ఆంధ్రప్రదేశ్‌లో 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples
Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples గైడ్. తిరుమలతో పాటు 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు, దూరాలు, ట్రావెల్ టిప్స్.
Vaikunta Ekadasi Andhra Pradesh 7 Vishnu Temples గైడ్. తిరుమలతో పాటు 7 శ్రీ మహా విష్ణువు & అవతారాల ఆలయాలు, దూరాలు, ట్రావెల్ టిప్స్
వైకుంఠ ఏకాదిశి అనేది ఆంధ్ర ప్రదేశ్‌లో ఒక పర్వంగానే కాకుండా ఒక భక్తి యాత్రగా జరుగుతుంది. ఈ రోజు శ్రీ మహా విష్ణువుకు సంబంధించిన ఆలయాల్లో వైకుంఠ ద్వార దర్శనం, స్పెషల్ పూజలు, దీపాలంకరణ, అన్నధానం జరుగుతాయి.
రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి భక్తులు దర్శనం కోసం ప్రయాణం చేసి వస్తుంటారు. డిసెంబర్ చివరిలో ఆంధ్ర ప్రదేశ్‌లోని (Andhra Pradesh) కోట్లాది మంది ప్రజల మనసులు భక్తితో నిండిపోతాయి.
- ఇది కూడా చదవండి : తెలంగాణలో 7 ప్రసిద్ధ శ్రీ మహావిష్ణువు & అవతారాల ఆలయాలు | Vaikunta Ekadasi 2025 in Telangana
ఈ బ్లాగ్‌లో వైకుంఠ ఏకాదశి రోజు ఆంధ్రప్రదేశ్‌లో సందర్శించదగ్గ అత్యంత ప్రధానమైన 7 శ్రీ మహా విష్ణువు ఆలయాలు, అవి ఏ జిల్లాలో ఉన్నాయి, హైదరాబాద్, విజయవాడ నుంచి ఎంత దూరం, ట్రావెల్ టిప్స్ క్లియర్‌గా వివరిస్తున్నాను.
ముఖ్యాంశాలు
1. తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయం, Tirupati
Tirumala Sri Venkateswara Swamy Temple, Tirupati
📍 Distance Guide
- Hyderabad → Tirumala: 560–580 km
- Vijayawada → Tirumala: 439 km
వైకుంఠ ఏకాదశి అంటే తెలుగవారి మైండ్‌లో ముందుగా తిరుమల ఆలయమే వస్తుంది. ఈ రోజున వైకుంఠ ద్వారం తెరుచుకుంటుంది. ఇది జీవితంలో ఒక్కసారి అయినా అనుభూతి చెందాల్సిన విషయం. లక్షల మంది భక్తులు వస్తారు.

ఈ సారి 2025 డిసెంబర్ 31, 2026 జనవరి 1వ తేదీల్లో టోకెన్లు ఉన్న భక్తులకు మాత్రమే దర్శనానికి అనుమతి ఉంది. మరి సాధారణ భక్తులకు ఎప్పుడు అవకాశం ఉందో తెలుసుకోవాలి అనుకుంటే ఈ పోస్టులో పూర్తి సమాచారం అందించాము.
- ఇది కూడా చదవండి: టోకెన్ లేకపోతే అనుమతి లేదా? టీటీడీ చైర్మన్ క్లారిటీ! TTD Vaikuntha Dwara Darshan 2026
- ఇది కూడా చదవండి : తిరుమలలో దర్శనాలు ఎన్ని రకాలు ? ఏ టికెట్లు బుక్ చేసుకుంటే దర్శనం వేగంగా అవుతుంది | Tirumala Darshan Guide
Travel Tips
అడ్వాన్స్ దర్శనం టికెట్లు, అకామడేషన్ తప్పనిసరిగా ఉండేలా చూసుకోండి.
క్రమశిక్షణ, ఓపికతో దర్శనం ప్లాన్ చేసి ప్రశాంతంగా ఉండండి.

