టికెట్లు, టోకెన్లు లేకుండా తిరుమల వైకుంఠ ద్వార దర్శనం ఎలా? TTD Vaikuntha Dwara Darshan 2026 Guide
TTD Vaikuntha Dwara Darshan 2026 Guide గైడ్లో తిరుమల దర్శన రూల్స్ ఎలా ఉన్నాయి? టికెట్లు, టోకెన్లు, సర్వదర్శనం తేదీలు… తేదీల వారిగా ఎలా ప్లాన్ చేసుకోవాలో ఈ బ్లాగ్‌లో తెలుసుకుందాం.
TTD Vaikuntha Dwara Darshan 2026 Guide: మీరు వైకుంఠ ఏకాదశి టైమ్‌లో తిరుమల దర్శనం ప్లాన్ చేస్తున్నారా? టికెట్స్, టోకెన్లు, సర్వదర్శనం డేట్స్, గ్రౌండ్ రియాలిటీని సింపుల్‌గా వివరించే క్విక్ గైడ్ ఇది.
వైకుంఠ ఏకాదశి సమయంలో తిరుమల యాత్ర ప్లాన్ చేయడం అనేది నార్మల్ డేస్ కన్నా కొంచెం డిఫరెంట్‌గా ఉంటుంది. టికెట్స్, SSD Tokens, సర్వదర్శనం రూల్స్ అన్నీ తేదీల వారిగా మారిపోతాయి.
ఈ గైడ్లో మీకు స్టెప్ బై స్టెప్ వైకుంఠ ద్వార దర్శనం ఎలా ప్లాన్ చేసుకోవాలో సింపుల్‌గా చెబుతాను.
ముఖ్యాంశాలు
Step 1: మీరు వెళ్లే తేదీ నిర్ణయించుకోండి
ముందుగా మీరు ఏ తేదీన తిరుమలకు వెళ్లాలి అనుకుంటున్నారో నిర్ణయించుకోండి. మీ దగ్గర ఉన్న ఆప్షన్లు..
2025 డిసెంబర్ 30 / 31 – 2026 జనవరి 1వ తేదీ
ఈ తేదీల్లో Online e-DIP లేదా SSD టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనం చేసుకోవచ్చు. ఇవి లేవంటే మీరు ఈ కింది తేదీల్లో దర్శనం కోసం ప్రయత్నించవచ్చు. మీ దగ్గర టోకెన్లు లేనంత మాత్రాన తిరుమల వెళ్లలేరు అని కాదు. వెళ్లవచ్చు. కానీ దర్శనం మాత్రం టోకెన్లు, ఈడిప్ ఉంటేనే చేసుకోగలరు.
2026 జనవరి 2 నుంచి 8వ తేదీ వరకు
ఈ తేదీల్లో సర్వదర్శనం అందరికీ అందుబాటులోకి వస్తుంది. టోకెన్లు లేని భక్తులు కూడా దర్శనం చేసుకోవచ్చు.
డేట్స్ కన్ఫ్యూజ్ కాకండి. మరోసారి చదవండి. లేదంటే ప్లానింగ్ మొత్తం రాంగ్ అవుతుంది.
- ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide
Step 2: టికెట్లు, టోకెన్ల గురించి అర్థం చేసుకోండి

తిరుమలకు వెళ్లేందుకు ఎలాంటి టికెట్లు, టోకెన్లు అవసరం లేదు. ఎవరైనా వెళ్లవచ్చు. కానీ దర్శనం చేసుకునే అర్హత మాత్రం తేదీలను బట్టి మారుతుంది.
• టోకెన్లు ఉంటే – దర్శనం పక్కా (స్లాట్ టైమ్, తేదీల ప్రకారం)
• టోకెన్లు లేకపోతే – జనవరి 2వ తేదీ నుంచి 8 వరకు దర్శనం చేసుకోగలరు
Step 3: బస, ట్రావెల్ అనేది ప్రాక్టికల్‌గా ప్లాన్ చేయండి
వైకుంఠ ఏకాదశి సమయంలో మీరు కొన్ని విషయాలు గమనించాలి. ఈ సమయంలో…
• తిరుమలలో ఉండటం కన్నా తిరుపతిలో ఉండటం బెస్ట్
• ఓవర్‌నైట్ వెయిటింగ్ తప్పదు
• పెద్దవారికి లాంగ్ క్యూలో ఇబ్బందిగా అనిపించవచ్చు
తెల్లవారుజామున మూవ్మెంట్ బాగుంటుంది.
- ఇది కూడా చదవండి : వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోదగ్గ హైదరాబాద్‌లోని 9 ఆలయాలు | Vaikunta Ekadasi 2025 Hyderabad
Step 4: ఎక్స్పెక్టేషన్ కంట్రోల్ చేసుకోండి
వైకుంఠ ఏకాదశి, కొత్త సంవత్సరం ఇవన్నీ ఉన్న ఈ సమయంలో…
• వెయిటింగ్ ఎక్కువ చేయాల్సి ఉంటుంది. సమయం మీ చేతుల్లో ఉండదు
• సేమ్ డే దర్శనం చేసుకోవాలి అనుకోవడం ప్రాక్టికల్‌గా కష్టం. అయితే మీరు లక్కీ
• ఎంత భక్తి ఉందో మనసులో… అంతే ఓపిక ఉండాలి మనిషిలో
ప్రాక్టికల్‌గా ఆలోచిచండి | TTD Vaikuntha Dwara Darshan 2026 Guide
వైకుంఠ ద్వార దర్శన యాత్ర విజయం అనేది లక్కు కన్నా సరైన ప్లానింగ్‌పై ఆధారపడి ఉంటుంది.
రూల్స్ అర్థం చేసుకుని, తేదీల వారిగా క్లారిటీతో ప్రాక్టికల్‌గా ఆలోచించి వెళ్తేనే మీ తిరుమల తీర్థయాత్ర ప్రశాంతంగా పూర్తి అవుతుంది.
Prayanikudu అందించిన ఈ గైడ్ మీ యాత్రకు ఉపయోగపడుతుంది అని ఆశిస్తున్నాం.
శ్రీవారి భక్తులకు షేర్ చేసి వారికి సాయం చేయండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
