వైజాగ్ నుంచి లంబసింగి ఎంత దూరం ? బెస్ట్ రూట్ ఏంటి ? Vizag To Lambasingi Distance Route Travel Time
Vizag to lambasingi distance సుమారు 100 km వరకు ఉంటుంది. రోడ్ ట్రావెల్ అయితే 3.5 నుంచి 4 గంటల వరకు సమయం పడుతుంది. రూట్ డీటెయిల్స్, రోడ్ కండిషన్, బెస్ట్ ట్రావెల్ టిప్స్ మీ కోసం.
vizag to lambasingi distance ఎంత ఉంటుంది అనే సందేహం ఉందా ? రోడ్ డిస్టెన్స్, ట్రావెల్ టైమ్, బెస్ట్ రూటు, సింపుల్‌గా మీకోసం
ఈ మధ్యా చాలా మంది Vizag to Lambasingi distance ఎంత అని వెతుకుతున్నారు. మరీ ముఖ్యంగా చలికాలంలో చాలా మంది దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటున్నారు. వైజాగ్ నుంచి లంబసింగి మధ్య దూరం సుమారు 100 నుంచి 105 కిమీ ఉంటుంది.
నార్మల్ ట్రాఫిక్‌లో కార్ లేదా బైక్ ట్రావెల్ కి మూడున్నర నుంచి 4 గంటల సమయం పడుతుంది. రూట్ అయితే చాలా సింపుల్ కానీ ఘాట్ రోడ్లు ఉంటాయి కాబట్టి కాస్త బ్రేకులు, టైర్లు అన్నీ ముందే చెక్ చేసుకుని వెళ్లండి.
- ఇది కూడా చదవండి : Lambasingi : నేషనల్ క్రష్ లంబసింగి ఎలా వెళ్లాలి ? నిజంగా స్నో పడుతుందా ? 5 Tips & Facts
దూరం గురించి కొన్ని విషయాలు | Vizag To Lambasingi Distance
| సందేహం | సమాచారం |
| Distance | 110–120 km (వెళ్లే విధానాన్ని బట్టి) |
| Travel Time | సుమారు 3.5–4 గంటలు |
| Main Route | వైజాగ్ (Vizag) – నర్సిపట్నం (Narsipatnam) – చింతపల్లి (Chintapalli) – లంబసింగి (Lambasingi) |
| Road Condition | బాగానే ఉంటుంది. కానీ చివరి 15 km ఘాట్ రోడ్లు ఉంటాయి. |
| Suitable Vehicle | కారు లేదా బైక్.. కండిషన్లో ఉండేలా చూసుకోండి |
రూట్ గురించి | Route Explanation
వైజాగ్ నుంచి లంబసింగి వెళ్లేందుకు చాలా మంది Vizag – Narsipatnam – Chintapalli – Lambasingi రూట్ ప్రిఫర్ చేస్తారు. వైజాగ్ నుంచి నర్సిపట్నం వరకు హైవే స్మూత్‌గా ఉంటుంది. చింతపల్లి నుంచి లంబసింగి వరకు కాస్త ఇరుకైన ఘాట్ రోడ్లు ఉంటాయి.
చలికాలంలో ఫాగ్ ఉంటుంది. దీనికి తోడు కాస్త రష్ ఉంటుంది. జాగ్రత్తగా డ్రైవ్ చేయండి.
- ఇది కూడా చదవండి : Borra Caves: బొర్రా గుహలు ఎన్నేళ్ల క్రితం ఏర్పడ్డాయో తెలుసా ? 12 ఆసక్తికరమైన విషయాలు
బెస్ట్ టైమ్ | Best Time and Travel Tips
చాలా మంది పొద్దున్నే స్టార్ట్ అవుతారు. ఇది మంచి ఐడియానే… కానీ ఫాగ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీకు ఇబ్బందిగా అనిపిస్తే కాస్త ఎండ వచ్చే వరకు ఆగితే ఆగండి.
రాత్రి సమయంలో ఇక్కడ డ్రైవ్ చేయడం కన్నా రెస్ట్ తీసుకోవడం ఉత్తమం. ఎందుకంటే ఇక్కడి ఫాగ్, టర్నింగ్స్ ఇవన్నీ కొత్తవారికి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది.
- ఇది కూడా చదవండి : అరకు నుంచి వంజంగి ఎంత దూరం ? బెస్ట్ రూట్, ట్రావెల్ టైమ్ | Araku To Vanjangi Distance
మీరు మీ బండిలో పెట్రోలును వైజాగ్ లేదా నర్సిపట్నంలో ఫిల్ చేసుకోండి.
చివరి 25 కిమీ లో మొబైల్ నెట్వర్క్ కాస్త ఇబ్బంది పెట్టవచ్చు.
గూగుల్ మ్యాప్స్ రూట్ | Vizag To Lambasingi Google Maps Route
గూగుల్ మ్యాప్స్‌లో మీరు Vizag To Lambasingi అని సెర్చ్ చేయండి. చింతపల్లి దగ్గర నెట్వర్క్ కాస్త తక్కువగా ఉండే అవకాశం ఉంది. అందుకే Google Offline Map వాడండి.
“మీరు ఎక్కడికైనా వెళ్లే ముందు గూగుల్‌లో సెర్చ్ చేసినప్పుడు ‘Prayanikudu’ అని చివర యాడ్ చేయండి. తప్పుడు సమాచారంతో ఇబ్బంది పడకుండా ప్రయాణించండి (Travel Without Mistake).”
📣 ఈ కంటెంట్ నచ్చితే షేర్ చేయగలరు. Prayanikudu YouTube Channel ను సబ్‌స్క్రైబ్ చేసుకోండి. WhatsApp ఛానెల్లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండిప్రయాణికుడును facebook, twitter, Instagram లో ఫాలో అవ్వండి.