2. శ్రీ వరాహ స్వామి ఆలయం, తిరుమల
Sri Varaha Swamy Temple, Tirumala, Tirupati
📍 Distance Guide
- Hyderabad → Tirumala (Varaha Swamy Temple): 580 km
- Vijayawada → Tirumala (Varaha Swamy Temple): 440 km
తిరుమల దర్శనం తరువాత వరహా స్వామి దర్శనం పూర్తి చేయడం ఆనవాయితీగా వస్తోంది. వైకుంఠ ఏకాదశి రోజు ఈ దర్శనం చేసుకుంటే ఫలం సంపూర్ణం అని భక్తుల నమ్మకం.
తిరుమల క్షేత్రాన్ని ఒకప్పుడు ఆది వరహా క్షేత్రం అని పిలిచేవారని, శ్రీవారి కోరిక మేరకు వరాహ స్వామి వారు ఆయనకు తిరుమల కొండపై నివసించేందుకు భూమిని ఇచ్చారని చెబుతారు. దానికి కృతఙ్ఞతగా తిరుమలలో తొలి దర్శనం, తొలి నైవేద్యం శ్రీ వరాహ స్వామి వారికి జరిగే ఆచారాన్ని కానుకగా ఇచ్చారని అంటారు.
Travel Tip:
ఉదయం భక్తుల రద్దీ తక్కువగా ఉంటుంది. మీరు సూపర్‌ఫాస్ట్ దర్శనం చేసుకోవచ్చు.
- ఇది కూడా చదవండి : వైకుంఠ ఏకాదశి రోజు దర్శించుకోదగ్గ హైదరాబాద్‌లోని 9 ఆలయాలు | Vaikunta Ekadasi 2025 Hyderabad
3. సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం
Simhachalam Sri Varaha Lakshmi Narasimha Swamy Temple, Visakhapatnam
📍 Distance Guide
- Hyderabad → Simhachalam: 628 km
- Vijayawada → Simhachalam: 355 km
వైజాగ్‌లో ఉన్న ఈ అతిపురాతనమైన నరసింహ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు జరుగుతాయి. కొండపైకి వెళ్లి స్వామివారిని దర్శించుకోవడం ఒక పవిత్రమైన అనుభూతిని ఇస్తుంది.
Travel Tip:
ఉదయం సమయంలో దర్శనం చేసుకోవడం తెలివైన విషయం.
మధ్యాహ్నం, సాయంత్రం భక్తుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది.
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ ఎక్కడ జరుగుతుంది ? తేదీలేంటి ? AP Flamingo Festival 2026 Dates, Location, , Tickets, Stay Complete Guide
4. ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి)
Dwaraka Tirumala (Chinna Tirupati), Eluru
📍 Distance Guide
- Hyderabad → Dwaraka Tirumala: 372 km
- Vijayawada → Dwaraka Tirumala: 100 km

తిరుమల వెళ్లలేని భక్తులకు ద్వారకా తిరుమల వెళ్లినా సరిపోతుంది అంటారు. చిన్న తిరుపతిగా భక్తులు పిలుచుకునే ఈ ఆలయంలో వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ద్వార దర్శనం చేసుకోవడానికి చాలా మంది భక్తులు వస్తుంటారు. అయితే తిరుమలతో పోల్చితే భక్తుల రద్దీ చాలా తక్కువ.
Travel Tip:
విజయవాడ నుంచి ఒక్క రోజు ట్రిప్ కోసం మంచి ఆప్షన్.
హైదరాబాద్ నుంచి వెళ్లాలి అనుకుంటే నైట్ స్టే ప్లాన్ చేస్తే బెటర్.
కుటుంబంతో కలిసి వెళ్లగలిగిన ఆలయం.
- ఇది కూడా చదవండి : ఫ్లెమింగో ఫెస్టివల్ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు | Flamingos Festival 2025 Facts
5. మంగళగిరి పానకాల నరసింహ స్వామి ఆలయం
Mangalagiri Panakala Narasimha Swamy Temple, Guntur
📍 Distance Guide
- Hyderabad → Mangalagiri: 290 km
- Vijayawada → Mangalagiri: 14 km
ఈ ఆలయంలో పానకం ప్రసాదంగా ఇస్తారు. చాలా ఫేమస్. వైకుంఠ ఏకాదశి రోజు నరసింహ స్వామికి ప్రత్యేక అభిషేకాలు, పూజలు జరుగుతాయి. మెట్లు ఎక్కి స్వామివారిని దర్శించుకోవడం ఒక పవిత్రమైన అనుభూతిగా మిగిలిపోతుంది.
