Travel Tips 38 : డిసెంబర్లో సౌత్ ఇండియాలో బెస్ట్ హిల్ స్టేషన్స్ ఇవే | Hill Stations In South India
Travel Tips 38 : దక్షిణ భారతదేశంలో టాప్ 7 హిల్ స్టేషన్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. తక్కువ బడ్జెట్లో మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్లగలిగే సేఫ్ అండ్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఇవి. ఇందులో ఎక్కడికి వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి.
Travel Tips 38 : చలికాలం అంటే టూరిజం పరిశ్రమలో ఒక వేవ్ లాంటిది. ఎందుకంటే మీలోని నాలోని ప్రయాణికుడు బయటికి వచ్చి నాలుగు కొత్త ప్రాంతాల్లో తిరగాలి అనుకుంటాడు. మీరు కూడా ఈ డిసెంబర్లో…ఈ చలికాలంలో చిల్ అవ్వాలి అనుకుంటే దక్షిణ భారతదేశంలో ఉన్న టాప్ 7 హిల్ స్టేషన్స్ ఏంటో మీతో షేర్ చేస్తాను. తక్కువ్ బడ్జెట్లో మొత్తం ఫ్యామిలీ కలిసి వెళ్లగలిగే సేఫ్ అండ్ బ్యూటిఫుల్ డెస్టినేషన్స్ ఇవి. ఇందులో ఎక్కడికి వెళ్లాలో మీరే నిర్ణయించుకోండి.
ముఖ్యాంశాలు
1. ఊటి | Ooty, Tamil Nadu
తమిళనాడులో ఎన్నో అందమైన హిల్ స్టేషన్స్ (Hill Stations) ఉన్నాయి. అందులో ఊటికి ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇయర్ ఎండింగ్లో ఊటీలో చలి, పొగమంచులో ఎంజాయ్ చేయడం అనేది ఈ ఇయర్లోనే బెస్ట్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పవచ్చు.

- ఇక్కడి ఛాయ్ పత్తీ తోటలు (Tea Gardens), బొటానికల్ గార్డెన్, దగ్గర్లోని సరస్సు ఇవన్నీ కూడా హాలీవుడ్ సీన్స్‌లా కనిపిస్తాయి.
- సూర్యోదయానికి ముందే లేచి భానుడి తొలికిరణాన్ని చూడండి. చుట్టుపక్కన ఎక్కడ చూసినా మీకు అందమే కనిపిస్తుంది.
- ఇది కూడా చదవండి : Oldest Hill Stations : భారత దేశంలో టాప్ 10 అతిపురాత హిల్ స్టేషన్స్ ఇవే!
2.మున్నార్ | Munnar
డిసెంబర్లో మున్నార్ ఒక కళాకారుడి కళాఖండంలా తయారువుతుంది. ప్రకృతి తన ట్యాలెంట్ అంతా చూపిస్తూ బెస్ట్ నేచురల్ షో ప్లే చేస్తుంది.

- ఎటు చూసినా పరుచుకుని ఉన్న ఛాయ్ పత్తి తోటలు, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి వేచి చూస్తున్నట్టుగా ఉన్న మబ్బులు, ఇలా తాకి అలా ముందుకెళ్లే చల్లని గాలులు..మున్నార్ నిజంగా ఆర్టిస్ట్ ప్లే గ్రౌండ్‌గా మారిపోతుంది.
- డిసెంబర్ నుంచి ఫిబ్రవరి వరకు పీక్ టూరిస్ట్ సీజన్. అందుకే అన్ని టికెట్లు ముందుగానే బుక్ చేసుకోండి.
- ఇది కూడా చదవండి : Munnar Guide : సార్, వెళ్దామా మున్నార్ ? 8 డెస్టినేషన్స్ సిద్ధం మాస్టార్!
- Follow Prayanikudu On Instagram
3. కొడైకెనాల్ | Kodaikanal | Travel Tips 38
దీనిని కొంత మంది సౌత్ ఇండియా ఫ్రిన్సెస్ (The Princess of Hill Stations) అని కూడా అంటారు. ఇక చలికాలంలో ముఖ్యంగా డిసెంబర్ నెలలో కొడైకెనాల్లో కోడి కూడా కూయకుండా వెచ్చగా పడుకుంటుంది. ఈ సమయంలో మీరు కోడి కన్నా ముందు నిద్రలేచి బయటికి వెళ్లి అందాలు చూడండి.

- మంచి రొమాంటిక్ ట్రిప్ (Romantic Destinations) కోసం ప్లాన్ చేస్తోంటే కొడైకెనాల్ బెస్ట్ ఆప్షన్ అవుతుంది.
- కొత్త జంటలకు ఇది మంచి హనీమూన్ స్పాట్ అవుతుంది.
- కొడైకెనాల్ వెళ్తే లేక్ సర్య్యూట్ రైడ్ అస్సలు మిస్ అవ్వకండి.
4. కూర్గ్ | Coorg, Karnataka
కూర్గ్ అంటే కూల్ అని కూడా అనొచ్చు. ఎందుకంటే ఎంత చల్లగా ఉంటుందో అంతే ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడి వాతావరణం. ఇక్కడి కాఫీ తోటల్లో కాసేపు తప్పిపోయినా తప్పేం లేదు అనిపిస్తుంది.

