 2055 ) వెళ్లే ప్రయాణికులకు మంచి అనుభూతిని కలిగించేలా ఈ ప్రయాణం ఉంటుంది అని ప్రమోద్ సావంత్ తెలిపారు.ఈ ప్రయాణానికి సంబంధించిన మరిన్ని విశేషాలు.
1.ప్రత్యేక ట్రైను | Goa – Prayagraj Free Train
గోవా నుంచి ప్రయాగ్‌రాజ్ వరకు వెళ్లే ఈ ట్రైను 1,000 మంది భక్తులతో 2025 ఫిబ్రవరి 8వ తేదీన ప్రారంభమైంది. ఈ ఉచిత రైలు ప్రయాణం 34 గంటల పాటు సాగుతుంది. ఇందులో ప్రయాణికులు అరుదైన మహాకుంభ మేళాలో పవిత్ర నదీస్నానం ఆచరించేందుకు బయల్దేరారు.
2.డెడికేటెడ్ సర్వీస్
ముఖ్యమంత్రి దేవ్ దర్శన్ యోజనా అనే ( Mukhyamantri Dev Darshan Yojana ) కార్యక్రమంలో భాగంగా గోవా ప్రయాగ్‌రాజ్ మధ్య ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది గోవా ప్రభుత్వం. ఇది 2025 ఫిబ్రవరి 13 నుంచి ఫిబ్రవరి 21 వరకు కొనసాగుతుంది. ఈ కార్యక్రమం ద్వారా తీర్థయాత్రలను ప్రోత్సాహించాలని ప్రభుత్వం భావిస్తోంది.
3.ప్రయాణ అర్హత | Travel Eligibility
గోవా ప్రభుత్వం ప్రారంభించిన ఈ ఉచిత రైలు ప్రయాణంలో భాగం అవ్వాలి అనుకుంటున్న భక్తుల వయసు 18 నుంచి 60 ఏళ్ల మధ్యలో ఉండాలి. వారి ఆరోగ్యం బాగుండాలి. తీర్థయాత్రను ఆస్వాదించి, నదీస్నానం ఆచరించేందుకు చురుకుగా ఉండే ఈ ఏజ్ వాళ్లను ఎంచుకున్నారు. దీంతో పాటు యువతను ఎక్కువ సంఖ్యలో ఈ యాత్రలో భాగం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది.

4.కాంప్లిమెంటరీ మీల్స్ | Complimentary Meals
ఈ కార్యక్రమంలో భక్తులకు ఉచిత రైలు ప్రయాణం ( Free Train Travel ) మాత్రమే కాదు వారికి ఉచిత భోజన సదుపాయం కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. ప్రయాణికులకు ఉచిత ఫుడ్ ప్యాకెట్స్ అందిస్తారు. దీని వల్ల ఈ జర్నీలో ఆహారం గురించి వర్రీ అవ్వాల్సిన అవసరమే ఉండదు.
- ఇది కూడా చదవండి : ఈట్రైనుకు టికెట్ లేదు, టీసీ లేడు: 75 ఏళ్ల నుంచి ఫ్రీ సేవలు
5.తగిన జాగ్రత్తలు
ఈ ప్రయాణంలో యాత్రికుల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. దీని కోసం ఆరోగ్య నిపుణుల సాయం తీసుకుంది. ఈ ప్రయాణంలో ఈ నిపుణులు కూడా ఉంటారు. ప్రయాగ్‌రాజ్ (prayagraj ) వెళ్లే భక్తులు పూర్తి ఆరోగ్యంతో అక్కడికి చేరుకుని తీర్థయాత్రను దిగ్విజయంగా పూర్తి చేసేలా ప్రణాళిక వేశారు.
మొత్తానికి గోవా (Goa) ప్రారంభించిన ఈ ఉచిత ట్రైను సర్వీస్ అనేది అక్కడి ప్రజలకు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభవాన్ని కలిగిస్తుంది అనడంలో సందేహం లేదు. ఇలాంటి సర్వీసులు అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రారంభించాలని భక్తులు కోరుకుంటున్నారు.
📣ఈ Travel కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. ప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి. YouTube ఛానెల్‌ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp లో జాయిన్ అవ్వడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ట్రెండింగ్ వార్తలు కోసం NakkaToka.com విజిట్ చేయండి.