Travel Tip:
మీకు కంఫర్టబుల్ ఫుట్‌వేర్ వేసుకోండి.
నీటి బాటిల్ తీసుకెళ్లండి.
వీలైనంత త్వరగా స్టార్ట్ అవ్వండి.
6. అహోబిలం నవ నరసింహ క్షేత్రం
Ahobilam Nava Narasimha Kshetram, Nandyal
📍 Distance Guide
- Hyderabad → Ahobilam: 349 km
- Vijayawada → Ahobilam: 355 km
అహోబిలం అనేది ఆధ్యాత్మిక యాత్ర మాత్రమే కాదు, ఒక చిన్నపాటి ట్రెక్కింగ్ అనుభూతిని కల్పించే ఆలయం. నవ నరసింహ ఆలయాల్లో ఇది అత్యంత ప్రసిద్ధి. వైకుంఠ ఏకాదశి రోజు ఈ యాత్ర ఎవర్గ్రీన్ స్పిరిచువల్ ఎక్స్‌పీరియెన్స్‌గా మిగిలిపోతుంది.
Travel Tip:
ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి.
లోకల్ గైడ్ సహాయం తీసుకోండి.
బ్యాగులో స్నాక్స్, నీటి బాటిల్, మొబైల్ పవర్ బ్యాంక్ తీసుకెళ్లండి.
వెలుగులో బయల్దేరి వెలుగులోనే తిరిగి వచ్చేలా ప్లాన్ చేయండి.
- ఇది కూడా చదవండి : తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఎవరు నిర్మించారు ? శ్రీవారు వైకుంఠం విడిచి ఎందుకు వచ్చారు?
7. శ్రీ తల్పగిరి రంగనాథ స్వామి ఆలయం
Sri Talpagiri Ranganatha Swamy Temple, Nellore
📍 Distance Guide
- Hyderabad → Nellore: 456 km
- Vijayawada → Nellore: 279 km
వైష్ణవ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైన ఆలయం ఇది. నెల్లూరులోనే అత్యంత పురాతనమైన ఆలయం. వైకుంఠ ఏకాదశి రోజు సంప్రదాయబద్ధంగా వైకుంఠ ద్వార దర్శనం జరుగుతుంది. జనం తక్కువ. ప్రశాంతత ఎక్కువ.
Travel Tip:
ఫోటోలు, వీడియోలు అంటూ డిస్టర్బ్ అవ్వకండి.
తక్కువ భక్తుల రద్దీ ఉన్న ఆలయాలకు వెళ్లాలి అనుకుంటే బెస్ట్ ఛాయిస్.
వైకుంఠ ఏకాదశి ట్రావెల్ టిప్స్ | Vaikunta Ekadasi Travel Tips – Andhra Pradesh
ప్లాన్ చేసేటప్పుడు ఏకాదశి + ద్వాదశి రెండూ కూడా ప్లాన్ చేయండి.
మీరు వెళ్లబోయే ఆలయం ఉన్న నగరంలో ఇంకేమైనా చూసే ప్రదేశాలు ఉంటే ప్లాన్ చేయండి.
మీతోపాటు ఫుడ్, వాటర్ బాటిల్ తీసుకెళ్లండి.
చివరగా…
వైకుంఠ ఏకాదశి అనేది ఏపీలో ఒక తేదీ కాదు.
అది భక్తి, ఓపిక, క్రమశిక్షణలతో చేసే ఒక యాత్ర.
కొంత మంది హైదరాబాద్ నుంచి ఎంత దూరం ఉందని చూస్తారు,
కొంత మంది విజయవాడ నుంచి ఎంత దూరం అని చూస్తారు.
కాని విష్ణు భక్తి అనేది
మనసులో స్టార్ట్ అయ్యి, మనసులో పూర్తి అయ్యే యాత్ర. 🙏
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