- ఇక్కడ మీకు మంచి వ్యూస్ ఉన్న హోమ్ స్టేలు తక్కువ ధరకు లభిస్తాయి.
- ఎన్నో జలపాతాలు చూసి మంచి ఫీల్‌తో తిరిగి వస్తారు.
- ఇది కూడా చదవండి : కర్ణాటకలో ఉన్న 6 అందమైన జలపాతాలు | Waterfalls of Karnataka
5. అరకు వ్యాలీ | Araku Valley , Andhra Pradesh
ప్రకృతి తన సరుకును అంతా అరకులో దింపినట్టు ఉంటుంది వ్యాలి. ఏమందం ఏమందం ఏమందం…అది డైరక్టుగా గుండెకు వేస్తున్న బంధం అన్నట్టు ఉంటుంది బ్యూటి.

- తెలుగు ప్రయాణికులకు (Telugu Travelers) చాలా ఇష్టమైన లోకల్ డెస్టినేషన్ ఇది.
- డిసెంబర్ నెలలో ఇక్కడ చల్లని చలి, పచ్చని ప్రకృతి రెండూ ఉంటాయి. సూపర్ కాంబినేషన్ ఇది.
- దీంతో పాటు అరకు నుంచి వైజాగ్, వైజాగ్ నుంచి అరకు (Vizag To Araku Train Journey) ట్రైన్ జర్నీ అద్భుతమైన అనుభూతిని కలిగిస్తుంది.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
- ఇది కూడా చదవండి : వంజంగి ఎలా వెళ్లాలి ? ఎక్కడ ఉండాలి? ఏం చూడాలి ?
6. చిక్‌మగళూరు | Chikmagalur, Karnataka
కర్ణాటకలో చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్ ఉన్నాయి.అందులో చిక్‌మగళూరు కూడా ఒకటి. ఇక్కడి కాఫీ తోటల్లో ప్రశాంతతను వెతుక్కోవచ్చు. దీంతో పాటు కొన్ని సాహసాలు చేసేందుకు యాక్టివిటీస్ కూాడా ట్రై చేయొచ్చు.

- సెల్ప్ డ్రైవ్ వెళ్లే వారికి సూచన ఏంటంటే డిసెంబర్లో మబ్బులు చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకే కొంచెం జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.
7. యెర్కాడ్ | గరిబోళ్ల ఊటి | Yercaud, Tamil Nadu
సౌత్ ఇండియాలో (South India) చాలా తక్కువ మందికి తెలిసిన హిల్ స్టేషన్ యెర్కాడ్. దీనిని గరిబోళ్ల ఊటి ( Poormans Ooty) అని కూడా పిలుస్తుంటారు. ఇది తమిళనాడులోని తూర్పు కనుమల్లో ఉన్న సెర్వరాయన్ అనే పర్వతశ్రేణుల్లో ఉంటుంది.

- ఇది ఏడాది పొడవునా చల్లగా ఉండే హిల్ స్టేషన్
- ఇక్కడి వ్యూ పాయింట్ నుంచి బ్యూటిఫుల్ లొకేషన్స్ ఎన్నో చూడొచ్చు
- ఇక్కడి సరస్సులో బోటింగ్ చేయడం ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియెన్స్ అని చెప్పొచ్చు
డిసెంబర్లో హిల్ స్టేషన్స్ వెళ్లే వారికి ట్రావెల్ టిప్స్ | December Travel Tips
ఈ నెల ప్రయాణాలు చేయాలనేవారికి బాగా ఎక్సైటింగ్ కలిగించే విషయం. రాత్రి సమయంలో డ్రైవింగ్ చేస్తుంటే ఫాగ్ ( పొగమంచు) ఎక్కువగా ఉంటుంది ఈ విషయాన్ని అస్సలు ఇగ్నోర్ చేయకండి.
- అలాగే ఇది పీక్ సీజన్ కాబట్టి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోండి.
- సొంత వాహనాల్లో వెళ్లేవారు బండి మధ్యలో పాడైతే సొంతం రిపెయిర్ చేసుకునే విధాంగా బ్రేక్ డౌన్ కిట్ పెట్టుకోండి.
- అలాగే చలి ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేయర్డ్ అండ్ పొరలుగా దుస్తువులు వేసుకోండి
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
మరిన్ని ట్రావెల్ టిప్స్ :
- ఇది కూడా చదవండి : విమానంలో Airplane Mode ఎందుకు ఆన్ చేయాలి ? లేదంటే ఏం జరుగుతుంది ?
- ఇది కూడా చదవండి : Travel Smarter : 2025 లో ట్రావెలర్స్ వద్ద ఉండాల్సిన 5 గ్యాడ్జెట్స్
- ఇది కూడా చదవండి : హ్యండ్ లగేజ్ రూల్స్ మార్చిన థాయ్‌లాండ్..మీరు తప్పకుండా తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే !
- ఇది కూడా చదవండి :విదేశీ ప్రయాణానికి మందులు ఎలా ప్యాక్ చేయాలి? కంప్లీట్ గైడ్ | Medicines For An International Trip
- ఇది కూడా చదవండి : Flight Attendants : ఫ్లైట్ అటెండెంట్లు చేతులు ఎందుకు లాక్ చేసుకుని కూర్చుంటారు?
బొర్రా గుహల అద్భుతమైన స్టోరీ…
